రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి
Published Thu, Jan 2 2014 2:55 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
తిరువొత్తియూరు, న్యూస్‌లైన్: వేర్వేరు చోట్ల జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతిచెందారు. పోలీసుల కథనం మేరకు కరూర్ వడివేల్ నగర్, శక్తి నగర్ ఒకటవ వీధికి చెందిన కేశవన్ ఫైనాన్స్ సంస్థను నిర్వహిస్తున్నాడు. అతనికి భార్య కోకిల(34), ప్రియ (13) అనే కుమార్తె, గోకుల్(11) అనే కుమారుడు ఉన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా పున్నం సత్రం సమీపంలోని పళమాపురం గ్రామంలో ఉన్న తల్లి లక్ష్మీ ఇంటికి కోకిల తన కుమార్తె, కుమారున్ని తీసుకువెళ్లింది. బుధవారం ఉదయం పరమత్తి వేలూర్ సమీపంలో ఉన్న వెంగాలియమ్మన్ ఆలయంలో అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు కోకిల, కుమార్తె, కుమారుడిని తీసుకుని ద్విచక్ర వాహనంలో బయలుదేరింది. పాలత్తూర్ తవిట్టు పాళయం వద్ద వెళుతుండగా నామక్కల్ నుంచి కోడిగుడ్ల లారీ ఢీకొట్టింది. కిందపడిన ముగ్గురిపై లారీ చక్రాలు ఎక్కిదిగడంతో అక్కడికక్కడే మృతిచెందారు.
చెట్టును ఢీకొన్న వ్యాన్ : మహిళ మృతి
రామనాథపురం జిల్లా కముది సమీపం మేల్ పారైకులానికి చెందిన 60 మంది రెండు వ్యాన్లలో శివగంగై జిల్లా కొల్లంకుడి, పడపురం కాళియమ్మన్ ఆలయానికి బుధవారం ఉదయం బయలుదేరారు. రెండు వాహనా ల మధ్య ఏర్పడిన పోటీ నెలకొంది. ఈ క్రమంలో శివగంగై సమీపంలోని సామియార్ పట్టి వద్ద వస్తుండ గా ఒక వ్యాన్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న వేప చెట్టును ఢీకొంది. ఈ సంఘటనలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న పొన్‌మునియమ్మాల్(27) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. పొన్‌మునియమ్మాల్‌కు వచ్చే నెలలో ఆమెకు వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమె మృతిచెందడంతో బంధువులు బోరున రోదించారు.
Advertisement