
రింగ్‌లో దిగితే తనకు తిరుగు లేదని నిరూపించుకున్న ఫైటర్ 'డ్వేన్ జాన్సన్'. అభిమానులు ఆయన్ను ముద్దుగా "ద రాక్" అని పిలుచుకుంటారు. రెజ్లింగ్ తర్వాత హాలీవుడ్‌లోకి ప్రవేశించిన ఆయన అక్కడ కూడా తన సత్తా చాటుతున్నారు. తాజాగా ఆయన కుటుంబం కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని డ్వేన్ జాన్సన్ ఇన్‌స్టాగ్రామ్‌లో బుధవారం వీడియో ద్వారా వెల్లడించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. తనతో పాటు కుటుంబానికంతటికీ కరోనా వచ్చిందని తెలిపారు. (చదవండి:ఒక్క పోస్టు కోట్లు కురిపిస్తాయి..)
తొలుత ఈ విషయం తనను షాక్‌కు గురి చేసిందన్నారు. అయితే తనతో సహా భార్య లారెన్ హషైన్, ఇద్దరు కూతుళ్లు కరోనా నుంచి కోలుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. మొదట్లో పిల్లలిద్దరికీ కొద్ది రోజుల పాటు గొంతు నొప్పి వచ్చిందన్నారు. ఇప్పడు కరోనాను జయించి ఎప్పటిలానే ఆడుకుంటున్నారని తెలిపారు.ఓ రకంగా చెప్పాలంటే ఇలా జరగడం వల్ల తనకు ఆరోగ్యం మీద మరింత స్పృహ వచ్చిందన్నారు. వైరస్‌ను ఎదుర్కొనేందుకు మాస్కులు ధరించడం, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం వంటివి పాటించాలని డ్వేన్ జాన్సన్ అభిమానులకు సూచించారు. (చదవండి:ఈ కేసు విచారణకు అతడు అనర్హుడు: ఏంజెలినా)
Comments
Please login to add a commentAdd a comment