అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తాజాగా లాస్ ఏంజిల్స్ సిమివ్యాలీలో 5కే వాక్‌థాన్ నిర్వహించింది. లాస్ ఏంజిల్స్ నాట్స్ విభాగం నిర్వహించిన ఈ వాక్‌థాన్‌కు మంచి స్పందన లభించింది. పద్మవిభూషణ్ రతన్ టాటా స్మారకార్థం నిర్వహించిన ఈ వాక్‌థాన్‌కు 100 మందికి పైగా స్థానిక తెలుగువారు, భారతీయులు పాల్గొన్నారు. రతన్ టాటా సేవా వారసత్వాన్ని కొనసాగించడమే ఆయనకు మనం ఇచ్చే అసలైన నివాళి అని ఈ వాక్‌థాన్ ప్రారంభంలో నాట్స్ నాయకులు తెలిపారు.
రతన్ టాటా గొప్పతనాన్ని, ఆయన సేవా భావాన్ని ఈ సందర్భంగా నాట్స్ నాయకులు గుర్తు చేశారు. ఈ వాక్‌థాన్‌కు సహకరించిన నాట్స్ బోర్డు సెక్రటరీ మధు బోడపాటి, నాట్స్ ప్రోగ్రామ్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి, నేషనల్ కోఆర్డినేటర్లు కిషోర్ గరికిపాటి, రాజలక్ష్మి చిలుకూరి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్‌లకు నాట్స్ లాస్ ఏంజిల్స్ విభాగం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.
లాస్ ఏంజిల్స్ నాట్స్ చాప్టర్ కోఆర్డినేటర్ మురళీ ముద్దన, జాయింట్ కోఆర్డినేటర్ బిందు కామిశెట్టి, అధ్యక్షులు సిద్ధార్థ కోల, శ్రీనివాస్ మునగాల, రాధ తెలగం, అరుణ బోయినేని, గురు కొంక లతో పాటు సహాధ్యక్షులు పద్మజ గుడ్ల, సరోజా అల్లూరి, హరీష్ అందె, ముకుంద్ పరుచూరి తదితరుల సహకారంతో ఈ వాక్‌ధాన్ దిగ్విజయం అయింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
(చదవండి: టాంపలో నాట్స్ బోర్డ్ సమావేశం సంబరాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ)
Comments
Please login to add a commentAdd a comment