loss angeles
-
లాస్ ఏంజిల్స్‌లో నాట్స్ 5కే వాక్‌థాన్‌కు మంచి స్పందన
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తాజాగా లాస్ ఏంజిల్స్ సిమివ్యాలీలో 5కే వాక్‌థాన్ నిర్వహించింది. లాస్ ఏంజిల్స్ నాట్స్ విభాగం నిర్వహించిన ఈ వాక్‌థాన్‌కు మంచి స్పందన లభించింది. పద్మవిభూషణ్ రతన్ టాటా స్మారకార్థం నిర్వహించిన ఈ వాక్‌థాన్‌కు 100 మందికి పైగా స్థానిక తెలుగువారు, భారతీయులు పాల్గొన్నారు. రతన్ టాటా సేవా వారసత్వాన్ని కొనసాగించడమే ఆయనకు మనం ఇచ్చే అసలైన నివాళి అని ఈ వాక్‌థాన్ ప్రారంభంలో నాట్స్ నాయకులు తెలిపారు. రతన్ టాటా గొప్పతనాన్ని, ఆయన సేవా భావాన్ని ఈ సందర్భంగా నాట్స్ నాయకులు గుర్తు చేశారు. ఈ వాక్‌థాన్‌కు సహకరించిన నాట్స్ బోర్డు సెక్రటరీ మధు బోడపాటి, నాట్స్ ప్రోగ్రామ్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి, నేషనల్ కోఆర్డినేటర్లు కిషోర్ గరికిపాటి, రాజలక్ష్మి చిలుకూరి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్లకు నాట్స్ లాస్ ఏంజిల్స్ విభాగం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.లాస్ ఏంజిల్స్ నాట్స్ చాప్టర్ కోఆర్డినేటర్ మురళీ ముద్దన, జాయింట్ కోఆర్డినేటర్ బిందు కామిశెట్టి, అధ్యక్షులు సిద్ధార్థ కోల, శ్రీనివాస్ మునగాల, రాధ తెలగం, అరుణ బోయినేని, గురు కొంక లతో పాటు సహాధ్యక్షులు పద్మజ గుడ్ల, సరోజా అల్లూరి, హరీష్ అందె, ముకుంద్ పరుచూరి తదితరుల సహకారంతో ఈ వాక్‌ధాన్ దిగ్విజయం అయింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.(చదవండి: టాంపలో నాట్స్ బోర్డ్ సమావేశం సంబరాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ) -
లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశం..!
లాస్ ఏంజిల్స్‌లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలతో తెలుగువారికి మరింత చేరువ అవుతుంది. ఈ క్రమంలోనే నాట్స్ 2024-2026 కి సంబంధించిన నూతన కార్యవర్గం తొలి సమావేశంలో లాస్ ఏంజిల్స్‌లోని అనాహైమ్‌లో సమావేశమై భవిష్యత్ కార్యచరణపై చర్చించింది. . డిసెంబర్ 15వ తేదీన బాలల సంబరాల నిర్వహణ, అక్టోబర్, నవంబర్ మాసాల్లో తెలుగు వారిని ఐక్యం చేసేలా కార్యక్రమాలను నిర్వహించేందుకు ఓ ప్రణాళికను ఈ సమావేశంలో రూపొందించారు.ముఖ్యంగా నాట్స్ హెల్ఫై లైన్ సేవలను మరింత విసృత్తం చేసే దిశగా నాట్స్ సభ్యులు, వాలంటీర్లు కృషి చేయాలని నాట్స్ మార్గదర్శకులు రవి ఆలపాటి పిలుపునిచ్చారు. సాటి తెలుగువారికి సాయపడేందుకు సదా సిద్ధంగా ఉండాలన్నారు. లాస్ ఏంజిల్స్‌లో తెలుగువారికి ఏ కష్టమోచ్చినా నాట్స్ అండగా ఉంటుందనే భరోసా ఉందని.. ఆ భరోసాను మరింతగా వృద్ధి చేసే బాధ్యత నాట్స్ సభ్యులపై ఉందన్నారు. నాట్స్ లాస్ ఏంజిల్స్ చాప్టర్ విభాగ సమావేశానికి నాట్స్ మార్గదర్శకులు డాక్టర్ రవి ఆలపాటి, డాక్టర్ వెంకట్ ఆలపాటి, మధు బోడపాటి, కిషోర్ గరికపాటి, శ్రీనివాస్ చిలుకూరి, శ్రీ మనోహర రావు మద్దినేని, రాజ్యలక్ష్మి చిలుకూరిలు నూతన కార్యవర్గానికి విలువైన సూచనలు చేశారు.నాట్స్ లాస్ ఏంజిల్స్ కో ఆర్డినేటర్‌గా మురళీ ముద్దననాట్స్ లాస్ ఏంజిల్స్ 2024-2026కి మురళీ ముద్దన కో ఆర్డినేటర్‌గా, బిందు కామిశెట్టి జాయిట్ కో ఆర్డినేటర్‌గా బాధ్యతలను స్వీకరించారు. ఇంకా నాట్స్ లాస్ ఏంజిల్స్ విభాగం నుంచి శంకర్ సింగంశెట్టి, ముకుంద్ పరుచూరి, శ్రీనివాస మునగాల, రేఖ బండారి, సతీష్ యలవర్తి, శ్యామల చెరువు, లత మునగాల, సిద్ధార్థ కోల, శ్రీరామ్ వల్లూరి, శివ కోత, అరుణ బోయినేని, హరీష్ అందె, చంద్ర మోహన్ కుంటుమళ్ల తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గురు కొంక, రాధా తెలగం, పద్మజ గుడ్ల, సరోజా అల్లూరి తదితరులు నాట్స్ లాస్ ఏంజిల్స్ విభాగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించనున్నారు.(చదవండి: అమెరికాలో బతుకమ్మ సంబరాలు..!) -
Oscars 2023: కోరిక తీరింది.. పాటతో మనసులో మాట చెప్పిన ఎంఎం కీరవాణి!
లాస్ ఏంజెల్స్: ప్రపంచ వేదికపై ఓ తెలుగు సినిమా ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ను కైవసం చేసుకుని మన సత్తా చాటింది. భారతీయ చిత్రం ఆర్ఆర్ఆర్లోని ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో అవార్డ్‌ను సొంతం చేసుకుని చరిత్రను తిరగరాసింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు చిత్రానికి గుర్తింపును తెచ్చిపెట్టింది. లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. ఆస్కార్ అవార్డ్‌ను ఈ చిత్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందుకున్నారు. అనంతరం ఆయన పాట రూపంలో తన ఆనందాన్ని వ్యక్త పరిచారు. అందులో.. ‘నా మదిలో ఒకే ఒక కోరిక ఉండేది. అదే ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కైవసం చేసుకోవాలని’ అన్నారు. ఈ సినిమా భారతీయులను గర్వపడేలా చేసిందన్నారు. ఆర్ఆర్ఆర్… తనను ప్రపంచ శిఖరాగ్రాన నిలబెట్టిందని, థ్యాంక్యూ కార్తికేయ అని కీరవాణి పేర్కొన్నారు. చివరిలో రచయిత చంద్రబోస్ నమస్తే అంటూ తెలుగులో ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. ఇక భారతీయ సినీ ప్రేక్షకులు ఎన్నో రోజులుగా కంటున్న కలలను నిజం చేస్తూ రెండు ఆస్కార్లను మన చిత్రాలు దక్కించుకున్నాయి. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ బెస్ట్ ఒరిజనల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్‌ను సొంతం చేసుకోగా.. మరో భారతీయ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్‌ను దక్కించుకుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #NaatuNaatu wins the #Oscar for best Original Song 😭#SSRajamouli & team has done it🫡🇮🇳 Indian Cinema on the Rise 🔥 !! #RRRMovie | #AcademyAwards | pic.twitter.com/VG7zXFhnJe — Abhi (@abhi_is_online) March 13, 2023 -
Oscars 2023: ప్చ్.. ఆస్కార్ మిస్ చేసుకున్న భారతీయ చిత్రం ఇదే!
లాస్ ఏంజెల్స్: ఈ ఏడాది ఆస్కార్ బరిలో నిలిచిన భారత డాక్యుమెంటరీ చిత్రానికి నిరాశ ఎదురైంది. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం కేటగిరిలో నామినేట్ అయిన ‘ఆల్ దట్ బ్రీత్స్’ (All That Breathes) అస్కార్‌ను దక్కించుకోలేకపోయింది. ఈ విభాగంలో అమెరికాకి చెందిన ‘నావాల్నీ’ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలింను అవార్డ్ వరించింది. ఆల్ దట్ బ్రీత్స్ని షానక్ సేన్ దర్శకత్వం వహించారు. ఈ కేటగిరిలో ఇతర నామినీల విషయానికొస్తే.. ఆల్ ది బ్యూటీ అండ్ ది బ్లడ్‌షెడ్, ఫైర్ ఆఫ్ లవ్, ఎ హౌస్ మేడ్ ఆఫ్ స్ప్లింటర్స్ చిత్రాలు ఉన్నాయి. ‘ఆల్ దట్ బ్రీత్’స్ ఈ విభాగంలో నామినేట్ చేసిన రెండవ భారతీయ చిత్రం. గత సంవత్సరం రింటు థామస్, సుష్మిత్ ఘోష్ రాసిన రైటింగ్ విత్ ఫైర్, ఆస్కార్స్‌లో ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్‌గా ఎంపికైంది. ఆల్ దట్ బ్రీత్స్.. ఢిల్లీలో బర్డ్ క్లినిక్ నడుపుతున్న సౌద్, నదీమ్ అనే ఇద్దరు సోదరుల కథ ఇది. ఈ డాక్యుమెంటరీ ఫిలిం ఫెస్టివల్ సర్క్యూట్లో సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌తో పాటు అనేక అవార్డులను గెలుచుకుంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రదర్శించారు. -
Oscar 2023: వావ్.. భారత్‌కు ‘ఆస్కార్’.. ఏ చిత్రమో తెలుసా?
లాస్ ఏంజెల్స్: లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్లో వేదికగా జరుగుతున్న 95వ ఆస్కార్ వేడుకలో భారత సినిమాలు సత్తా చాటుతున్నాయి. బెస్ట్ షార్ట్ ఫిలిం కేటగిరిలో ’ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ గెలుచుకుంది. కార్తికి గోన్సాల్వెస్ ’ది ఎలిఫెండ్ విస్పరర్స్’కు దర్శకత్వం వహించింది. డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో భారత్ ఈ ఆస్కార్‌ను దక్కించుకుంది. ఈ అవార్డ్‌ను కార్తికి గోన్సాల్వెస్ అందుకున్నారు. ఇక ఈ షార్ట్ ఫిలిం విషయానికొస్తే.. తప్పిపోయిన ఓ ఏనుగును గిరిజన దంపతులు ఏ విధంగా పెంచి పోషించారు? ఈ క్రమంలో వారికి ఆ ఏనుగుతో ఎలాంటి అనుబంధం ఏర్పడింది? అనే అంశాల నేపథ్యంలో భారతీయ దర్శకురాలు కార్తికి గోన్సాల్వేస్ రూందించిన డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’. -
Oscars 2023: మొదలైన ఆస్కార్ సందడి.. ఈ చిత్రానికే తొలి అవార్డ్!
లాస్ ఏంజెల్స్: ఆస్కార్ 2023 వేడుక అమెరికా లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్లో అట్టహాసంగా ప్రారంభమైంది. సంబరంగా జరిగే ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులతో పాటు ఈ ఏడాది నామినేషన్లలో ఉన్న సినిమాల నటీనటులు, సాంకేతిక సిబ్బంది హాజరయ్యారు. విభాగాల వారీగా అవార్డ్లకు ప్రధానోత్సవం జరుగుతోంది. ఇక భారత్ నుంచి ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ ‘నాటునాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. సినీ ప్రపంచంలో ప్రతిష్టాత్మకంగా ఆస్కార్ (అకాడమీ అవార్డ్స్) భావిస్తారు. అందుకే తారలు తమ జీవితంలో ఒక్క సారైన ఈ అవార్డ్‌ను ముద్దాడాలని కోరుతుంటారు. 2023 గాను మొదటి ఆస్కార్ ఉత్తమ యానిమేటెడ్ సినిమా కేటగిరి దక్కించుకుంది. ఉత్తమ యానిమేటెడ్ సినిమాగా గిల్లెర్మో డెల్ టోరో నిర్మించిన 'పినోచియో' చిత్రం నిలిచింది. ఈ ఏడాది మొదటి ఆస్కార్‌ను కైవసం చేసుకున్న రికార్డు సొంతం చేసుకుంది. ఇందులో మరో విషయం ఏంటంటే.. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్‌ను గెలుచుకుని గిల్లెర్మో డెల్ టోరో ఆస్కార్ చరిత్రలో మొదటి వ్యక్తిగా నిలిచారు. చదవండి: Natu Natu Song: ‘నాటు నాటు’కు ఆస్కార్ వస్తుందా? రాదా? కోట్లలో బెట్టింగ్ -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయ టీనేజర్ల మృతి
అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ ఎన్నారై కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు చనిపోగా తీవ్రంగా గాయపడిన తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాద వివరాలు ఆలస్యంగా వెలుగు చూశాయి జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం బండ్లగూడెం గ్రామానికి చెందిన చెట్టిపెల్లి రామచంద్రారెడ్డి 20 ఏళ్ల కిందట అమెరికాలో వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. ఆయనకి భార్య రజిత, పిల్లలు అక్షరారెడ్డి, ఆర్జిత్రెడ్డిలతో కుటుంబం లాస్ఏంజెలెస్లో నివాసం ఉంటున్నారు. డిసెంబరు 18వ తేదిన స్థానికంగా జరిగిన ఫ్యామిలీ గెట్ టూ గెదర్ పార్టీలో పాల్గొని తిరిగి ఇంటికి వస్తుండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆర్జిత్‌రెడ్డి ఘటన స్థలిలోనే చనిపోగా అక్షరరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజలు తర్వాత చనిపోయారు. రామచంద్రారెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని సన్నిహితులు తెలిపారు. ఆటలు, చదువులో ముందుండే ఆర్జిత్, అక్షరల మృతి పట్ల అమెరికన్ ఎన్నారైలు సంతాపం వ్యక్తం చేశారు. డిసెంబరు 25న స్థానికంగా ఉన్న తెలుగు వారు క్యాండిల్‌లైట్ విజిల్ కార్యక్రమం చేపట్టారు. -
అమెరికా అధ్యక్షుడిగా ఆ హీరో..!
లాస్ఎంజిల్స్: డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్, హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ (రాక్) అమెరికా అధ్యక్షుడు కావాలని ఆ దేశంలో దాదాపు సగం మంది ప్రజలు కోరుకొంటున్నారట. అదేంటి యూఎస్ అధ్యక్ష ఎన్నికలు ఎప్పడో ముగిశాయి కాదా.. మరి కొత్తగా ఇదేంటి అనుకుంటున్నారా. ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా ప్రముఖ వ్యక్తులలో ఎవరు ఉండాలనే అంశంపై ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఆ సంస్థ అమెరికా ప్రజలను మీకు అధ్యక్షుడిగా డ్వేన్ జాన్సన్ కావాలని కోరుకొంటున్నారా అన్ని ప్రశ్నించగా.. 46 శాతం మంది అమెరికన్లు అవును అని సమాధానమిచ్చారు. ఈ పోల్ ఫలితాన్ని డ్వేన్ జాన్సన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ పోల్ స్పందనపై రాక్ మాట్లాడుతూ ‘ఒక వేళ నాకు అమెరికా అధ్యక్షునిగా అవకాశం లభిస్తే, అది ప్రజలకు సేవ చేసేందుకు నాకు లభించిన గౌరవంగా భావిస్తాను’ అని అన్నారు. ఇప్పటికే రెజ్లర్‌గా, నటుడిగా పుల్ ఫాలోయింగ్ సంపాదించిన జాన్సన్‌కు అదృష్టం ఉంటే భవిష్యత్తులో అధ్యక్ష పదవి కూడా లభిస్తుందేమో. గతంలోనూ డ్వేన్ జాన్సన్ అమెరికా అధ్యక్ష పదవిపై తనకున్న ఆశను బయటపెట్టారు. 2017లో అధ్యక్ష పదవి కోసం పోటీ చేయడానికి తాను తీవ్రంగా ప్రయత్నించినట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే. ( చదవండి: అమెరికాలో ‘రెడ్‌ఫ్లాగ్ లా’ అమలుకు బైడెన్ కసరత్తు! ) View this post on Instagram A post shared by therock (@therock) -
చలం భావజాలంతో...
పలు రచనలు చేయడంతో పాటు, అనేక డాక్యుమెంటరీలు తీసిన కిరణ్మయి ఇంద్రగంటి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘రాళ్ళలో నీరు’. కృష్ణ మంజూష, అల్తాఫ్, షఫీ, బిందు చంద్రమౌళి, డా. ప్రసాద్ ముఖ్య పాత్రల్లో ఈ చిత్రాన్ని అనల్ప నిర్మించారు. ‘‘తెలుగులో ‘కన్యాశుల్కం’లా ఇంగ్లిషులో ‘ఏ డాల్స్ హౌస్’ ఫేమస్. 19వ శతాబ్దానికి చెందిన రచయిత హెన్రిక్ ఇబ్సన్ ఈ నాటకం రాశారు. చలం తరహాలో ప్రోగ్రెసివ్ థాట్స్ (ప్రగతిశీల ఆలోచనలు)తో ఉండే ఈ నాటకం థీమ్‌ని తీసుకుని వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా స్క్రిప్ట్ సిద్ధం చేశాను. ఇందులో ఐదు పాత్రలే ఉంటాయి. సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఇటీవలే లాస్ఏంజిల్స్లో ‘అవేర్నెస్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ప్రదర్శించగా మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. -
స్టాక్ మార్కెట్ నష్టాల బాట..
ముంబై : సోమవారం లాభాలతో ఆరంభమైన స్టాక్‌మార్కెట్లు ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో భారీ ఒడుదుడుకుల మధ్య సాగుతున్నాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 12,250 పాయింట్ల ఎగువన ట్రేడవుతోంది. యస్ బ్యాంక్, సెయిల్, ఎస్బీఐ, టాటా స్టీల్, ఇండియాబుల్స్ షేర్లు లాభపడుతుండగా, వొడాఫోన్, టాటా మోటార్స్, ఆర్ఐఎల్ షేర్లు నష్టపోతున్నాయి. మొత్తంమీద బీఎస్ఈ సెన్సెక్స్ 20 పాయింట్ల నష్టంతో 41,661 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 6 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 12,265 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. -
లవ్ ఇన్ లాస్ ఏంజిల్స్
తీరక లేకుండా పని చెయ్.. ఆ తర్వాత తీరిగ్గా ప్రేమించెయ్ అనే పాలసీని ఫాలో అవుతుంటారు కోలీవుడ్ లవ్ కపుల్స్ విఘ్నేష్ శివన్, నయనతార. షూటింగ్స్‌తో నయనతార, కథలు తయారు చేస్తూ. డైరెక్షన్ చేస్తూ విఘ్నేష్ బిజీబిజీగా గడుపుతారు. ఏ కొంచెం విరామం దొరికినా సరే విదేశాలకు వెళ్లిపోతుంటారు. ప్రేమ యాత్రలకు లాస్ ఏంజిల్స్, లండన్లు నందనవనమూ ఆయనే అంటూ పాడుకుంటుందీ జంట. తాజాగా లాస్ ఏంజిల్స్ వెళ్లారు. ఏ ట్రిప్‌కు వెళ్లినా ఈ ఇద్దరూ దిగిన ఫొటోలను అభిమానుల కోసం విఘ్నేష్ తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారు. న్యూ ఇయర్‌ను కూడా ఈ జంట లాస్ ఏంజల్స్లోనే సెలబ్రేట్ చేసుకున్నారనే సంగతి తెలిసిందే. ఇలా కలసి హాలిడేయింగ్ చేసుకుంటూ, లవ్వింగ్ చేసుకుంటున్నా ‘మేం రిలేషన్’లో ఉన్నాం అని మాత్రం బాహాటంగా ఎప్పుడూ అంగీకరించలేదు. చెప్పినా చెప్పకపోయినా పెళ్లి ఎప్పుడో చెప్పండి అని తమిళ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
పైవేవీ కాదు
చూజ్ ది కరెక్ట్ ఆన్సర్స్‌లో.. సరైన ఆన్సర్ ఇవ్వకుండా ఒక్కోసారి ‘పైవేవీ కాదు’ అని ఇస్తుంటారు. సరైన సమాధానం లేనప్పుడు మనం దానికే టిక్ పెడతాం. అన్నదమ్ముల్లా అన్యోన్యంగా కనిపిస్తారట. లేదు.. లేదు బాక్సింగ్స్ రింగ్‌లో బరిలోకి దిగుతారట. అసలివేంకాదు రాజమౌళి ఫేవరెట్ సబ్జెక్ట్.. ‘పునర్జన్మల కాన్సెప్ట్’లో సినిమా ఉంటుందట. ఇలా రోజూ ఏదో ఓ వార్తను గాసిప్‌రాయుళ్లు స్టోరీగా అల్లేస్తున్నారు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సంబంధించినంత వరకూ ‘పైవేవీ కావు’ అనే సమాధానమే ప్రస్తుతానికి ఆప్షన్. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా డీవీవీ దానయ్య ఓ భారీ మల్టీస్టారర్ మూవీ నిర్మించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచి స్టోరీ లైన్ ఇదంటూ ఏదో గాసిప్ వినిపిస్తూనే ఉంది. కానీ ఈ సినిమాకు సంబంధించిన పూర్తి న్యారేషన్ ఇంకా ఎన్టీఆర్, చరణ్‌కు రాజమౌళి వినిపించలేదని సమాచారం. కేవలం లాస్ ఏంజెల్స్‌లో జరిగిన లుక్ టెస్ట్ మినహా సినిమాకు సంబంధించిన ఏ అప్డేట్ బయటకు రాలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాతో, చరణ్ బోయపాటి సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ హీరోలిద్దరూ తమ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి అక్టోబర్, నవంబర్ కల్లా రాజమౌళి సినిమా ప్రపంచంలోకి అడుగుపెడతారట. సినిమా బడ్జెట్ సుమారు 300 కోట్లుంటుందని సమాచారం. 2020 సమ్మర్‌కు రిలీజ్ అవుతుందట. స్టోరీ లైన్ ఏదైనా కానీ ఒకే విల్లుతో ఎన్టీఆర్, చరణ్ అనే రెండు బాణాలను బాక్సాఫీస్‌పై వదలనున్న రాజమౌళి విజన్ గురి తప్పదని ఊహిం^è వచ్చు. -
ప్రేమ యాత్రలు
విఘ్నేశ్ శివన్ – నయనతారలు ప్రేమలో మునిగి తేలుతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇద్దరికి వీలు కుదిరినప్పుడల్లా ప్రేమ యాత్రలకు విదేశాలు వెళ్తూ ఉంటారు. ఈసారి యూఎస్ టూర్‌కు వెళ్లారు. లాస్ ఎంజెల్స్ను చుట్టేస్తూ ఇద్దరు ఫొటోలు దిగారు. ‘‘క్వాలిటీ టైమ్ స్పెండ్ చేశాం. గ్రేట్ మొమొంట్స్ను, పాజిటివిటీను ఇచ్చినందుకు థ్యాంక్యూ యూఎస్ఏ. తప్పకుండా మళ్లీ వస్తాం’’ అని చెబుతూ ఈ ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు విఘ్నేశ్ శివన్. విఘ్నేష్ శివన్‌తో... నయనతార -
అమెరికాలో దుర్గమ్మకు పూజలు
ఏప్రిల్ 22 నుంచి మే 22వ తేదీ వరకు ఏర్పాట్లు చేస్తున్న ప్రవాస భారతీయులు నెల రోజులు శని, ఆదివారాల్లో కార్యక్రమాలు దుర్గగుడి అర్చకులకు ఆహ్వానం విజయవాడ : అమెరికాలో దుర్గమ్మ పూజలు నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది. ఈ మేరకు అమెరికాలోని ప్రవాస భారతీయులు అమ్మవారి పూజలు చేసేందుకు దుర్గగుడి అర్చకులకు ఆహ్వానం పలికారు. వారి కోరిక మేరకు దేవస్థానానికి చెందిన ప్రధాన అర్చకుడు లింగంభొట్ల దుర్గాప్రసాద్, అర్చకులు కోట ప్రసాద్, శంకరశాండిల్య, మారుతి యజ్ఞ నారాయణశర్మ, అమ్మవారి అలంకారం చేయడానికి పరిచార కుల శంకరమంచి ప్రసాద్, కె.గోపాలకృష్ణ తదితరులు ఏప్రిల్ 18న అమెరికా వెళ్లనున్నారు. 22 నుంచి నెలరోజుల పాటు పూజలు ఏప్రిల్ 22 నుంచి మే 22వ తేదీ వరకూ నెల రోజుల పాటు అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో దుర్గమ్మకు త్రిశతి, ఖడ్గమాల, లలితా సహస్రనామ పూజలు, రుద్రాభిషేకాలు, నవార్చనలు నిర్వహించనున్నారు. ప్రతి శని, ఆదివారాల్లో ఈ పూజలు జరుగుతాయి. దీనికోసం హరిద్వారలోని శ్రీస్వామి దయానంద సరస్వతి ఆశ్ర మం నుంచి పంచలోహాలతో చేసిన ప్రత్యేక శ్రీచక్రాన్ని తెప్పించారు. రోజూ కనీసం 300 నుంచి 500 మంది దంపతులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారని దేవస్థానం అర్చకులు అంచనా వేస్తున్నారు. ఈ పూజలు నిర్వహించినందుకు దేవస్థానానికి ప్రవాస భారతీయులు రూ.30లక్షలు ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. దీంతో పాటు దేవస్థానం సిబ్బందికి అయ్యే ఖర్చులూ వారే భరిస్తారు. లాస్ ఏంజిల్స్‌లో దుర్గమ్మ ఆలయం? అమెరికాలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి, అన్నవరం శ్రీసత్యనారాయణస్వామి దేవాలయాల తరహాలోనే శ్రీదుర్గామల్లేశ్వరస్వామి ఆలయాన్ని కూడా నిర్మించేందుకు ప్రవాస భారతీయులు ముందుకొచ్చారు. చెన్నూరు సుబ్బారావు, బొల్లా అశోక్ కుమార్, బుచ్చిరామ ప్రసాద్, అన్నవరపుకుమార్ తదితరులు పూజలకు కావాల్సిన ఏర్పాట్లు చేయడంతో పాటు లాస్ఏంజిల్స్ లేదా టెక్సాస్‌లో దేవాలయం నిర్మించేందుకు ముందుకు వచ్చారని ఆలయ అర్చకులు చెబుతున్నారు. ప్రస్తుతం పూజలు నిర్వహించడం వల్ల దేవాలయ నిర్మాణానికి మరింతమంది దాతలు ముందుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. -
అమెరికా ఖాకీల మరో దారుణం
అమెరికా ఖాకీల కర్కశత్వం మళ్లీ బయటపడింది. తమకు మానవత్వమే లేదని మరోసారి రుజువు చేసుకున్నారు. మొన్నటిమొన్న తన దారిన తాను పోతున్న ఓ భారతీయ వృద్ధుడిని రెక్కలు విరిచి నేలపై పడేసిన ఖాకీలు అంతకంటేమించిన దారుణానికి ఒడిగట్టారు. సొంతగూడు కూడా లేని ఓ ఆఫ్రికన్ వ్యక్తిని చుట్టు గుమిగూడిమరీ నడి రోడ్డుపై కాల్చి చంపేశారు. ఈ ఘటన సెంట్రల్ లాస్ ఎంజెల్స్‌లో మార్చి 1న జరుగగా ప్రస్తుతం ఆ వీడియో వివిధ సామాజిక సైట్లలో కనిపించి మానవత్వాన్ని తట్టిలేపుతోంది. అమెరికా పోలీసుల కావరానికి ఓ అమాయకుడు బలైపోయాడని మానవహక్కుల సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఎందుకలా చేస్తున్నారని చుట్టుపక్కలవారు అడిగినాకూడా వారిని బెదిరిస్తూ ఏం జరుగుతుందనేది మాత్రమే చూడండని, ప్రశ్నించొద్దంటూ వారిముందే ఆ ఆఫ్రికన్‌ను చంపేశారు. అతడి వివరాలు మాత్రం తెలియరాలేదు. ఆ ఆఫ్రికన్ మతిస్థిమితం కోల్పోయి బాధపడుతున్నాడని, పోలీసులు వచ్చే సమయానికి తన టెంటు కింద ఎవరితోనో గొడవ పడుతూ ఉన్నాడని చెప్పారు. దొంగతనం కేసును మోపి పోలీసులు ఈ దారుణానికి పాల్పడినట్లు చెప్పారు. మొత్తం ఐదుగురు పోలీసు అధికారులు ఈ కాల్పులు జరపగా వారిపై చర్యలు తీసుకునేందుకు పై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.