thrown into canal
-
డబ్బు విషయంలో భర్తతో గొడవ.. 8 ఏళ్ల కుమారుడ్ని కాలువలోకి విసిరి..
చండీగఢ్: డబ్బు విషయంలో భర్తతో గొడవపడి అత్యంత క్రూరంగా ప్రవర్తించింది ఓ మహిళ. 8 ఏళ్ల కుమారుడ్ని ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లి కాలువలోకి విసిరేసింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయింది. పంజాబ్ హోషియార్పూర్ జిల్లా ఉచ్చి బస్సి గ్రామంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. పోలీసులు నిందితురాలిని బుధవారం అరెస్టు చేశారు. హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలుడు కాలువలో కొట్టుకుపోయాడని, ఆచూకీ తెలియలేదని పోలీసులు తెలిపారు. తరచూ గొవడ.. నిందితురాలి పేరు రీనా కుమారి. ఆమె భర్త పేరు రవి కుమార్. 2012లో వివాహం అయింది. వీరికి 10 ఏళ్ల కూతురు, 8 ఏళ్ల కుమారుడు ఉన్నారు. అయితే డబ్బు సంపాదించడం కోసం రవి కుమార్ ఈ ఏడాది మాల్దీవ్స్ వెళ్లాడు. అతనితో రోజూ ఫోన్లో మాట్లాడే రీనా.. తరచూ డబ్బు పంపించమని గొడవపడేది. ఇలానే మంగళవారం కూడా డబ్బు పంపాలని అడిగింది. లేకపోతే ఇద్దరు పిల్లలను కాలువలోకి విసిరేస్తానంది. అయినా భర్త డబ్బులు పంపించకపోవడంతో రీనా విచక్షణ కోల్పోయింది. 8 ఏళ్ల కుమారుడ్ని తీసుకెళ్లి కాలువలోకి విసిరేసింది. చదవండి: ఫ్రెండ్స్‌తో అడవిలో మందు తాగుతుండగా ఈడ్చుకెళ్లిన పులి.. సగం తిని.. -
అంబానీ ఇంటివద్ద కలకలం: బతికుండగానే నీటిలో
సాక్షి,ముంబై: రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాల వాహనం వివాదంలో మరో సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో కీలక వ్యక్తి, అనుమానిత వాహనం స్కార్పియో యజమాని మన్సుఖ్ హిరేన్ మృతిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారి సచిన్ వాజేపై మరింత ఉచ్చు బిగ్గుస్తున్న నేపథ్యంలో మరో కీలక విషయాన్ని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) వెల్లడించింది. హిరేన్‌ను బతికుండగానే నీటిలోకి తోసేసి ఉంటారనే అనుమానాలను ఏటీఎస్ వ్యక్తం చేసింది. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో నిర్వహించిన డయాటమ్ పరీక్షల్లో ఈ విషయం వెల్లడైనట్టు తెలిపింది. (అంబానీ ఇంటి వద్ద కలకలం: సంచలన ఆధారాలు) డయాటమ్ (నీటిలో మునిగి చనిపోయిన మరణాల నిర్ధారణలో ముఖ్యమైన టెస్ట్) టెస్ట్ రిపోర్ట్ ఆధారంగా ఏటీఎస్ హిరేన్ నీటిలో పడే సమయానికి జీవించే ఉన్నాడని భావిస్తోంది. ఊపిరితిత్తుల నీటి నిష్పత్తి ఈ పరీక్ష ద్వారా తేలిందని అయితే మరింత నిర్ధారణకోసం డయాటమ్ ఎముక నమూనాలను హరియాణా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్)కు పంపించామని ఏటీఎస్ డీఐజీ శివదీప్ లాండే చెప్పారు. అలాగే విసెరా, రక్త నమూనాలు, గోరు క్లిప్పింగుల నివేదికలు కూడా ఎదురు చూస్తున్నామన్నారు. కల్వాలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆసుపత్రిలో హిరాన్ పోస్టుమార్టం చేసిన ముగ్గురు వైద్యుల వాంగ్మూలాలను రికార్డుచేయనున్నామని ఆయన చెప్పారు. హిరేన్ నోటిలో కుక్కిన రుమాలు, తదితర అంశాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని ఏటీఎస్ అధికారి ఒకరు తెలిపారు అంతేకాదు పోస్టుమార్టం చేస్తున్నప్పుడు అరెస్టయిన సచిన్ వాజే ఆసుపత్రికి ఎందుకు వెళ్లారో కూడా దర్యాప్తు బృందం పరిశీలిస్తుందని మరో అధికారి తెలిపారు. (ముంబై పోలీసు కమిషనర్‌పై బదిలీ వేటు) మరోవైపు ఈ వివాదంలో శివసేనపై ఆరోపణలు గుప్పిస్తున్న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి తన దాడిని ఎక్కు పెట్టారు. తాను సీఎంగా ఉన్న కాలంలో 2018లో శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే అప్పటికి సస్పెండ్ అయిన వాజేను తిరిగి రాష్ట్ర పోలీసు బలగాల్లోకి తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. కాగా అనుమానాస్పద స్థితిలో కొలనులో శవమై తేలిన హిరేన్ పోస్ట్‌మార్టమ్ నివేదికలో ముఖం, భుజాలపై గాయాలున్నట్టు తేలిన సంగతి విదితమే. అలాగే హిరేన్‌కు ఈతబాగా వచ్చని, నీటిలో మునిగి చనిపోయే అవకాశం లేదని సమీప బంధువు ఒకరు ఇప్పటికే వాదించారు. అటు, తన భర్త మెడలో బంగారు చైన్, ఉంగరం, మొబైల్, చేతిగడియారం, వాలెట్లోని ఆరేడు ఏటీఎం కార్డులు, కొంత నగదు కూడా మిస్సయినట్టు హిరేన్ భార్య విమలా ఆరోపించారు. తన భర్త మరణానికి సచిన్ వాజే కారణమంటూ ఫిర్యాదు చేశారు. ఈ కేసును ఏటీఎస్ దర్యాప్తు చేస్తోంది. -
అయ్యో.. పాపం పసిపాప..
సాక్షి, బొబ్బిలి: పట్టణంలోని పోలవానివలస సమీపంలోని ఓ కాలువలో గురువారం తెల్లవారుజామున అప్పుడే పుట్టిన ఓ ఆడపిల్ల మృతదేహం తేలియాడుతుండడం కలకలం సృష్టించింది. ఎవరో ఇక్కడకు సంచిలో తీసుకువచ్చి బిడ్డను కాలువలో విసిరేసి సంచి పక్కన పడేసి తేలిగ్గా వెళ్లిపోయింది. దీంతో ఆ పసికందు నీటిలో కొట్టుకుంటూ ఊపిరాడక మృతి చెందింది. దీంతో స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ.. ఎవరికి ఏ కష్టం వచ్చిందో చిన్నారిని ఇలా కాలువలో పడేశారని వాపోయారు. ఒకటి,రెండు రోజుల్లోనే..! కాలువలో తేలియాడుతున్న ఆడబిడ్డను చూసిన వారు ఒకటి, రెండు రోజుల్లోపే జన్మించి ఉంటుందని చెబుతున్నారు. మృతదేహం ఉబ్బకపోవడాన్ని బట్టి పుట్టిన వెంటనే కాలువలో పడేసి వెళ్లిపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ క్లిప్పు ఆధారమవుతుందా..? శిశువు బొడ్డును కత్తిరించినపుడు ఆస్పత్రుల్లో క్లిప్ పెడతారు. సెప్టిక్ కాకుండా, గాలి వెళ్లకుండా భద్రత కోసం పెట్టిన క్లిప్పుతోనే బిడ్డను నీటిలో పడేసి వెళ్లిపోయిన అగంతకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పుడా క్లిప్పు ఆధారంగా కేసు దర్యాప్తు చేసే అవకాశముందని తెలుస్తోంది. దీని ఆధారంగా ఆస్పత్రులను పరిశీలించి ఆ కర్కశ తల్లిదండ్రులను పట్టుకుని శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. పరిశీలించిన పోలీస్, ఐసీడీఎస్ సిబ్బంది.. బొబ్బిలి ఐసీడీఎస్ కార్యాలయాల ఎదురుగానే ఆడ శిశువును కాలువలో పడేశారని తెలుసుకున్న పోలీసులు, ఐసీడీఎస్ సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మా పరిధిలో బాలింతలు లేరని ఐసీడీఎస్ సిబ్బంది అంటుండగా.. కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. వదిలిపెట్టం.. ఇది హేయమయిన సంఘటన.. చిన్నారిని కాలువలో విసిరేసిన ఎవ్వరైనా వదిలి పెట్టేదిలేదు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో విచారిస్తాం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. – వి. ప్రసాదరావు, ఎస్సై, బొబ్బిలి -
ప్రియుడ్ని పెళ్లాడుతానన్నందుకు కాలువలో తోసేశారు
ముజఫర్‌నగర్: పెద్దలకు ఇష్టంలేకుండా ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకోవాలనుకున్న ఓ యువతిని కుటుంబ సభ్యులు నదిలో తోసేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ ప్రాంతంలోని నిర్గజ్ని గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. నిర్గజ్ని గ్రామానికి చెందిన 23 ఏళ్ల యువతి ఓ యువకుడిని ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ యువతి ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా వారు పెళ్లికి నిరాకరించారు. కుటుంబ సభ్యులు ఆమెను తీసుకెళ్లి.. గంగా నదిలో కలిసే కాలువలోకి తోసేశారు. కాగా కొందరు గ్రామస్తులు గమనించి ఆ యువతిని రక్షించారు. పోలీసులు యువతి తండ్రి, సోదరుడిపై కేసు నమోదు చేశారు.