Chennai Crime News: Student Arrested For Making Girl Pregnant In Tamil Nadu - Sakshi
Sakshi News home page

ఇంటర్‌ విద్యార్థినితో పరిచయం.. పలుమార్లు అత్యాచారం.. ఎనిమిది నెలల గర్భిణి

Published Mon, Jan 24 2022 6:37 AM | Last Updated on Mon, Jan 24 2022 8:46 AM

Student arrested For Making Girl Pregnant in Tamil Nadu - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

తిరువొత్తియూరు (చెన్నై): కృష్ణగిరి జిల్లా పోచంపల్లి సమీపంలో వివాహం చేసుకుంటానని నమ్మించి బాలికను గర్భిణిని చేసిన ఓ కళాశాల విద్యార్థిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వివరాలు.. కృష్ణగిరి జిల్లా పోచంపల్లి సమీపంలోని 17 ఏళ్ల బాలిక ప్లస్‌టూ చదువుతోంది. అదే ప్రాంతంలో పాపనూరుకు చెందిన ప్రవీణ్‌కుమార్‌ (19) కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.

ఈ క్రమంలో ప్రవీణ్‌కుమార్‌ విద్యార్థినితో పరిచయం పెంచుకుని సన్నిహితంగా మెలిగాడు. దీంతో ఆ బాలిక ఎనిమిది నెలల గర్భిణి అయ్యింది. అయితే బాధితురాలిని వివాహం చేసుకోవడానికి ఆ విద్యార్థి తిరస్కరించాడు. తరువాత ఆమెను బెదిరించినట్లు తేలింది. దీంతో బాధితురాలు బర్గూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ అముద కేసు నమోదు చేసి ప్రవీణ్‌కుమార్‌ను ఆదివారం ఫోక్సో చట్టం కింద అరెస్టు చేశారు.   

చదవండి: (తన పేరు మార్పుపై సీఎం స్టాలిన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement