అమెరికా ఖాకీల మరో దారుణం | US police fatally shoot homeless man in Los Angeles | Sakshi
Sakshi News home page

అమెరికా ఖాకీల మరో దారుణం

Published Tue, Mar 3 2015 1:52 PM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM

US police fatally shoot homeless man in Los Angeles

అమెరికా ఖాకీల కర్కశత్వం మళ్లీ బయటపడింది. తమకు మానవత్వమే లేదని మరోసారి రుజువు చేసుకున్నారు. మొన్నటిమొన్న తన దారిన తాను పోతున్న ఓ భారతీయ వృద్ధుడిని రెక్కలు విరిచి నేలపై పడేసిన ఖాకీలు అంతకంటేమించిన దారుణానికి ఒడిగట్టారు. సొంతగూడు కూడా లేని ఓ ఆఫ్రికన్ వ్యక్తిని చుట్టు గుమిగూడిమరీ నడి రోడ్డుపై కాల్చి చంపేశారు. ఈ ఘటన సెంట్రల్ లాస్ ఎంజెల్స్లో మార్చి 1న జరుగగా ప్రస్తుతం ఆ వీడియో వివిధ సామాజిక సైట్లలో కనిపించి మానవత్వాన్ని తట్టిలేపుతోంది. అమెరికా పోలీసుల కావరానికి ఓ అమాయకుడు బలైపోయాడని మానవహక్కుల సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి.

ఎందుకలా చేస్తున్నారని చుట్టుపక్కలవారు అడిగినాకూడా వారిని బెదిరిస్తూ ఏం జరుగుతుందనేది మాత్రమే చూడండని, ప్రశ్నించొద్దంటూ వారిముందే ఆ ఆఫ్రికన్ను చంపేశారు. అతడి వివరాలు మాత్రం తెలియరాలేదు. ఆ ఆఫ్రికన్ మతిస్థిమితం కోల్పోయి బాధపడుతున్నాడని, పోలీసులు వచ్చే సమయానికి తన టెంటు కింద ఎవరితోనో గొడవ పడుతూ ఉన్నాడని చెప్పారు. దొంగతనం కేసును మోపి పోలీసులు ఈ దారుణానికి పాల్పడినట్లు చెప్పారు. మొత్తం ఐదుగురు పోలీసు అధికారులు ఈ కాల్పులు జరపగా వారిపై చర్యలు తీసుకునేందుకు పై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement