
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చెన్నై : విషం తాగి ఓ ప్రేమజంట ఆత్మహత్యకు యత‍్నించింది. ఈ ఘటన తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో చోటుచేసుకుంది. తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టి పుదుగ్రామం ఆరవ వీధికి చెందిన ముత్తుపాండి కుమారుడు పాండిదురై (22). అతనికి అదే ప్రాంతానికి చెందిన 17 సంవత్సరాల విద్యార్థినితో పరిచయం ఏర్పడి ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకునేందుకు నిశ్చయించుకున్నారు.
వీరి ప్రేమపెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో విరక్తి చెందిన ప్రేమజంట బుధవారం వేలాయుధపురం రైల్వేస్టేషన్ సమీపంలో కూల్‌డ్రింక్స్‌లో విషం కలిపి తాగారు. స్పృహతప్పి పడి వున్న ఇద్దరిని స్థానికులు కోవిల్‌పట్టి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తరువాత ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం తూత్తుకుడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ పాండిదురైకి విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment