చికెన్‌తో రొటీన్‌గా కాకుండా వైరైటీ వంటకాలు చేయడం మీకు ఇష్టమా! అయితే, ఈసారి ఇంట్లోనే సులువైన పద్ధతిలో చికెన్ కీమా పకోడా ట్రై చేసి చూడండి.
చికెన్ కీమా పకోడా తయారీకి కావాల్సిన పదార్థాలు
►చికెన్ కీమా, మొక్కజొన్న పిండి – అర కప్పు చొప్పున
►బియ్యప్పిండి, శనగపిండి – పావు కప్పు చొప్పున
►పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్
►ఉల్లిపాయలు – 2 (మీడియం సైజ్, సన్నగా తరగాలి)
►కారం – అర టీ స్పూన్
►నిమ్మరసం – 2 టీ స్పూన్లు
►అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
►జీలకర్ర – అర టీ స్పూన్
►నీళ్లు – కొన్ని
►ఉప్పు – తగినంత
►నూనె – సరిపడా
చికెన్ కీమా పకోడా తయారీ విధానం:
►ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో చికెన్ కీమా, మొక్కజొన్న పిండి, పచ్చిమిర్చి ముక్కలు, బియ్యప్పిండి, శనగ పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, నిమ్మరసం, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర తురుము.. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి.
►ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి.
►అనంతరం నూనెలో పకోడాలు వేసుకుని, దోరగా వేయించుకోవాలి.
►సర్వ్ చేసుకునే ముందు కొత్తిమీర తురుముతో గార్నిష్ చేసుకోవాలి.
చదవండి👉🏾:Health Tips: గ్యాస్ట్రిక్ నొప్పి వస్తే గుండెనొప్పిలా అనిపిస్తుంది.. తేడా తెలుసుకోవడం ఎలా?
Comments
Please login to add a commentAdd a comment