Lovers commit suicide
-
చికిత్స పొందుతూ ప్రేమికుల మృతి
ఏటూరునాగారం/మంగపేట: తమ ప్రేమను పెద్దలు అంగీకరించి పెళ్లి చేస్తారో లేరోనని మనస్తాపానికి గురైన ప్రేమికులు పురుగుల మందు తాగిన విషయం తెలిసిందే. చికిత్స పొందుతూ బుధవారం చనిపోయారు. ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది.. ఏటూరునాగారం మండలానికి చెందిన బెజ్జంకి వేణుగోపాల్, అరుణ దంపతుల కుమారుడు రాజేష్(25), మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన మాదరి శిరీష(22) మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ ఏటూరునాగారం డిగ్రీ కళాశాలలో చదువుతున్నారు. ఈ క్రమంలో పెద్దలు తమ వివా హం చేస్తారో లేదో అని అపోహపడి మంగళవారం రాత్రి మల్లూరు గుట్ట వద్ద పురుగులమందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నారు. సమాచారం తెలుసుకున్న ఇరు కుటుంబ సభ్యులు.. వారిద్దరిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై మంగపేట ఎస్సై రవికుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరికి వేరే వ్యక్తులతో పెళ్లి,.. విడిచి ఉండలేక ప్రేమ జంట ఆత్మహత్య
సాక్షి, చెన్నై: వేరువేరు వ్యక్తులను పెళ్లి చేసుకున్న ఓ ప్రేమజంట ఒకరినొకరు విడిచి ఉండలేకపోయారు. కలసి జీవించలేమనే ఆవేదనతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. తిరువొత్తియూరు సేలం టౌన్ రైల్వే స్టేషన్ పొన్నమ్మా పేట రైల్వే గేటు సమీపంలో శనివారం ఉదయం పట్టాలపై ఎదురుగా పరిగెత్తుకుంటూ వచ్చిన ఓ జంటను యశ్వంత్‌పూర్, పుదుచ్చేరి ట్రైన్ ఢీకొంది. సేలం రైల్వే పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. పోలీసుల విచారణలో వారు సేలం అమ్మాపేటకు చెందిన మురుగేషన్ కుమార్తె సత్య (23), జ్యోతి నగర్‌కు చెందిన రాజేంద్రన్ కుమారుడు విష్ణు (27) అని తెలిసింది. చదవండి: సోడా తాగి వస్తా.. ఇంట్లో నుంచి వెళ్లిన వివాహిత అదృశ్యం -
ప్రియురాలి మరణం తట్టుకోలేక.. ప్రియుడి ఆత్మహత్య
-
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం కేసును ఛేదించిన పోలీసులు
సాక్షి, నెల్లూరు: గూడూరు పట్టణంలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసుకున్న కేసును పోలీసులు చేధించారు. తనను దూరం పెట్టిందన్న ఆక్రోశంతో ప్రియురాలిని ప్రియుడే అంతం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆమెను హత్యచేసి అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. విచారణలో వెలుగు చూసిన కీలక విషయాలను ఏఎస్పీ వెకంటరత్నం బుధవారం వెల్లడించారు. తేజస్విని ,వెంకటేష్ ఇద్దరూ ప్రేమించుకున్నారని, వీరిద్దరి మధ్య రెండు నెలలుగా ఇద్దరి విభేదాలు వచ్చాయని ఆయన తెలిపారు. వెంకటేష్‌ను తేజస్విని దూరం పెట్టడంతో ఆ కసితోనే ప్రేయసిని హత్యచేయాలని నిందితుడు రెక్కీ నిర్వహించాడని పేర్కొన్నారు. తేజస్విని క్లాస్ మేట్ శివ ,స్నేహితుడు పృద్విరాజ్‌తో కలిసి హత్యకు కుట్ర పన్నినట్లు వెల్లడించారు. పథకం ప్రకారం ఇంటిలోకి చొరపడి తేజస్వినిని హత్యచేశాడని, ఆ తర్వాత వెంకటేష్ ఆత్మహత్యా ప్రయత్నం చేశాడన్నారు. వెంకటేష్ ,పృథ్విరాజ్ ,శివలను అరెస్ట్ చేశామని, బైకు, కత్తి, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. -
పెళ్లికి నిరాకరణ.. ప్రేమజంట ఆత్మహత్యాయత్నం, యువతి మృతి
లింగంపేట (ఎల్లారెడ్డి): ఇంట్లో పెద్దలు తమ పెళ్లికి నిరాకరించారని మనస్తాపంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా యువతి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం అయిలాపూర్ గ్రామానికి చెందిన దివ్య అలియాస్ బ్యాగరి మాధవి (17), నీరడి రాజు (23) ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురి ఇంటి పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో గత నెల 30న గ్రామ శివారులోని పంట చేనుకు వెళ్లి గడ్డి మందు తాగారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఇరువురిని చికిత్స నిమిత్తం హైదరాబాలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మాధవి మృతి చెందింది. రాజు పరిస్థితి విషమంగా ఉంది. మాధవి 10వ తరగతి పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటోంది. రాజు 10వ తరగతి పూర్తి కాగానే దుబాయి వెళ్లాడు. అక్కడ రెండేళ్లు ఉన్న అనంతరం కరోనా మొదటి వేవ్ సమయంలో లాక్డౌన్లో స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి ఇరువురు ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మృతురాలు తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. -
మైనర్ విద్యార్ధినితో ప్రేమ.. పెద్దలు ఒప్పుకోలేదని..
సాక్షి, చెన్నై : విషం తాగి ఓ ప్రేమజంట ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో చోటుచేసుకుంది. తూత్తుకుడి జిల్లా కోవిల్పట్టి పుదుగ్రామం ఆరవ వీధికి చెందిన ముత్తుపాండి కుమారుడు పాండిదురై (22). అతనికి అదే ప్రాంతానికి చెందిన 17 సంవత్సరాల విద్యార్థినితో పరిచయం ఏర్పడి ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకునేందుకు నిశ్చయించుకున్నారు. వీరి ప్రేమపెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో విరక్తి చెందిన ప్రేమజంట బుధవారం వేలాయుధపురం రైల్వేస్టేషన్ సమీపంలో కూల్‌డ్రింక్స్‌లో విషం కలిపి తాగారు. స్పృహతప్పి పడి వున్న ఇద్దరిని స్థానికులు కోవిల్పట్టి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తరువాత ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం తూత్తుకుడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ పాండిదురైకి విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: దంతాలు కోసుకెళ్లి.. ఏనుగును చంపి దహనం చేశారు... -
ఆలింగనం చేసుకుని చనిపోయిన బావామరదళ్లు
సాక్షి, చెన్నై: ప్రేమలో గెలిచిన ఓ జంట జీవిత పయనంలో ఓడారు. పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో బలవన్మరణంతో ఒక్కటయ్యారు. బెంగళూరుకు చెందిన జంట చెన్నైలో రోడ్డు పక్కగా ఒకర్ని మరొకరు ఆలింగనం చేసుకున్న రీతిలో మృతదేహాలుగా కనిపించడం సర్వత్రా విషాదంలోకి నెట్టింది. పోలీసుల కథనం మేరకు... చెన్నై పళ్లికరణై మార్గం చిట్లపాక్కం అరసన్ కాలనీ నుంచి సోమవారం అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో పెరుంబాక్కం పోలీసులకు ఓ ఫోన్ కాల్ వెళ్లింది. రోడ్డు పక్కగా ఓ యువతి, యువకుడు ఆలింగనం చేసుకున్న రీతిలో పడి ఉన్నట్టు వచ్చిన ఫోన్‌కాల్‌తో గస్తీ బృందం అక్కడికి వెళ్లింది. వారిని పరిశీలించగా, మరణించినట్టు తేలింది. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని విచారించారు. వారి వద్ద ఉన్న గుర్తింపు కార్డు, చిరునామాల ఆధారంగా బెంగళూరు ఆర్కేపురానికి చెందిన వారుగా గుర్తించారు. చెన్నైకు ఎందుకు వచ్చారో అని విచారించగా, ఆ జంట ప్రేమ కథ వెలుగు చూసింది. రెండేళ్లుగా ప్రేమ.. విచారణలో వెలుగు చూసిన అంశాల మేరకు అభినేష్(30), పల్లవి(30) బావ మరదళ్లుగా గుర్తించారు. అభినేష్ బెంగళూరులోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. అభినేష్, పల్లవి రెండేళ్లుగా ప్రేమించుకుంటూ వచ్చారు. ఈ వ్యవహారం పల్లవి తల్లి గాయత్రి దృష్టికి చేరింది. వీరి ప్రేమకు ఆమె అడ్డు చెప్పడమే కాదు, పల్లవిని తీవ్రంగా మందలించింది. దీంతో పది రోజుల క్రితం ఇళ్లు వదలి అభినేష్‌తో కలిసి చెన్నైకు పల్లవి చేరుకుంది. తాంబరం– చిట్లపాక్కం మార్గంలోని పిల్లయార్ కోవిల్ వీధిలోని తన సోదరి ఇంటికి పల్లవితో అభినేష్ చేరుకున్నాడు. వీరి కోసం గాలింపు చేపట్టిన గాయత్రి ఎట్టకేలకు చెన్నైలో ఉన్నట్టు గుర్తించింది. అభినేష్ సోదరికి చీవాట్లు పెట్టింది. ఆందోళన చెందిన ఆమె ఇద్దరు బెంగళూరుకు వెళ్లిపోవాలని హెచ్చరించింది. దీంతో అభినేష్, పల్లవి ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. బెంగళూరుకు వెళ్తే విడదీస్తారాని, ప్రాణహాని తప్పదన్న ఆందోళన వారిలో నెలకొంది. దీంతో ప్రేమలో గెలిచిన తాము.. జీవిత పయనంలో ఓడుతున్నామని చాటుతూ మరణంలో ఒక్కటయ్యారు. ముందుగా సిద్ధం చేసుకున్న విషాన్ని తాగి, తమను ఎవరూ విడదీయలేరన్నట్టుగా ఆలింగనం చేసుకున్న స్థితిలోనే మృత్యుఒడిలోకి చేరారు. వీరి మరణ సమాచారాన్ని బెంగళూరులోని కుటుంబసభ్యులకు పెరుంబాక్కం పోలీసులు తెలియజేశారు. మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం క్రోంపేట జీహెచ్‌కు తరలించారు. వీరి బలన్మరణానికి కారణంగా గాయత్రిపై కేసు నమోదుకు చర్యలు చేపట్టారు. బెంగళూరు నుంచి మంగళవారం వస్తారనుకున్న కుటుంబసభ్యులు, బంధువులు, ఎంతకు రాకపోవడంతో మృతదేహాల్ని మార్చురీలో ఉంచారు. ప్రేమజంట తమ ప్రాంతంలో బలవన్మరణానికి పాల్పడిన సమాచారంతో మృతదేహాలు పడి ఉన్న ప్రాంతానికి అర్ధరాత్రి వేళ కూడా అక్కడి జనం పరుగులు తీయడంతో ఆ పరిసరాలు విషాదంతో నిండాయి. చదవండి: 3 నెలల క్రితం అత్యాచారం.. రైల్వే స్టేషన్లో అస్థిపంజరం ఎనిమిదో భార్యను చంపి జైలుకు, రెండో భార్య కొడుకు చేతిలో.. -
లాడ్జిలో గ్రామ సచివాలయ ఉద్యోగుల ఆత్మహత్య
సాక్షి, నెల్లూరు: నగర శివారులో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా రూరల్ మండలానికి చెందిన హరీష్ ఇట్టమూరు మండలంలోని మెట్టు సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్‌గా, నాయుడుపేటకు చెందిన లావణ్య అదే సచివాలయంలో వీఆర్వోగా పనిచేస్తున్నారు. వీరుద్దరూ శుక్రవారం విధులకు హాజరుకాలేదు. చదవండి: నేను మూడో కన్ను తెరిస్తే భస్మమే : పద్మజ నెల్లూరు నగర శివారు ప్రాంతమైన నందా లాడ్జిలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. ఇద్దరూ కలిసి ఓకే తాడుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రాత్రయినా హరీష్, లావణ్య ఇంటికి రాకపోవడంతో ఇరువురు కుటుంబ సభ్యులు వీరి కోసం గాలింపు చర్యలుచేపట్టగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇరువురి ప్రేమను కుటుంబసభ్యులు అంగీకరించపోవడంతో మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. నెల క్రితం పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకున్నట్లు సమాచారం. చదవండి: ప్రేమ విఫలం: క్షణం ఆలస్యమైతే చచ్చేవాడే! -
టెన్త్ అబ్బాయి.. డిగ్రీ అమ్మాయి
సాక్షి, మహబూబాబాద్ (గార్ల): తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరేమోనన్న భయంతో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం వడ్లఅమృతండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. గార్ల మండలం రాజుతండా పంచాయతీ పరిధి వడ్లఅమృతండాకు చెందిన పదోతరగతి విద్యార్థి గూగులోత్ ప్రశాంత్ (17), అదే గ్రామానికి చెందిన డిగ్రీ పూర్తిచేసిన భూక్యా ప్రవీణ (22) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. సోమవారం ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయారు. బుధవారం తెల్లవారుజామున గ్రామ సమీపాన ఉన్న వ్యవసాయ బావిలో మృతదేహాలు నీటిలో తేలడంతో గమనించిన స్థానికులు వారి తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం ఇవ్వగా మృతదేహాలను బయటకు తీయించారు. వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు ఖాళీ డబ్బా లభించడంతో పురుగులమందు తాగిన అనంతరం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం పూర్తి వివరాలు వెల్లడవుతాయని ఎస్సై బాదావత్ రవి చెప్పారు. అబ్బాయికంటే అమ్మాయి వయసు ఎక్కువ ఉండటం, పెద్దలు వివాహానికి ఒప్పుకోరన్న భయంతోనే ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా, వీరు అక్కా, తమ్ముడు అని సంబోధించుకునేవారని, ప్రేమ వ్యవహారం చెబితే పెళ్లి చేసేవారమని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. బావిలో మృతదేహాలు, (ఇన్సెట్) -
గుంటూరులో ప్రేమజంట ఆత్మహత్య
-
వివాహానంతర ప్రేమ.. విషాదాంతం
వారిద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే ఇద్దరికీ వివాహాలయ్యాయి. ఇద్దరేసి పిల్లలు కూడా ఉన్నారు. అతనికి భార్యతోను, ఆమెకు భర్తతోను విభేదాలు వచ్చాయి. ఆమె పుట్టిల్లు.. అతని సొంతిల్లు ఆ గ్రామంలోని ఒకే ప్రాంతం. దీంతో తమ జీవిత భాగస్వాములకు దూరంగా ఉన్న వారి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇది వారి కుటుంబాలకు తెలిసింది. ఇద్దరిపై ఒత్తిడి పెరిగింది. వారు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పశ్చిమగోదావరి : ఉంగుటూరులో నంద్యాల సురేష్, తణుకు ఉమాసరోజిని కలిసి ఒకే చున్నీకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం వేకువ జామున వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో గ్రామం ఉలిక్కిపడింది. చేబ్రోలు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉంగుటూరు కోనేరుపేటకు చెందిన నంద్యాల సురేష్(27)కు కైకరానికి చెందిన నాగలక్ష్మితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. అదే పేటకు చెందిన జొన్నాడ ఉమాసరోజిని(23)కి తణుకు మండలం కాయలపాడుకు చెందిన తణుకు సుబ్బారావుతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. సురేష్ తన భార్యతో గొడవల నేపథ్యంలో ఒంటరిగా ఉంటున్నాడు. సరోజిని తన భర్తతో ఉన్న స్పర్థలతో కొన్ని నెలలుగా ఉంగుటూరులోని పుట్టింట్లో ఉంటోంది. వారిద్దరిది కోనేరు పేట కావటంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇది తెలిసి రెండు కుటుంబాల నుంచి వీరిపై ఒత్తిడి వచ్చింది. దీంతో సురేష్, సరోజిని కలిసి మూడు రోజుల క్రితం గ్రామం నుంచి వెళ్లిపోయారు. ఏమైందో కానీ వారిద్దరు ఉంగుటూరు కోనేరుపేట వచ్చారు. ఏలూరు కాలువ గట్టు వద్ద వినాయక ఆలయం సమీపంలోని పూరిపాకలో ఒకే చున్నీతో ఇద్దరు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలంలో పానీ పూరీ, వాటర్ ప్యాకెట్లు ఉన్నాయి. ఈ విషయం తెలిసి వీఆర్వో పీతల ముత్యాలు శుక్రవారం ఉదయం చేబ్రోలు పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎస్సై తాడి వెంకటనాగరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటనా స్థలానికి వచ్చి చలించి పోయారు. సురేష్ తల్లి వేదన: ఎప్పుడు అమ్మా అమ్మా అంటూ వెంట ఉండే కుమారుడు సురేష్ మృతితో అతని తల్లి గుండెలవిసేలా రోదించింది. అతని తండ్రి ఏడుకొండలు ఆవేదనతో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయాడు. కలలో కూడా అనుకోలేదు కుమారై మృతదేహం చూసి ఆమె తండ్రి జొన్నాడ చిన్ననాగేశ్వరరావు బోరున విలపించారు. ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదని మృతదేహం వద్ద ఆమె తల్లి వెంకటరమణ, తండ్రి నాగేశ్వరరావు గుండెలు బాదుకుంటూ విలపించారు. -
మరో యువకుడితో పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారని...
ఒంగోలు / పెద్దారవీడు: ఎదురెదురు ఇళ్లలో నివసించే యువతీయువకుడు రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారు. కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్న వీరిద్దరూ కొండప్రాంతంలో విగతజీవులుగా కనిపిం చారు. పెద్దారవీడు మండలంలో శనివారం సాయంత్రం ఈ ఘటన వెలుగు చూసింది. సేకరించిన వివరాల ప్రకారం.. యర్రగొండపాలెం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన దూదేకుల హుస్సేన్‌పీరా (20) సమీపంలోని ఒక ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. వీరింటికి ఎదురుగా ఉండే డి.అరుణబీ (16) యర్రగొండపాలెం సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఇరుగుపొరుగు ఇళ్లలో ఉండటంతోపాటు బంధువులు కూడా అయిన వీరిద్దరూ కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నారు. హుస్సేన్, అరుణబీ ఇద్దరూ కలిసి తిరుగుతున్నారని తెలిసిన తల్లిండ్రులు వారికి కొద్ది రోజుల కిందట కౌన్సెలింగ్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఇంటి నుంచి వెళ్లిన వీరిద్దరూ ఆ తర్వాత ఆచూకీ లేకుండా పోయారు. ఈ క్రమంలో శనివారం పెద్దారవీడు మండలంలోని దేవరాజుగట్టు సమీపంలోగల సూర్యనారాయణమూర్తి ఆలయం సమీపంలోకి స్థానిక ఉన్నత పాఠశాల విద్యార్థులు వనం–మనం కార్యక్రమంలో భాగంగా వెళ్లారు. కొండపైకి ఎక్కిన సమయంలో దుర్వాసన వెదజల్లడంతో పరిసరాలను పరిశీలించారు. అక్కడ కొండ చక్కల మధ్యన రెండు మృతదేహాలు ఒకదానిపై మరొకటి పడి ఉండటం చూసి ఆందోళన చెందారు. ఈ విషయాన్ని వెంటనే గ్రామాధికారులకు, గ్రామస్తులకు తెలియజేశారు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న వీఆర్ఓ ఎస్.లక్ష్మయ్య, మార్కాపురం పట్టణ ఎస్ఐ బి.రామకోటయ్యలు ఘటనా స్థలికి చేరుకున్నారు. ముఖాలను గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న మృతదేహాల సమీపంలో లభించిన కూల్‌డ్రింక్ సీసా, పురుగు మందు డబ్బాలను చూసి, ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. వీరి వద్దగల సెల్‌ఫోన్‌లోని నంబర్లకు కాల్చేసి మృతుల వివరాలు తెలుసుకున్న పోలీసులు, బంధువులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి వచ్చిన హుస్సేన్ పీరా తండ్రి దస్తగిరి కుమారుడి మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్నారు. అరుణ్‌బీకి ఇటీవల ఆమె కుటుంబసభ్యులు మరో యువకుడితో పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ క్రమంలోనే సన్నిహితంగా ఉంటున్న అరుణ్‌బీ, హుస్సేన్ పీరాలు ఇక్కడి కొండప్రాంతంలోని ఆలయం వద్దకు వచ్చి బలవన్మరణానికి పాల్పడి ఉంటారనే చర్చ జరుగుతోంది. ఆలయ సమీపంలోని కొండపై యువతీయువకుల మృతదేహాలు ఉన్నట్టు తెలియడంతో స్థానికులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెద్దలు అంగీకరించలేదని..
వేలూరు: ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఓ ప్రేమ జంట ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గుడియాత్తం సమీపంలో శనివారం జరిగింది. వేలూరు జిల్లా గుడియాత్తం తాలుకా కనవాయిమోటూరుకు చెందిన వెంకటేషన్ కుమారుడు రామలింగం(25) వ్యవసాయం చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన పిచ్చాండి కుమార్తె తిలగ(18) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను పెద్దలు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఇద్దరూ ఇంట్లో కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. గ్రామం సమీపంలోని ఓ చెట్టుకు ఇద్దరూ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన స్థానికులు తల్లిదండ్రులకు తెలిపారు. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. సమాచారంతో గ్రామ పరిపాలన అధికారి శంకర్ ఫిర్యాదు మేరకు పరదరామి పోలీసులు కేసు నమోదు చేసి మృత దేహాలను ఆస్పత్రికి తరలించారు. -
రైలుకింద పడి ప్రేమజంట ఆత్మహత్య
సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం మండలంలో సోమవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో తమ ప్రేమను ఒప్పుకోకపోవడంతో రైలుకింద పడి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. పిఠాపురం- గోర్స రైల్వే గేట్ దగ్గర ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి. మృతదేహాలను చూసిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనాస్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో ఒకరిని ఏడిదకు చెందిన నందిన సూరిబాబుగా గుర్తించారు. యువతి వివరాలు సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రేమికులు ఒప్పంద పత్రం రాసుకొని.. అంతలోనే!
పొందూరు: ఒకరిని విడిచి మరొకరు ఉండలేక ఆ యువతీ, యువకులు క్షణికావేశానికిలోనై బలవన్మరణానికి పాల్పడ్డారు. తమ ప్రేమను పెద్దలు అంగీకరించరేమోనన్న అనుమానం వారిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించింది. జీవితంలో స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకుందామని ఒప్పంద పత్రం రాసుకున్న వీరు.. అంతలోనే నిర్ణయం మార్చుకుని కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపారు. పొందూరు మండలంలోని కనిమెట్టకు చెందిన అన్నెపు పవన్ కల్యాణ్ (17), మొదలవలసకు చెందిన మొదలవలస రేణుక(17) కింతలి రెవెన్యూ పరిధిలోని మామిడి తోటల్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనంగా మారింది. పోలీసులు, తల్లిదండ్రులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం కాలేజీ నుంచి వెళ్లిపోయి.. కింతలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పవన్‌కల్యాణ్, రేణుక ఇంటర్ హెచ్ఈసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వీరు ఏడాది క్రితం నుంచి ప్రేమించుకుంటున్నారు. శుక్రవారం కళాశాలకు వచ్చిన వీరు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బయటకు వెళ్లిపోయారు. రేణుక తన సైకిల్, టిఫిన్ బాక్సు కళాశాలలోనే విడిచిపెట్టింది. వీరు ఇళ్లకు చేరకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వారి ప్రేమ విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు శుక్రవారం రాత్రి చర్చించుకుని వివాహం చేసేందుకు సిద్ధమయ్యారు. అర్ధరాత్రి వరకు విద్యార్థుల ఆచూకీ కోసం గాలించారు. కానీ మామిడి తోటలో వీరు ఉరేసుకుని చనిపోయారనే వార్త విని హతాశులయ్యారు. డీఎస్పీ పరిశీలన ఈ సమాచారం శనివారం ఉదయం పోలీసులకు అందింది. శ్రీకాకుళం డీఎస్పీ వేణుగోపాలరావు, జె.ఆర్.పురం సి.ఐ వై.రామకృష్ణ, పొందూరు ఇన్‌ఛార్జి (ఎచ్చెర్ల) ఎస్.ఐ వై.కృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్షణికావేశంలో రాత్రి సమయంలో వీరు ఉరేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. వారి బ్యాగుల్లోని ఉపాధ్యాయులు, స్నేహితులు, తల్లిదండ్రులకు క్షమాపణ చెబుతూ రాసిన ఉత్తరాలు, సూసైడ్ నోట్, వీరి పెళ్లి శుభలేక నమూనా వంటివి సేకరించారు. అనంతరం మృతదేహాలను శ్రీకాకుళం రిమ్స్‌కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. గ్రామాల్లో విషాద ఛాయలు వీరు మృతిచెందడంతో ఇరువురి కుటుంబాల్లో, మొదలవలస, కనిమెట్ట గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. పవన్ తల్లిదండ్రులు అన్నెపు హరనాథరావు, ఇందు రైతులు. కూలి చేస్తుంటారు. వీరికి ఒక అమ్మాయి, అబ్బాయి. రేణుక తల్లిదండ్రులు రమణరావు, రోహిణి పాల వ్యాపారం చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. రేణుక చిన్నమ్మాయి. పవన్ ఇంట్లో మూడీగా ఉండేవాడని, ఎవరితోను మాట్లాడేవాడు కాదని కుటుంబీకులు తెలిపారు. ఇద్దరం కలిసి చనిపోతున్నాం అమ్మ, నాన్న నన్ను క్షమించండి. నాకు చాలా సమస్యలు ఉన్నాయి. అవి తట్టుకోలేకపోతున్నాను. ఎవరితో చెప్పుకోలేక నాలో నేను కుమిలిపోతున్నాను. బాధను భరించలేక ఈ పని చేస్తున్నాను. మనస్ఫూర్తిగా మన్నిస్తారని భావిస్తాను. నేను చనిపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. నా మెదడులో సమస్య ఉంది. దాని వల్ల ఎప్పుడు ఎలా ఉంటున్నానో నాకే తెలియటం లేదు. మిమ్మల్ని కూడా బాధపెట్టాను. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. తాను చనిపోతానని చెప్పింది. అందుకే ఇద్దరం కలిసి చచ్చిపోతున్నాం. మనస్ఫూర్తిగా మన్నించండి. ఒప్పంద పత్రంలో ఏముందంటే.. రేణుక, పవన్ కల్యాణ్ ఇరువురు ఒప్పంద పత్రం రాసుకున్నారు. ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత చదువుకోవడానికి ఐదేళ్లు విడిచి వెళ్లేందుకు రేణుక గడువు కోరింది. ఇందుకు పవన్ సమ్మతించాడు. మళ్లీ 2022 ఫిబ్రవరిలో కలుస్తానని చెప్పాడు. అప్పుడు నీకు ఉద్యోగం ఉంటే, నేను నీ మనసులో ఉంటే ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని ఒప్పంద పత్రం రాసుకున్నారు. ఒక నమూనా పెళ్లి శుభలేఖను కూడా తయారు చేసుకున్నారు. ఇద్దరికీ పెళ్లి చేద్దామనుకున్నాం రేణుక, పవన్ కల్యాణ్ శుక్రవారం నుంచి కనిపించకపోవడంతో నేను, పవన్ తండ్రి హరనాథరావు కలిసి వెతికాం. వారిద్దరూ ఇష్టపుతున్నారని తెలిసి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం. ఎక్కడికి వెళ్లినా ఉదయాన్నే వచ్చేస్తారని, తర్వాత ఇద్దరితో కలిసి మాట్లాడదామని అనుకున్నాం. కానీ ఇంతలోనే ఇలా జరిగింది. – రమణరావు, రేణుక తండ్రి అందరికీ క్షమాపణలు మేమిద్దరం కలిసి తీసుకున్న నిర్ణయానికి అందరికీ క్షమాపణలు చెబుతున్నాం. స్నేహితులంతా చక్కగా చదువుకోవాలి. నేను దూరమైనందుకు ఎవరూ బాధపడకండి. సివిక్స్ మేడమ్ తల్లిలాంటివారు. బాగా చదువుతానని నామీద పెట్టుకున్న నమ్మకానికి ధన్యవాదాలు. -
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పట్టణంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మెదక్ జిల్లా సంగారెడ్డికి చెందిన శ్రీమాన్(21), శివాణి (20) ఆదివారం ఉదయం 11గంటలకు గుట్ట పట్టణంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో బస చేశారు. సాయంత్రం యాదాద్రి కొండపైకి వెళ్లి శ్రీ లక్ష్మీ నర్సింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం వారు ఉన్న గదిలో రాత్రి నిద్ర చేశారు. సోమవారం తెల్లవారుజామున ఆ ప్రేమికులు ఫినాయిల్‌ను తాగి అపస్మారకస్థితిలో పడి ఉన్నారు. గమనించిన లాడ్జి నిర్వహకులు పోలీసులకు, 108 వాహన సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే శ్రీమాన్, శివాణిలను చికిత్స నిమిత్తం తొలుత భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వారు కోలుకుంటున్నట్టు తెలిసింది. ఈ విషయమై ఇరు కుటుంబాల సభ్యులకు చెప్పి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. -
విషాదాంతమైన ప్రేమకథ
టెక్కలి, న్యూస్‌లైన్: వారిద్దరూ కళాశాల విద్యార్థులు.. ప్రేమించుకున్నారు.. పెళ్లిచేసుకుందామనుకున్నారు.. ఏమైందో కానీ వారి మృతదేహాలు బావిలో తేలాయి. ఆత్మహత్య చేసుకున్నారనే ఊహాగానాలు సాగుతున్నా.. మృతుల నోరు, ముక్కు నుంచి వచ్చిన నురగలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. టెక్కలిలో మంగళవారం కలకలం రేపిన సంఘటన వివరాల్లోకి వెళితే... టెక్కలి భూలోకమాత వీధికి చెందిన మండల రమేష్, లక్ష్మి కుమార్తె రేష్మ (17). పట్టణంలోని తెలుగు బ్రాహ్మణ వీధికి చెందిన నామాల కూర్మారావు, సుజాత కుమారుడు రమణ అలియాస్ దామోదర్ (18). టెక్కలిలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలో చదువుతున్న వారిద్దరూ వేర్వేరు సామాజికవర్గాలకు చెందినవారు. వారి ప్రేమగాథ పెద్దలకు తెలిసింది. మంగళవారం రేష్మా పరీక్ష రాసేందుకు వెళ్లింది. తిరిగి రాలేదు. ఆమెను పెళ్లి చేసుకునేందుకు తీసుకువెళుతున్నట్లు రేష్మా తండ్రి రమేష్‌కు దామోదర్ ఫోన్ చేశాడని చెబుతుతున్నారు. కాగా, దామోదర్ రెండు రోజుల నుంచి ఇంటికి రాలేదని అతని తండ్రి కూర్మారావు చెప్పారు. పరీక్ష కు వెళ్లిన రేష్మా రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. విద్యుత్ శాఖ డీఈ కార్యాలయం సమీపంలో గల నేలబావిలో ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించి బయటకు తీశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన దామోదర్ స్నేహితులు సంతోష్, ప్రశాంత్, మధుసూదన్‌లను ఆవేదన, ఆగ్రహంతో ఉన్న మృతురాలి కుటుంబ సభ్యులు తీవ్రంగా కొట్టారు. యువతి ఆత్మహత్య సమాచారం తెలుసుకున్న ఎస్సై నర్సింహమూర్తి ఘటన స్థలానికి చేరుకుని యువకులను తమ అదుపులోకి తీసుకున్నారు. తర్వాత బావిలో గాలింపు చర్యలు చేపట్టి యువకుడి మృతదేహాన్ని వెలికి తీశారు. రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి ఏరియా ఆస్పత్రికి తరలించారు.ప్రేమజంట ఆత్మహత్య సమాచారం తెలియడంతో పట్టణ ప్రజలు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుల నోటి వెంట నురగ కాగా, ప్రేమజంట ఆత్మహత్యపై పలు ఊహాగానాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారు కావడంతో పెద్దల అనుమతి ఉండదని ఆత్మహత్యకు చేసుకున్నారని కొందరు, వేరే కారణాలు ఉన్నామని మరికొందరు అంటున్నారు. కానీ ఇరువురి నోరు, ముక్కు నుంచి నురగలు వచ్చినట్లు కనిపిస్తుండడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్టం జరిగిన తర్వాత వాస్తవాలు తెలుస్తాయని భావిస్తున్నారు. ఉత్సవాల వేళ విషాదం... స్థానిక భూలోకమాత వీధిలో నాలుగు రోజుల నుంచి గ్రామ దేవత ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మంగళవారంతో ఉత్సవాలు ముగియనుండగా, అదే వీధికి చెందిన రేష్మా ఆత్మహత్యతో విషాదం అలముకుంది. -
వేర్వేరుగా ఐదుగురి మృత్యువాత
ఉట్నూర్, (జన్నారం)/సిర్పూర్(టి)/లక్సెట్టిపేట, న్యూస్‌లైన్ : జన్నారం మండల కేంద్రంలో కరీంనగర్ జిల్లా సారంగాపూర్ మండలం మంగేళ గ్రామానికి చెందిన ప్రేమ జంట శనివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది. క్రిమిసంహారక మందు తాగి అపస్మారకస్థితిలో ఉన్న వీరిని మెరుగైన చికిత్స కోసం లక్సెట్టిపేటకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు. స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సారంగాపూర్ మండలం మంగేళకు చెందిన రోండి రంజిత్ (21), పడిగెల వనజ (16) మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రంజిత్ డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతుండగా వనజ పదో తరగతితో చదువు మానేసి ఇంట్లోనే ఉంటూ బీడీలు చుడుతోంది. కులాలు వేరు కావడంతో వీరి ప్రేమ, పెళ్లికి పెద్దలు అంగీకరించబోరని భయపడ్డారు. ఈ క్రమంలో వారిద్దరూ శనివారం జన్నారం మండల కేంద్రానికి చేరుకున్నారు. క్రిమిసంహారక మందు తాగి బస్టాండ్ ప్రాంతం నుంచి కాలినడకన వస్తూ పాతబస్టాండ్ మార్కెట్ ప్రధాన రహదారి వద్దకు చేరుకోగానే హఠాత్తుగా కింద పడిపోయూరు. అక్కడే ఉన్న వారు 108 సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం లక్సెట్టిపేటకు తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయూరు. సంఘటన స్థలాన్ని ఇన్చార్జి ఎస్సై చంద్రమోహన్ పరిశీలించారు. అబ్బారుు వద్ద లభించిన ఆధార్ కార్డు, సెల్ఫోన్లో ఉన్న నంబర్ల ఆధారంగా ప్రేమజంటది మంగేళ గ్రామంగా గుర్తించినట్లు ఎస్సై తెలిపారు. వీరి మృతికి పూర్తి వివరాలు తెలియరాలేదని, బంధువులకు సమాచారం అందించామని చెప్పారు. ఎవరి నుంచి ఫిర్యాదు అందకపోవడంతో కేసు నమోదు చేయలేదని పేర్కొన్నారు. ప్రేమజంట ఆత్మహత్యతో స్థానికులు చలించిపోయూరు. తాతామనవడు మృతి సిర్పూర్(టి)కి చెందిన ఎంఏ అజీజ్ (75), కోడలు జాకీరా (40), మరికొంత మంది బంధువులతో కలిసి మంచిర్యాలలోని పెద్ద కొడుకు అజీజ్ వద్దకు గురువారం వెళ్లాడు. శుక్రవారం అర్ధరాత్రి రైలు ద్వారా సిర్పూర్(టి)కి వచ్చారు. వారిని తీసుకురావడానికి జాకీరా కొడుకు, అజీజ్ మనవడు ఎంఏ అల్లూష్ (18) ఆటో తీసుకుని స్టేషన్‌కు వెళ్లాడు. వారిని తీసుకుని వస్తున్న క్రమంలో ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో అజీజ్, అల్లూష్ అక్కడికక్కడే చనిపోయారు. మిగతా వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా.. అజీజ్ వికలాంగ ధ్రువీకరణ పత్రం పొందేందుకు మంచిర్యాలకు వెళ్లాడు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చనిపోవడంతో వారి ఇంట్లో విషాదం నెలకొంది. కిలోమీటరు దూరంలో ఉన్న ఇంటికి వస్తున్న క్రమంలో ప్రమాదం జరగడం అందరినీ కలిచివేసింది. కుటుంబ కలహాలతో.. లక్సెట్టిపేట మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన పేరం గురువయ్య (40), ఉమ (35) దంపతులు. వీరికి ఇరవై ఏళ్ల క్రితమే వివాహమైంది. వీరికి సౌజన్య, మేఘన ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొద్ది రోజులుగా గురువయ్య అతిగా మద్యం తాగి వచ్చి నిత్యం భార్యతో గొడవపడుతుండే వాడు. రోజూ ఎందుకు తాగుతున్నావు.. ఎందుకు గొడవ పెడుతున్నావని ఉమ మందలిస్తుండేది. ఈ క్రమంలోనే శనివారం ఉదయం కూరగాయలు తీసుకురావడానికి తోట వద్దకు వెళ్లారు. కూరగాయలు తెంపాలని గురువయ్యను ఉమ కోరగా వినిపించుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరూ అక్కడే ఉన్న పురుగుల మందు తాగారు. ఇరువురిని స్థానికులు ఆస్పత్రికి తీసుకురాగా ఉమ చనిపోయింది. గురువయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తీసుకెళ్లారు. మృతురాలి తమ్ముడు వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎస్కే లతీఫ్ తెలిపారు.