
సాక్షి, నెల్లూరు: నగర శివారులో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా రూరల్ మండలానికి చెందిన హరీష్ ఇట్టమూరు మండలంలోని మెట్టు సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్‌గా, నాయుడుపేటకు చెందిన లావణ్య అదే సచివాలయంలో వీఆర్‌వోగా పనిచేస్తున్నారు. వీరుద్దరూ శుక్రవారం విధులకు హాజరుకాలేదు.
చదవండి: నేను మూడో కన్ను తెరిస్తే భస్మమే : పద్మజ
నెల్లూరు నగర శివారు ప్రాంతమైన నందా లాడ్జిలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. ఇద్దరూ కలిసి ఓకే తాడుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రాత్రయినా హరీష్, లావణ్య ఇంటికి రాకపోవడంతో ఇరువురు కుటుంబ సభ్యులు వీరి కోసం గాలింపు చర్యలుచేపట్టగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇరువురి ప్రేమను కుటుంబసభ్యులు అంగీకరించపోవడంతో మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. నెల క్రితం పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకున్నట్లు సమాచారం. చదవండి: ప్రేమ విఫలం: క్షణం ఆలస్యమైతే చచ్చేవాడే!
Comments
Please login to add a commentAdd a comment