వలిగొండ, న్యూస్‌లైన్ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. నల్లగొండ, హైదరాబాద్, వరం గల్ జిల్లాల్లో చోటు చేసుకున్న ఈ ఘటనల వివరాలు .. వలిగొండకు చెందిన బత్తిని వెంకటే శం (24) శనివారం అర్ధరాత్రి బైక్‌పై భువనగిరి వైపు వెళ్తుం డగా గుర్తు తెలియని వాహనం శివసాయి ఫంక్షన్‌హాల్ సమీపంలో వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశం తీవ్ర గాయాలపాలయ్యా డు. అతడిని చికిత్స నిమిత్తం 108లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. వెంకటేశ్ అప్పటికే మృతిచెందాడని వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి అండాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ సంతూసింగ్ తెలిపారు.
భువనగిరిటౌన్: మహబూబ్‌నగర్ జిల్లా దనువాడ్ మండలం మార్కెల్ గ్రామానికి చెందిన రాసాల రాజు(33) పట్టణ శివారులోని కోత్త వివేరా హోటల్ సమీపంలో గొర్రెలు మెపుతున్నాడు. రోడ్డు పక్కన గొర్రెలు మెస్తుండగా కాపరి రాజు రోడ్డు పక్కనే నిలబడి ఉన్నాడు. ఈ సమయంలో వరంగల్ నుం చి హైదరాబాద్‌కు వెళ్తన్న కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో మూడు గొర్రెలతో పాటు రాజు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతిడికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతిడి బంధువు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవి తెలిపారు.
రెండు బైక్‌లు ఢీకొని..
చేర్యాల:రెండు బైక్‌లు ఢీకొని ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయూలయ్యాయి ఈ ఘటన మండలంలోని చుంచనకోట గ్రామశివారు లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం... రాజపేట మండలం పాముకుంటకు చెందిన బండారి సతీష్(23) బైక్‌పై చేర్యాలకు బయల్దేరాడు.
ఈ క్రమంలో చుంచనకోటకు చెందిన స్వామి మరో బైక్‌పై వస్తూ సతీష్ బైక్‌ను ఢీకొట్డాడు. దీంతో తీవ్ర గాయూలపాలైన సతీష్ అక్కడికక్కడే అక్కడే మృతిచెందగా స్వామితోపాటు మరొకరు గాయాలపాలయ్యూరు. వారిని వెంటనే చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. చేర్యాల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
Published Mon, Oct 14 2013 2:46 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement