ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, చెన్నై(తిరువొత్తియూరు): తల్లిదండ్రులు విడదీస్తారేమోనన్న భయంతో ప్రేమజంట విషం తాగి, ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సూలగిరి సమీపంలో చోటు చేసుకుంది. వీరిలో ప్రియురాలు మృతి చెందగా ప్రియుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పోలీసుల కథనం మేరకు.. కర్ణాటక రాష్ట్రం పోలార్ జిల్లా వేమక్కల్ ప్రాంతానికి చెందిన ఆనందన్ కుమార్తె అనుశ్రీ (14) అదే ప్రాంతంలో ఉన్న పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది.
ఈమె కృష్ణగిరి జిల్లా సూలగిరి సమీపంలో ఉన్న ఏరాండాపల్లి గ్రామానికి చెందిన సౌందరరాజ్ (22)కు బంధువు. ఈ క్రమంలో వీరిద్దరూ ప్రేమించుకున్నారు. వారి ప్రేమకు తల్లిదండ్రులు వ్యతిరేకం తెలిపారు. ఈ క్రమంలో మూడుసార్లు ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రేమజంటను తల్లి దండ్రులు, బంధువులు తిరిగి తీసుకువచ్చారు. ఈ క్రమంలో నాలుగోసారి సౌందరరాజ్, అనుశ్రీ ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఈ విషయమై ఆనందన్ వేమక్కల్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన కుమార్తెను సౌందరరాజ్ కిడ్నాప్ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమో దు చేసి, ప్రేమ జంట కోసం గాలించారు.
ఈ సంగతి తెలుసుకున్న సౌందరరాజు, అనుశ్రీ తమను తల్లిదండ్రులు తమను విడదీస్తారని భావించి, ఎలుకల మందు పేస్టు తీసుకుని తిని, సూలగిరి వద్ద స్పృహ తప్పి పడిపోయారు. స్థానికులు గుర్తించి, వారిని కృష్ణగిరి ప్రభుత్పాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అనుశ్రీ బుధవారం మృతి చెందింది. సౌందరరాజ్ పరిస్థితి విషమంగా ఉంది. అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయమై సూలగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment