
చండీగఢ్: డబ్బు విషయంలో భర్తతో గొడవపడి అత్యంత క్రూరంగా ప్రవర్తించింది ఓ మహిళ. 8 ఏళ్ల కుమారుడ్ని ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లి కాలువలోకి విసిరేసింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయింది. పంజాబ్ హోషియార్‌పూర్ జిల్లా ఉచ్చి బస్సి గ్రామంలో మంగళవారం ఈ ఘటన జరిగింది.
పోలీసులు నిందితురాలిని బుధవారం అరెస్టు చేశారు. హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలుడు కాలువలో కొట్టుకుపోయాడని, ఆచూకీ తెలియలేదని పోలీసులు తెలిపారు.
తరచూ గొవడ..
నిందితురాలి పేరు రీనా కుమారి. ఆమె భర్త పేరు రవి కుమార్. 2012లో వివాహం అయింది. వీరికి 10 ఏళ్ల కూతురు, 8 ఏళ్ల కుమారుడు ఉన్నారు. అయితే డబ్బు సంపాదించడం కోసం రవి కుమార్ ఈ ఏడాది మాల్దీవ్స్ వెళ్లాడు. అతనితో రోజూ ఫోన్లో మాట్లాడే రీనా.. తరచూ డబ్బు పంపించమని గొడవపడేది. ఇలానే మంగళవారం కూడా డబ్బు పంపాలని అడిగింది. లేకపోతే ఇద్దరు పిల్లలను కాలువలోకి విసిరేస్తానంది. అయినా భర్త డబ్బులు పంపించకపోవడంతో రీనా విచక్షణ కోల్పోయింది. 8 ఏళ్ల కుమారుడ్ని తీసుకెళ్లి కాలువలోకి విసిరేసింది.
చదవండి: ఫ్రెండ్స్‌తో అడవిలో మందు తాగుతుండగా ఈడ్చుకెళ్లిన పులి.. సగం తిని..
Comments
Please login to add a commentAdd a comment