కుమార్తెను హత్య చేసిన తండ్రి అరెస్టు
Published Tue, Oct 1 2013 6:18 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM
తిరువొత్తియూరు, న్యూస్‌లైన్: మద్యం మత్తులో కుమార్తెను హత్యచేసిన తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. సేలం అమ్మంపట్టిలో రాము కుటుంబం నివాసముం టోంది. భార్య పళిణియమ్మాల్‌తో వివాదం ఏర్పడింది. దీంతో పళిణియమ్మాల్ భర్తను వీడి నామక్కల్ జిల్లా నామగిరి పేట వుడయార్‌పాళయంలో ఉన్న తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. పళిణియమ్మాల్ తల్లి లక్ష్మి మొదటి భర్తకు విడాకులు ఇచ్చి రాజేంద్రన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. రాజేంద్రన్‌కు మద్యం అలవాటు ఉంది.
మద్యం సేవించి వచ్చి భార్య లక్ష్మితో గోడవపడుతుండేవారు. ఆదివారం రాత్రి కూడా రాజేంద్రన్ మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆగ్రహం వ్యక్తం చేసిన రాజేంద్రన్ భార్యపై దాడి చేశాడు. దీనిని అడ్డుకున్న పళిణియమ్మాల్‌పై కూడా దాడిచేశాడు రాజేంద్ర. తీవ్రంగా గాయపడ్డ పళిణియమ్మాల్ అక్కడికక్కడే మృ తి చెందింది. ఆయిల్‌పట్టి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపి పళణియమ్మాల్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాజేంద్రన్‌ను అరెస్టు చేసి జైలుకు తలించారు.
Advertisement
Advertisement