falaknuma railway station
-
కుంగిపోయిన రైల్వే ట్రాక్.. తప్పిన పెను ప్రమాదం
-
కుంగిపోయిన రైల్వే ట్రాక్.. తప్పిన పెను ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : ఫలక్నామా రైల్వే స్టేషన్ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. నగరంలో కురుస్తున్న వర్షాల ధాటికి ట్రాక్ కింద భూమి కుంగిపోయింది. దీంతో ఎనిమిది అడుగుల మేర గుంత పడింది. దీన్ని గమనించిన రైల్వే హోంగార్డు రైల్వే అధికారులను అప్రమత్తం చేశారు. ఈ ఘటన బుధవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో చోటుచేసుకుంది. అయితే ట్రాక్ కుంగిపోవడంతో అదే ట్రాక్‌పై వెళ్లాల్సిన గూడ్స్ రైలును అధికారులు నిలిపివేశారు. కరోనా కారణంగా ప్యాసింజర్, ఎంఎంటీఎస్ రైళ్లు తిరగకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టైంది. ఈ ఘటనపై విచారణ రైల్వే శాఖ అధికారులు చేపట్టారు. -
పట్టాలు తప్పిన రైలు ఇంజిన్
-
పట్టాలు తప్పిన రైలు ఇంజిన్
హైదరాబాద్: నగరంలోని ఫలక్ నుమా రైల్వే స్టేషన్ వద్ద శనివారం ఓ రైలు ఇంజిన్ పట్టాలు తప్పింది. ఈ ఘటనతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పలు సర్వీసులను పాక్షికంగా రద్దు చేస్తున్నట్టు సీపీఆర్వో ఉమాశంకర్ తెలిపారు. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయన్నారు. రైలు పట్టాల పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు.