
సాక్షి, హైదరాబాద్ : ఫలక్‌నామా రైల్వే స్టేషన్ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. నగరంలో కురుస్తున్న వర్షాల ధాటికి ట్రాక్ కింద భూమి కుంగిపోయింది. దీంతో ఎనిమిది అడుగుల మేర గుంత పడింది. దీన్ని గమనించిన రైల్వే హోంగార్డు రైల్వే అధికారులను అప్రమత్తం చేశారు. ఈ ఘటన బుధవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో చోటుచేసుకుంది.
అయితే ట్రాక్ కుంగిపోవడంతో అదే ట్రాక్‌పై వెళ్లాల్సిన గూడ్స్ రైలును అధికారులు నిలిపివేశారు. కరోనా కారణంగా ప్యాసింజర్, ఎంఎంటీఎస్ రైళ్లు తిరగకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టైంది. ఈ ఘటనపై విచారణ రైల్వే శాఖ అధికారులు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment