ఆమె ఎవరోతెలిసింది..! | Women Murder Case Details Find in Hyderabad | Sakshi
Sakshi News home page

హతురాలి వివరాలు లభ్యం

Published Sat, Feb 9 2019 10:31 AM | Last Updated on Sat, Feb 9 2019 10:31 AM

Women Murder Case Details Find in Hyderabad - Sakshi

ఉప్పలూరి దుర్గ (ఫైల్‌)

కుత్బుల్లాపూర్‌: దేవరయాంజాల్‌ రైల్వే ట్రాక్‌ సమీపంలో దారుణ హత్యకు గురైన మహిళ ఆచూకీ ఎట్టకేలకు కనుగొన్నారు పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు. గురువారం రాత్రి ఈ హత్య జరగ్గా..  హతురాలిని గుర్తించాలని పోలీసులు స్థానికులను కోరగా ఎవ్వరూ గుర్తించలేకపోయారు. దీంతో  సీఐ మహేశ్‌ ఆయా ప్రాంతాల్లో పది బృందాలతో ఆరా తీయగా హతురాలు జగద్గిరిగుట్ట లెనిన్‌నగర్‌ ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఉండే ఉప్పలూరి దుర్గ (30) గా తేలింది.

ఈమెతో పాటు కుమారుడు, తల్లి ఉంటున్నారు. గురువారం సాయంత్రమే ఓ వ్యక్తితో దేవరయాంజాల్‌ సమీపానికి దుర్గ వచ్చినట్లు సీసీ కెమెరా ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది. వచ్చిన వ్యక్తితో మద్యం తాగిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. కావాలనే ఇక్కడికి తీసుకొచ్చి చంపారా.. లేదా ఇతరత్రా కారణాలేమైనా ఉన్నాయా.. అన్న విషయంపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.  కేసును త్వరలోనే ఛేదిస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు.

మూడేళ్ల క్రితమే భర్తతో విడాకులు..
దుర్గకు శ్రీనివాస్‌ అనే వ్యక్తితో వివాహం కాగా మూడేళ్ల క్రితం గొడవలు వచ్చి వేర్వేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే హత్య జరిగిందా.?,  దుర్గ తాగుడుకు బానిసైందని, ఎవరైనా ఈమెను ఇక్కడికి తీసుకొచ్చి హత్య చేశారా.. అన్న కోణంలో సైతం విచారణ వేగవంతం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement