లాస్‌ఎంజిల్స్: డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్, హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ (రాక్) అమెరికా అధ్యక్షుడు కావాలని ఆ దేశంలో దాదాపు సగం మంది ప్రజలు కోరుకొంటున్నారట. అదేంటి యూఎస్ అధ్యక్ష ఎన్నికలు ఎప్పడో ముగిశాయి కాదా.. మరి కొత్తగా ఇదేంటి అనుకుంటున్నారా. ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా ప్రముఖ వ్యక్తులలో ఎవరు ఉండాలనే అంశంపై ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఆ సంస్థ అమెరికా ప్రజలను మీకు అధ్యక్షుడిగా డ్వేన్ జాన్సన్ కావాలని కోరుకొంటున్నారా అన్ని ప్రశ్నించగా.. 46 శాతం మంది అమెరికన్లు అవును అని సమాధానమిచ్చారు.
ఈ పోల్ ఫలితాన్ని డ్వేన్ జాన్సన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ పోల్ స్పందనపై రాక్ మాట్లాడుతూ ‘ఒక వేళ నాకు అమెరికా అధ్యక్షునిగా అవకాశం లభిస్తే, అది ప్రజలకు సేవ చేసేందుకు నాకు లభించిన గౌరవంగా భావిస్తాను’ అని అన్నారు. ఇప్పటికే రెజ్లర్‌గా, నటుడిగా పుల్ ఫాలోయింగ్ సంపాదించిన జాన్సన్‌కు అదృష్టం ఉంటే భవిష్యత్తులో అధ్యక్ష పదవి కూడా లభిస్తుందేమో. గతంలోనూ డ్వేన్ జాన్సన్ అమెరికా అధ్యక్ష పదవిపై తనకున్న ఆశను బయటపెట్టారు. 2017లో అధ్యక్ష పదవి కోసం పోటీ చేయడానికి తాను తీవ్రంగా ప్రయత్నించినట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే.
( చదవండి: అమెరికాలో ‘రెడ్‌ఫ్లాగ్ లా’ అమలుకు బైడెన్ కసరత్తు! )
Comments
Please login to add a commentAdd a comment