four people died
-
విష ప్రయోగమా.. క్షుద్ర పూజలా..?
వనపర్తి/గోపాల్పేట: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో శువ్రకారం ఈ సంఘటన సంచలనం రేకెత్తించింది. పోస్టుమార్టం ప్రాథమిక అంచనా ప్రకారం విష ప్రయోగం వల్ల మృతి చెంది ఉంటారని పోలీసులు భావిస్తుండగా.. గుప్త నిధి కోసం క్షుద్ర పూజలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. నాగపూర్ గ్రామానికి చెందిన హాజిరా బీ (62)కి కుమారుడు, ముగ్గురు కుమార్తెలు సంతానం. వారిలో పెద్దకుమార్తె, రెండో కుమార్తె, కుమారుడు నాగర్‌కర్నూల్‌లో, చిన్నకూతురు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఈనెల 11వ తేదీన హాజిరా బీ నాగర్‌కర్నూల్‌లో తన మనవడు, మనవరాలి జన్మదిన వేడుకలు నిర్వహించి మరుసటి రోజు కూతురు అస్మా (39), అల్లుడు ఖాజా పాషా (42), మనవరాలు హసీనా (11)తో కలసి నాగపూర్‌కు వచ్చారు. శుక్రవారం ఉదయం అదే గ్రామానికి చెందిన హాజిరా బీ బంధువు యూసుఫ్ అనారోగ్య సమస్య కారణంగా ట్యాబ్లెట్ (మాత్ర) కోసం వారి ఇంటికి వెళ్లగా.. ఇంట్లో వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు విగతజీవులుగా పడి ఉండటం చూసి నిర్ఘాంతపోయాడు. వెంటనే నాగర్‌కర్నూల్‌లో ఉండే హాజిరా బీ కుమారుడు కరీం పాషాకు, గ్రామస్తులకు విషయం చెప్పాడు. వారి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు.. ఇంటి పరిసరాలను పరిశీలించారు. వంట గదిలో హాజిరా బీ, డైనింగ్ హాలులో అస్మా, హాలులో హసీనా, ఇంటి వెనుక గుంత వద్ద ఖాజా పాషా మృతదేహాలు ఉన్నాయి. అన్ని మృతదేహాల వద్ద కొబ్బరికాయలు, నిమ్మకాయలు, పూలు, అత్తరు తదితర వస్తువులు ఉన్నాయి. అయితే క్షుద్ర పూజలేమైనా జరిగాయా అని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇంట్లో గుప్త ని«ధి కోసం తవ్విన దాఖలాలు ఉన్నాయని మృతుల బంధువులు, గ్రామస్తులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. నాలుగు మృతదేహాలు వేర్వేరు ప్రదేశాల్లో పడి ఉండటం, మృతదేహాలపై ఎక్కడా గాయాలు లేకపోవడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. 2014లో ఓసారి.. కొన్నేళ్లుగా తన ఇంటి ఆవరణలో నిధి ఉన్నట్లు నిద్రలో కనిపిస్తుందని హాజిరా బీ తరచూ చెప్పేదని గ్రామస్తులు తెలిపారు. 2014లో ఒకసారి కుటుంబ సభ్యులంతా ఇంటి ఆవరణలో ఉన్న నిధి కోసం తవ్వేందుకు యత్నించగా.. బంధువులు, గ్రామస్తులు మందలించడంతో అప్పట్లో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఎస్పీ విచారణ ఎస్పీ కె.అపూర్వరావు, డీఎస్పీ కిరణ్‌కుమార్ ఈ ఘటనపై విచారణ జరిపారు. మృతుల బంధువులతో మాట్లాడారు. ప్రాణాలు తీసుకునేంత ఇబ్బందులు లేవని వారు తెలిపారు. దీంతో పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో వివరా లు సేకరించే ప్రయత్నం చేశారు. డాగ్ ఘటనా స్థలం నుంచి సమీపంలోని రెండు ఇళ్లలోకి వెళ్లి తిరిగి అక్కడికే వచ్చి ఆగింది. గుప్త నిధులు బయటకు తీసేందుకు గతంలో పెద్దకొత్తపల్లి ప్రాంతం నుంచి ఓ వ్యక్తిని రప్పించినట్లు తెలుస్తోంది. ఈసారి కూడా ఎవరినైనా పిలిపించారా అనే కోణంలో పోలీసులు దృష్టి సారించారు. మృతుల సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నా రు. ఘటనా స్థలంలో ఉన్న వస్తువులను ఫోరె న్సిక్ ల్యాబ్‌కు పంపించారు. మృతుడు ఖాజాపాషా ఫోన్ కాల్ డేటాను సేకరించి గడిచిన ఎవరెవరితో మాట్లాడారనే కోణంలో విచారణ చేస్తున్నామని సీఐ సూర్యానాయక్ తెలిపారు. రేవల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించగా.. విష ప్రయోగం వల్లే నలుగురు మృతి చెందినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని సీఐ వెల్లడించారు. -
మత్తు లేక మరోలోకం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం, కల్లు విక్రయాలు అప్పుడప్పుడూ నిలిపేస్తారు. కానీ వరుసగా ఇన్నాళ్ల పాటు అందుబాటులో లేకపోవడం ఇదే తొలిసారి. దీంతో వ్యసనాపరులు నానా అగచాట్లు పడుతున్నారు. లాక్డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత ఒకట్రెండు రోజులు అందుబాటులో ఉన్న మద్యం, కల్లును అధిక ధరలకు కొనుగోలు చేసి తాగారు. కానీ ఆ తర్వాత పూర్తిగా అం దుబాటులో లేకపోవడంతో 5–7 రోజుల్లో బయటపడే లక్షణాలు వారిని బాధపెడుతున్నాయి. దీంతో ఒక్క సోమవారమే ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలకు వంద మంది వరకు బాధితులు వచ్చారు. ముఖ్యంగా కల్లులో కలిపే క్లోరల్ హైడ్రేట్, చాక్లెట్ పౌడర్, యూరియా, అల్ప్రాజోలమ్, డైజోఫామ్‌లాంటివి వ్యసనపరుల నాడీ వ్యవస్థను పూర్తిగా దెబ్బతీస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఆల్కహాల్‌కు దీర్ఘకాలికంగా అలవాటుపడిన వారి మెదడులోని నాడీ కణాలు కూడా మత్తుకు అలవాటు పడి ఉం టాయని, సమయానికి ఆల్కహాల్ తీసుకోకపోతే అవి తీవ్రంగా స్పందిస్తాయని అంటున్నారు. వీటి ప్రభావంతోనే ఇప్పుడు మందు, కల్లుబాబులు చిందులు వేస్తున్నారని, మతి కోల్పోయి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారని చెబుతున్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమీక్ష రాష్ట్రంలోని మందుబాబుల విచిత్ర విన్యాసాలపై ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమీక్ష నిర్వహించారు. వ్యసనానికి బానిస లై పిచ్చిగా ప్రవర్తిస్తున్న వారికి పీహెచ్‌సీల్లో చికిత్స చేయించాలని ఎక్సైజ్ అధికారులకు ఆదేశించారు. ఇటువంటి వారంతా యోగ, ధ్యానం, ఆటలు లాంటి వాటి ద్వారా ఉపశమనం పొందాలని సూచించారు. కల్లు లేక నలుగురు మృతి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో కల్లు లేక నలుగురు మృతిచెందారు. వికారాబా ద్ జిల్లా బూర్గుపల్లి నివాసి చాకలి రాచ య్య(45) ఆదివారం అర్ధరాత్రి బావి లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎక్‌మామిడికి చెందిన గొర్రె వెంకటమ్మ (50) రెండు రోజుల క్రితం కల్లు లేక సొమ్మసిల్లి పడిపోయింది. తలకు గాయాలై ఆదివారం రాత్రి మృతిచెందింది. మరో ఘటనలో కర్ణాటకకు చెం దిన మహ్మద్ అలీ(50).. నగరం నుంచి స్వస్థలానికి వెళ్తూ.. పరిగి మండలం లక్ష్మిదేవిపల్లిలో మృతిచెందాడు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం కొడిచెర్లకిS చెందిన చింతకింది లక్ష్మయ్య(39) కొన్ని రోజులుగా కల్లు దొరకకపోవడంతో పిచ్చిగా ప్రవర్తించాడు. సోమవారం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. -
తెలుగు రాష్ట్రాల్లో నెత్తురోడిన రహదారులు
-
రోడ్డు ప్రమాదంలో మున్సిపల్ కమిషనర్ సహా నలుగురి దుర్మరణం
రాయదుర్గంటౌన్/రూరల్: అనంతపురం జిల్లా కణేకల్లు మండలం నల్లంపల్లి–వీరాపురం గ్రామాల మధ్య బసయ్యతోట సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ సహా మరో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మంగళవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ షేక్ ఇబ్రహీం సాహెబ్ ఎన్నికల విధుల్లో భాగంగా మంగళవారం ఉదయం తన సొంత కారులో అనంతపురం వెళ్లారు. ఆయన వెంట మున్సిపల్ ఆర్వో అమీర్‌బాషా, ఆర్ఐ దాదా ఖలందర్ తదితరులు ఉన్నారు. విధులు ముగించుకుని రాత్రి 9,30 గంటల ప్రాంతంలో రాయదుర్గం తిరిగి వస్తుండగా అటువైపు నుంచి ఎదురుగా వస్తున్న చెన్నైకి చెందిన కారు వీరి కారును వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మున్సిపల్ కమిషనర్‌తో పాటు ఆర్వో అమీర్‌బాషా, ఆర్ఐ దాదా ఖలందర్, డ్రైవర్ ఎర్రిస్వామి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆర్ఐ సత్యనారాయణతో పాటు మరో కారులోని ప్రభు, మురుగన్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బళ్లారి విమ్స్‌కు తరలించారు. శోకసముద్రంలో మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది మరో 14 కిలోమీటర్లు ప్రయాణిస్తే రాయదుర్గం చేరుకుంటారనగా మృత్యువు వీరిని కబళించింది. నలుగురు ఉద్యోగులు దుర్మరణం చెందడంతో రాయదుర్గం మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది, కౌన్సిల్ సభ్యులు, బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న పలువురు ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు, అధికారులు రాయదుర్గం ఆస్పత్రికి పెద్ద ఎత్తున తరలివచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. -
నలుగుర్ని మింగిన మ్యాన్‌హోల్
-
‘హుదూద్’ ఎఫెక్ట్ నలుగురిని బలిగొన్న చెట్లు
కుమరాం, జాగరం (జామి): హుదూద్ తుఫాన్ బీభత్సంతో చెట్లు కూలిపోయి వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆయా గ్రామాల్లో పెను విషాదం నెలకొంది. తుపాను సందర్భంగా జరిగిన విషాదంపై స్థానికులు, పోలీసు అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జామి మండలంలోని కుమరాం గ్రామానికి చెందిన కర్రి రమేష్ (23) అనే యువకుడు ఆదివారం పశువుల పాకలోకి వెళ్తున్న సమయంలో గ్రామం సమీపంలోని తాటి చెట్టు మీద పడి అక్కడి కక్కడే మృతిచెందాడు. మృతుడు గ్రామానికి చెందిన రాము,లక్ష్మి దంపతుల ద్వితీయ కుమారుడు. మృతు డి సోదరుడు ఆర్మీలో పనిచేస్తున్నాడు. రమేష్ ఇంటర్మీడియెట్ పూర్తిచేసి కుటుంబఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగ వేటలో ఉన్నాడు. తండ్రి గీత కార్మికుడు కావడంతో అతనికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. అప్పటివరకు తన దగ్గరే ఉండి ఇంటికి వెళ్లివస్తాను నాన్నా.. అని చెప్పి బయల్దేరిన కుమారుడు కొద్దినిమషాల్లోనే మృతి చెందాడన్న వార్త తెలియగానే ఆ తల్లిదండ్రుల రోదన ఎవరికీ ఆపతరం కాలేదు. తహశీల్దార్ ఆర్.ఎర్నాయుడు, ఎస్సై ఎం.ప్రశాంత్‌కుమార్ మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్ మార్టం నిమిత్తం విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు. పడిపోయిన చెట్టును ఢీకొని.. జామి మండలంలోని జాగరం గ్రామానికి చెందిన శింగిడి రమేష్ (30) అనే యువకుడు సోమవారం తెల్లవారుజామున బైక్‌పై జామి వైపు వస్తున్న సమయం లో లక్ష్మీపురం జంక్షన్ సమీపంలో తుఫాన్ వల్ల రహదారికి అడ్డంగా పడిఉన్న చెట్టును ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, కుమారుడు ఉదయ్, కుమార్తె లిఖిత ఉన్నారు. జామి ఎస్సై ప్రశాంత్‌కుమార్ మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. కుటుంబ పెద్ద మృతితో భార్యాపిల్లలు దిక్కులేని వారయ్యారు. చెట్టుకింద తలదాచుకుని.. విజయనగరం క్రైం : పట్టణంలోని కెఎల్.పురం సమీపంలో ఈదురుగాలులకు చెట్టు కూలి మీద పడిపోవడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ద్వారపూడి గ్రామానికి చెందిన ఎస్.సత్తిబాబు (35) జేఎన్టీయూ సమీపంలో ఉన్న ఎఫ్‌సీఐ గొడౌన్లో కలాసీగా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం విధులకు సైకిల్‌పై వెళ్లాడు. విధులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వస్తున్న సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో చెట్టు కింద తల దాచుకునేందుకు సైకిల్‌ను ఆపాడు. ఆ సమయంలో అదే చెట్టు సత్తిబాబుపై పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సోమవారం ఉదయం ఆ మార్గంలో వెళ్తున్న గ్రామానికి చెందిన వ్యక్తులు చూసి మృతుని కుటుంబసభ్యులకు సమాచారం అం దించారు. మృతునికి భార్య శ్యామల, కుమార్తె జయంతి, కుమారులు రామచరణ్, చిట్టిబాబు, సోదరుడు చిన్న ఉన్నారు. కోమాలోకి వెళ్లిపోయి.. డెంకాడ మండలంలోని బంటుపల్లి పంచాయతీకి చెం దిన బమ్మిడి సూరిబాబు ఆదివారం ఉదయం పొలానికి వెళ్తుండగా రోడ్డు పక్కనున్న చెట్టు అతనిపై పడిపోవడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
పట్టాలు తప్పిన ‘రాజధాని’
బీహార్‌లో దుర్ఘటన నలుగురి మృతి, 23 మందికి గాయాలు చాప్రా/పాట్నా: బీహార్‌లో బుధవారం రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో నలుగురు మృతిచెందగా, 23 మంది గాయపడ్డారు. ఢిల్లీ నుంచి అస్సాంలోని డిబ్రూగఢ్ వెళ్తున్న ఈ రైలు సరణ్ జిల్లా చాప్రా సమీపంలోని గోల్డెన్‌గంజ్ స్టేషన్ వద్ద వేకువజామున 2.11 గంటలకు ప్రమాదానికి గురైంది. ఈ స్టేషన్ పాట్నాకు 75 కి.మీ దూరంలో ఉంది. దుర్ఘటనలో 12 బోగీలు పట్టాలు తప్పగా వీటిలో ఐదు బోల్తాపడ్డాయి. వీటిలో కొన్ని బోగీలు 700 అడుగుల దూరం ఎగిరిపడ్డాయి. ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోగా, ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన 13 మందిని పాట్నా మెడికల్ కాలేజీ, ఆస్పత్రులకు తరలించారు. బీ-2 బోగీ నుంచి మూడు మృతదేహాలను వెలికితీశారు. మృతులను పంజాబ్, యూపీకి చెందిన వారిగా గుర్తించారు. సరణ్, చంపారన్ జిల్లాల్లో భద్రతా బలగాల ఆపరేషన్లకు నిరసనగా నక్సల్స్ బుధవారం బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగింది. నక్సల్స్‌ను నిందించడం తొందరపాటు: కేంద్రం ఈ దుర్ఘటన వెనుక మావోయిస్టుల హస్తముందా లేదా అనే దానిపై వివాదం రేగింది. ప్రమాద స్థలానికి 60 కి.మీ దూరంలోని తూర్పు చంపారన్ జిల్లా మోతిహరిలో మంగళవారం రాత్రి ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పిన నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగింది. 18 బోగీలు పట్టాలు తప్పిన గూడ్సు ప్రమాదానికి నక్సల్సే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. బీహార్‌లోని తీర్హుత్, సరణ్ జిల్లాల్లో రైల్వే ఆస్తులకు మావోయిస్టులు నష్టం కలిగించే అవకాశాలున్నాయని నిఘావర్గాలుఇటీవల హెచ్చరించాయి. రైల్వే బోర్డు అధికారులు కుట్రకోణాన్ని గురించి మాట్లాడుతుంటే, కేంద్ర హోం, రైల్వే మంత్రులు మాత్రం తొందరపడి నిర్ణయానికి రాలేమని అంటున్నారు. ‘రాజధాని’ ప్రమాదానికి గురైన ప్రాంతాన్ని రైల్వే మంత్రి సదానంద గౌడ, సహాయ మంత్రి మనోజ్ సిన్హాలు పరిశీలించారు. విద్రోహ కోణంపై దర్యాప్తు చేస్తామని గౌడ చెప్పారు. దుర్ఘటనకు ముందు పట్టాలపై పేలుడు సంభవించిందని, దాని వల్లే రైలు పట్టాలు తప్పి ఉండొచ్చని రైల్వే బోర్డు చైర్మన్ అనురేంద్ర కుమార్ పేర్కొన్నారు. ‘రాజధాని’ రావడానికి 15 నిమిషాల ముందు కవిగురు ఎక్స్‌ప్రెస్ ఈ మార్గంలో సురక్షితంగా వెళ్లిందని సరణ్ జిల్లా మేజిస్ట్రేట్ చెప్పారు. ప్రమాదానికి గురైన రైలుకు ముందు ముందు జాగ్రత్తగా పైలట్ ఇంజన్‌ను నడపకపోవడంపై రైల్వే పోలీసులు, తూర్పుమధ్య రైల్వే అధికారులు నిందించుకున్నారు. మృతుల కుటుంబాలకు రైల్వే మంత్రి రూ. 2 లక్షల చొప్పున, ప్రధాని రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రధాని, కేబినెట్ సంతాపం ప్రమాదంలో ప్రాణనష్టంపై ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరారు. ప్రమాదంపై కేంద్ర కేబినెట్ విచారం వ్యక్తం చేసింది. విద్రోహ కోణంపై చర్చించి, ఆందోళన వ్యక్తం చేసింది. భేటీలో మోడీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. -
తెల్లారిన బతుకులు
రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి మానవపాడు(మహబూబ్‌నగర్), న్యూస్‌లైన్: బతుకుబాటలో విషాదం చోటుచేసుకుంది. తెల్లవారక మునుపే ఆ జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. ట్రాక్టర్‌ను లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే విగతజీవులు కాగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా కర్నూలు జిల్లా వాసులేనని పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం బొల్లవరం గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల మండలం వేముల స్టేజి సమీపంలోని ప్రైవేట్ వన నర్సరీ వద్దకు పసుపు కొమ్ములను నూర్పిడి చేసేందుకు ట్రాక్టర్లో మిషన్ తీసుకుని బయలుదేరారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో 44వ జాతీయ రహదారిపై మానవపాడు మండలం ఇటిక్యాలపాడు స్టేజీ దాటగానే వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను ఓ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఘటనలో ట్రాక్టర్‌లోని మల్లయ్య(27), అశోక్(22), సాంబశివుడు(46), వెంకట్రాముడు(48) అక్కడికక్కడే మృతి చెందారు. షేక్షావలి పరిస్థితి విషమంగా ఉండటంతో హైవే అంబులెన్స్, పెట్రోలింగ్ సిబ్బంది కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయాయి. ప్రమాదంలో జాతీయ రహదారిపై అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఘటన జరిగిన రెండు గంటల తర్వాత పోలీసులు ప్రమాదస్థలికి చేరుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఎస్ఐ విజయ్‌కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను అలంపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
జుక్కల్ చౌరస్తా వద్ద ఆటో బోల్తా: నలుగురి మృతి
నిజామాబాద్: బిచ్కుందలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. జుక్కల్ చౌరస్తా వద్ద ఆటో ఒకటి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మృతులంతా మద్నూర్ మండలం లక్ష్మాపూర్ వాసులుగా గుర్తించారు. -
రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి
తిరువొత్తియూరు, న్యూస్‌లైన్: వేర్వేరు చోట్ల జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతిచెందారు. పోలీసుల కథనం మేరకు కరూర్ వడివేల్ నగర్, శక్తి నగర్ ఒకటవ వీధికి చెందిన కేశవన్ ఫైనాన్స్ సంస్థను నిర్వహిస్తున్నాడు. అతనికి భార్య కోకిల(34), ప్రియ (13) అనే కుమార్తె, గోకుల్(11) అనే కుమారుడు ఉన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా పున్నం సత్రం సమీపంలోని పళమాపురం గ్రామంలో ఉన్న తల్లి లక్ష్మీ ఇంటికి కోకిల తన కుమార్తె, కుమారున్ని తీసుకువెళ్లింది. బుధవారం ఉదయం పరమత్తి వేలూర్ సమీపంలో ఉన్న వెంగాలియమ్మన్ ఆలయంలో అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు కోకిల, కుమార్తె, కుమారుడిని తీసుకుని ద్విచక్ర వాహనంలో బయలుదేరింది. పాలత్తూర్ తవిట్టు పాళయం వద్ద వెళుతుండగా నామక్కల్ నుంచి కోడిగుడ్ల లారీ ఢీకొట్టింది. కిందపడిన ముగ్గురిపై లారీ చక్రాలు ఎక్కిదిగడంతో అక్కడికక్కడే మృతిచెందారు. చెట్టును ఢీకొన్న వ్యాన్ : మహిళ మృతి రామనాథపురం జిల్లా కముది సమీపం మేల్ పారైకులానికి చెందిన 60 మంది రెండు వ్యాన్లలో శివగంగై జిల్లా కొల్లంకుడి, పడపురం కాళియమ్మన్ ఆలయానికి బుధవారం ఉదయం బయలుదేరారు. రెండు వాహనా ల మధ్య ఏర్పడిన పోటీ నెలకొంది. ఈ క్రమంలో శివగంగై సమీపంలోని సామియార్ పట్టి వద్ద వస్తుండ గా ఒక వ్యాన్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న వేప చెట్టును ఢీకొంది. ఈ సంఘటనలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న పొన్‌మునియమ్మాల్(27) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. పొన్‌మునియమ్మాల్‌కు వచ్చే నెలలో ఆమెకు వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమె మృతిచెందడంతో బంధువులు బోరున రోదించారు. -
రోడ్డు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
వలిగొండ, న్యూస్‌లైన్ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. నల్లగొండ, హైదరాబాద్, వరం గల్ జిల్లాల్లో చోటు చేసుకున్న ఈ ఘటనల వివరాలు .. వలిగొండకు చెందిన బత్తిని వెంకటే శం (24) శనివారం అర్ధరాత్రి బైక్‌పై భువనగిరి వైపు వెళ్తుం డగా గుర్తు తెలియని వాహనం శివసాయి ఫంక్షన్‌హాల్ సమీపంలో వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశం తీవ్ర గాయాలపాలయ్యా డు. అతడిని చికిత్స నిమిత్తం 108లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. వెంకటేశ్ అప్పటికే మృతిచెందాడని వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి అండాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ సంతూసింగ్ తెలిపారు. భువనగిరిటౌన్: మహబూబ్‌నగర్ జిల్లా దనువాడ్ మండలం మార్కెల్ గ్రామానికి చెందిన రాసాల రాజు(33) పట్టణ శివారులోని కోత్త వివేరా హోటల్ సమీపంలో గొర్రెలు మెపుతున్నాడు. రోడ్డు పక్కన గొర్రెలు మెస్తుండగా కాపరి రాజు రోడ్డు పక్కనే నిలబడి ఉన్నాడు. ఈ సమయంలో వరంగల్ నుం చి హైదరాబాద్‌కు వెళ్తన్న కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో మూడు గొర్రెలతో పాటు రాజు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతిడికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతిడి బంధువు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవి తెలిపారు. రెండు బైక్‌లు ఢీకొని.. చేర్యాల:రెండు బైక్‌లు ఢీకొని ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయూలయ్యాయి ఈ ఘటన మండలంలోని చుంచనకోట గ్రామశివారు లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం... రాజపేట మండలం పాముకుంటకు చెందిన బండారి సతీష్(23) బైక్‌పై చేర్యాలకు బయల్దేరాడు. ఈ క్రమంలో చుంచనకోటకు చెందిన స్వామి మరో బైక్‌పై వస్తూ సతీష్ బైక్‌ను ఢీకొట్డాడు. దీంతో తీవ్ర గాయూలపాలైన సతీష్ అక్కడికక్కడే అక్కడే మృతిచెందగా స్వామితోపాటు మరొకరు గాయాలపాలయ్యూరు. వారిని వెంటనే చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. చేర్యాల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.