![17 Year Old Girl Who Delivered Baby Was Molested By Moms Lovers Chennai - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/22/Delivered-Baby.jpg.webp?itok=ClGexBIM)
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, చెన్నై(తిరువొత్తియూరు): సామూహిక లైంగిక దాడికి గురైన 17 ఏళ్ల బాలికకు ఓ ఆడశిశువు జన్మించింది. కాగా ఆ బాలిక తల్లిని, ఆమె వివాహేతర ప్రియుడిని పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. వివరాలు.. చెన్నై కొరుక్కుపేట, మోక్షపురానికి చెందిన 17 ఏళ్ల బాలిక ప్లస్ వన్ చదువుతోంది. ఈమెకు గత కొన్ని రోజులకు ముందు చెన్నై ఎగ్మూర్ ఆసుపత్రిలో ఆడ శిశువు జన్మించింది. బాలికకు శిశువు జన్మించిన సంఘటనపై ఆసుపత్రి వర్గాలు ఆరాతీశాయి. దీంతో బాలిక తనపై లైంగిక దాడి జరిగినట్లు వారి దృష్టికి తెచ్చింది.
ఆసుపత్రి ఉద్యోగులు ఇచ్చిన సలహా మేర కు బాలిక సోమవారం చాకలిపేట మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇందులో కోరుక్కుపేట మీనాంబాళ్ నగర్‌కు చెందిన దురైరాజ్ (51), బషీర్ జమాల్ తదితరులు తనపై లైంగిక దాడి చేయడంతో తాను గర్భిణి అయినట్లు తెలిపింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేయగా బాలిక తల్లికి దురైరాజుకు వివాహేతర సంబంధం ఉందని, లైంగిక దాడికి తల్లి ప్రోత్సహించినట్టు తెలిసింది. దీంతో పో లీసులు బాలిక తల్లిని, ఆమె ప్రియుడిని అరెస్టు చేశా రు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
చదవండి: (ప్రియురాల్ని స్నేహితులకు విందుగా మార్చిన ప్రియుడు..)
బన్రుట్టి సమీపంలో మరో ఘటన
బన్రుట్టి సమీపంలో కూతురిపై బలవంతంగా లైంగిక దాడికి ప్రోత్సహించిన తల్లిని, ఆమె ప్రియుడిని పోలీసులు పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కడలూర్ జిల్లా బన్రుట్టి సమీపంలోని భద్ర కోట గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక అదే ప్రాంతంలోని పాఠశాలలో పన్నెండో తరగతి చదువుతోంది. ఆమె తల్లి హంసవల్లి (40). భర్త మృతి చెందడంతో ఈమెకు అదే ప్రాంతానికి చెందిన కార్తికేయన్ (35)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈక్రమంలో కార్తికేయన్‌ను కుమార్తెపై బలాత్కారం చేయడానికి హంస వల్లి ప్రోత్సహించినట్లు తెలిసింది. దీంతో కార్తికేయన్ విద్యార్థినిపై లైంగిక దాడి చేసినట్టు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హంసవల్లిని, కార్తికేయన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment