మైనర్‌ భార్యపై భర్త వేధింపులు... | Man Molestation On Minor Girl In Tamilnadu | Sakshi
Sakshi News home page

మైనర్‌ భార్యపై భర్త వేధింపులు...

Published Thu, Dec 2 2021 9:08 PM | Last Updated on Thu, Dec 2 2021 9:14 PM

Man Molestation On Minor Girl In Tamilnadu - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

చెన్నై: తమిళనాడులో దారుణం వెలుగులోకి వచ్చింది. పెళ్లైన ఏడాదికే మైనర్‌ భార్యపై.. వేధింపులకు పాల్పడ్డాడో వ్యక్తి. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మధురయ్‌ పట్టణానికి చెందిన ఒక వ్యక్తి.. ఏడాది క్రితం మైనర్‌ బాలికను వివాహం చేసుకున్నాడు. కొద్దిరోజులు వీరి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత.. ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది.

ఈ క్రమంలో..  కొన్ని రోజులుగా భర్త.. తనను వేధిస్తున్నాడని, మానసికంగా హింసిస్తున్నాడని బాధిత మహిళ వాపోయింది. దీంతో విసిగిపోయిన మైనర్‌ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడు పరారయ్యాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement