
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా సరదా యువకుడి ప్రాణం తీసింది. సనత్‌నగర్‌లో రైల్వే ట్రాక్‌పై ఇన్‌స్టా రీల్స్ రికార్డ్ చేస్తుండగా యువకుడిని వెనుక నుంచి ట్రైన్ ఢీకొట్టింది. మృతుడు మహ్మద్ సర్ఫరాజ్.. రహ్మత్ నగర్ శ్రీరామ్‌నగర్ చెందినవాడిగా గుర్తించారు. మదర్సాలో విద్యాభ్యాసం చేస్తున్నాడు.
సనత్ నగర్ రైల్వే లైన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతదేహాన్నిగాంధీ ఆసుపత్రి మార్చురీ తరలించారు. మృతుడి ఫోన్‌ను స్పాట్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు స్నేహితులు సనత్ నగర్ రైల్వే ట్రాక్‌లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడానికి వెళ్లారు. రీల్స్ చేస్తుండగా వేగంగా వచ్చి రైలు ఢీకొనడంతో సర్ఫరాజ్ అనే విద్యార్థి మృతిచెందగా, మరో ఇరువురు విద్యార్థులు రైలు రాకను గమనించి అప్రమత్తంగా వ్యవహరించడంతో సురక్షితంగా బయటపడ్డారు.
చదవండి: 3 నెలలే మొగుడు పెళ్లాలుగా.. మరో వ్యక్తితో పరిచయం.. జోరువానలో..
Comments
Please login to add a commentAdd a comment