Elon Musk: భారతదేశం గొప్ప కట్టడాలకు, కళలకు మాత్రమే కాదు వంటకాల్లో కూడా గొప్ప ఖ్యాతి పొందింది. రాజులు పరిపాలన కాలంలోనే మన దేశాన్ని సందర్శించిన కొంత మంది విదేశీయ యాత్రికులు భారతీయులు భోజన ప్రియులని, అక్కడి వంటాకాలు అద్భుతంగా ఉంటాయని తమ గ్రంధాల్లో రాసినట్లు చరిత్రలో చదువుకున్నాము. అప్పటి నుంచి ఇప్పటివరకు అది అలాగే కొనసాగుతూ ఉంది. 'కింగ్ చార్లెస్ 111'కి కూడా భారతీయ వంటకాలంటే చాలా ఇష్టమని ఒక సందర్భంలో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ప్రపంచ కుబేరులలో ఒకడైన 'ఎలాన్ మస్క్' కూడా ఒప్పుకున్నాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఎలాన్ మస్క్ రిప్లై..
ఇటీవల ఎలాన్ మస్క్ ట్విటర్ ఫాలోవర్ ఒకరు మన దేశంలోని వంటకాలను ప్రశంసిస్తూ ఒక పోస్ట్ చేసింది. ఇందులో భారతీయ వంటకాలంటే చాలా ఇష్టమని, బేసిక్ ఫుడ్స్ అంటే మరింత ఇష్టమని పేర్కొంది. దీనికి ఎలాన్ మస్క్ నిజమే అంటూ రిప్లై ఇచ్చాడు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిని ఇప్పటికే 1.7 మిలియన్లకు పైగా వ్యూస్, 21,400కి పైగా లైక్‌లు & 1206 పైగా రీట్వీట్‌లు వచ్చాయి.
(ఇదీ చదవండి: ఆన్‌లైన్‌లో డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా? ట్విటర్ బంపరాఫర్)
True
— Elon Musk (@elonmusk) May 16, 2023
ఈ పోస్ట్‌కి రిప్లై ఇచ్చిన వారిలో ఒకరు మస్క్ టేస్ట్ చాలా బాగుందని, ఇండియాకు వచ్చినప్పుడు భారతీయ వంటకాలు రుచి చూడాలని అన్నాడు. అంతే కాకుండా 28 రాష్ట్రాలలో ఉన్న వివిధ వంటకాలను రుచి చూడటమే కాకుండా విభిన్న సంస్కృతులు, విభిన్న ఆహారాలు, విభిన్న భాషలు, విభిన్న వ్యక్తులు ఉన్న ప్రతి రాష్ట్రాన్ని మీరు ఆనందించవచ్చంటూ కామెంట్ చేశారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి.
Comments
Please login to add a commentAdd a comment