మహిళ దారుణ హత్య | women murder on road side | Sakshi
Sakshi News home page

మహిళ దారుణ హత్య

Published Wed, Mar 1 2017 9:01 PM | Last Updated on Tue, Sep 5 2017 4:56 AM

women murder on road side

కారేపల్లి: ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం సీతారాంపురం శివారులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఖమ్మం ఇల్లందు జాతీయ రహదారిలోని కొత్తూరు క్రాస్‌ రోడ్డు వద్ద బుధవారం ఉదయం  మహిళ మ​ౄతదేహన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మ​ృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మ​ృతురాలు కామేపల్లిమండలం గోపాలపురం గ్రామానికి చెందిన వాంకుడోతు సక్రీ(42)గా గుర్తించారు. వివాహేతర సంబంధాల నేపథ్యంలోనే ఈ దారుణం జరిగి ఉంటుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement