Recipe: కీమా – రాగి పొంగనాలు తయారు చేసుకోండిలా! | Recipes In Telugu: How To Prepare Keema Ragi Ponganalu | Sakshi
Sakshi News home page

Keema Ragi Ponganalu: కీమా – రాగి పొంగనాలు తయారు చేసుకోండిలా!

Published Tue, Feb 7 2023 5:04 PM | Last Updated on Tue, Feb 7 2023 5:38 PM

Recipes In Telugu: How To Prepare Keema Ragi Ponganalu - Sakshi

కీమా – రాగి పొంగనాలు తయారు చేసుకోండిలా!
కావలసినవి:
►కీమా – 50 గ్రాములు (దాల్చినచెక్క పొడి, మిరియాల పొడి వేసుకుని.. మెత్తగా కుకర్‌లో ఉడికించుకోవాలి)
►ఆమ్‌చూర్‌ పౌడర్‌ – పావు టీ స్పూన్‌ 
►టొమాటో సాస్, చిల్లీ సాస్‌ – అర టేబుల్‌ స్పూన్‌  చొప్పున
►చాట్‌ మసాలా – 1 టీ స్పూన్‌

►మినపగుళ్లు – 1 కప్పు (రెండు గంటల ముందు నానబెట్టుకుని, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి)
►రాగిపిండి – ఒకటిన్నర కప్పులు
►ఉప్పు – తగినంత
►నీళ్లు – సరిపడా
►నూనె – 2 టేబుల్‌ స్పూన్లు పైనే

తయారీ:
►ముందుగా కళాయిలో ఒక టేబుల్‌ స్పూన్‌  నూనె పోయాలి.
►తర్వాత.. ఉడికిన కీమాతో పాటు.. ఆమ్‌చూర్‌ పౌడర్, టొమాటో సాస్, చిల్లీ సాస్, చాట్‌ మసాలా, కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా గరిటెతో అటూ ఇటూ కలిపాలి
►ఒక నిమిషం తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి.
►ఈలోపు ఒక బౌల్‌ తీసుకుని.. అందులో మినప్పిండి, రాగి పిండి, కొద్దిగా ఉప్పు వేసుకుని.. కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ కాస్త జారుగా కలుపుకోవాలి.
►అనంతరం పొంగనాల ప్లేట్‌లో ఒక్కో గుంతలో కొద్దికొద్దిగా నూనె వేసుకుని.. కొద్దికొద్దిగా రాగిపిండి మిశ్రమం.. మధ్యలో కొద్దిగా కీమా మిశ్రమం ఆ పైన మళ్లీ రాగి పిండి ►మిశ్రమం పెట్టుకుని.. వాటిని ఉడికించుకోవాలి.
►వేడి వేడిగా ఉన్నప్పుడే కొత్తిమీర చట్నీతో లేదా సాస్‌తో తింటే భలే రుచిగా ఉంటాయి ఈ పొంగనాలు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement