విద్యార్థినిపై కానిస్టేబుల్ లైంగిక వేధింపులు | Constable Sexually Harassed On student | Sakshi
Sakshi News home page

విద్యార్థినిపై కానిస్టేబుల్ లైంగిక వేధింపులు

Published Sat, Sep 20 2014 12:32 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

Constable Sexually Harassed On student

తిరువొత్తియూరు: విద్యార్థిని లైంగికంగా వేధించిన కానిస్టేబుల్ కోసం ప్రత్యేక పోలీసులు గాలిస్తున్నారు. నెల్లై జిల్లా కలక్కాడు సమీపం వెల్లికాడువెట్టి గ్రామానికి చెందిన విద్యార్థిని సమీపంలో ఉన్న ఇడయన్‌కులం అమీర్‌జామత్ పాఠశాలలో చదువుతోంది. గురువారం విద్యార్థిని ఊరి నుంచి సైకిల్‌పై పాఠశాలకు వెళుతున్న సమయంలో ఆ మార్గంలో బైకులో వచ్చిన కానిస్టేబుల్ గణేషన్(36) విద్యార్థిని వద్ద అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్థిని అతని నుంచి తప్పించుకుని తల్లిదండ్రులకు చెప్పింది. ఆగ్రహించిన విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు కల్లకాడు పోలీసుస్టేషన్‌ను ముట్టడించారు. డీఎస్పీ షణ్ముగం వారితో చర్చలు జరిపి కానిస్టేబుల్‌ను వెంటనే అరెస్టు చేస్తామని హామీ ఇచ్చి వారిని అక్కడి నుంచి పంపివేశారు. పోలీసులు గణేషన్ కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement