
ఫైల్ ఫోటో
సాక్షి, నెల్లూరు: గూడూరు పట్టణంలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసుకున్న కేసును పోలీసులు చేధించారు. తనను దూరం పెట్టిందన్న ఆక్రోశంతో ప్రియురాలిని ప్రియుడే అంతం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆమెను హత్యచేసి అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. విచారణలో వెలుగు చూసిన కీలక విషయాలను ఏఎస్పీ వెకంటరత్నం బుధవారం వెల్లడించారు. తేజస్విని ,వెంకటేష్ ఇద్దరూ ప్రేమించుకున్నారని, వీరిద్దరి మధ్య రెండు నెలలుగా ఇద్దరి విభేదాలు వచ్చాయని ఆయన తెలిపారు.
వెంకటేష్‌ను తేజస్విని దూరం పెట్టడంతో ఆ కసితోనే ప్రేయసిని హత్యచేయాలని నిందితుడు రెక్కీ నిర్వహించాడని పేర్కొన్నారు. తేజస్విని క్లాస్ మేట్ శివ ,స్నేహితుడు పృద్విరాజ్‌తో కలిసి హత్యకు కుట్ర పన్నినట్లు వెల్లడించారు. పథకం ప్రకారం ఇంటిలోకి చొరపడి తేజస్వినిని హత్యచేశాడని, ఆ తర్వాత వెంకటేష్ ఆత్మహత్యా ప్రయత్నం చేశాడన్నారు. వెంకటేష్ ,పృథ్విరాజ్ ,శివలను అరెస్ట్ చేశామని, బైకు, కత్తి, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment