homeless man
-
మానవత్వం అంటే ఇదేనేమో
ఇతరులకు ఆపద సమయంలో మనకి చేతనైన సహాయాన్నిచేయడమే మానవత్వం. ప్రస్తుత ప్రపంచానికి పదం పెద్దగా పరిచయం ఉండక పోవచ్చేమో. ఎందుకంటే ఈ ఆన్లైన్ యుగంలో పక్కన వాళ్లనే పట్టించుకునే తీరిక లేకుండా గడుపుతుంటాం. కానీ ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి చేసిన పని చూస్తే మనుషుల్లో ఇంకా మిగిలే ఉందనిపిస్తుంది. ఫుట్ పాత్ మీద జీవనం సాగించే ఇతను పార్క్ వెలుపల రెండు వీధి కుక్కలు చలికి వణుకుతుండడం చూసి చలించి పోయాడు. వాటిని రోడ్డు పక్కనే ఉన్న తన బెడ్ మీద పడుకోపెట్టాడు. వాటి కోసం ఆహారం, నీరు ఓ ప్లాస్టిక్ గిన్నెలలో ఏర్పాటు చేశాడు. అంతే గాక ఆ కుక్కలకు కాపలాగా పక్కనే కూర్చున్నాడు. సహాయం చేయాలంటే కావాల్సింది ఇతరులకు సహాయపడాలనే గుణం మాత్రమే.. డబ్బు, మరేదో కాదని ఇతన్ని చూస్తే అర్థమౌతుంది. దీనికి సంబంధించిన ఫొటోను ఇండియన్ ఫారెస్ట్ అధికారి సుసంతా నందా ట్విటర్లో షేర్ చేశారు. ‘తక్కువ ఉన్నవారే ఎక్కువగా ఇస్తుంటారు’ అని ఆయన క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఈ పోస్ట్‌కు ఎమోష్నల్ గా కనెక్ట్ అయ్యారు.‘ నిజంగా అతనిది చాలా పెద్ద మనసు’ అని కొందరు, ‘అతను చాలా గ్రేట్’ అంటూ మరికొందరు కామెంట్లు చేశారు. ( చదవండి: రోడ్లపై చెత్త వేస్తున్నారా? సిగ్గు పడండి, కాకి వీడియో వైరల్ ) People those who have the least gives the mos💕 pic.twitter.com/6UqBNzpwxx — Susanta Nanda IFS (@susantananda3) March 30, 2021 -
జాబ్ కోసం రోడ్డెక్కి.. వైరల్
ఉండటానికి ఇళ్లు లేదు.. చేయటానికి పని లేదు. కానీ, అతని ప్రతిభే.. అతనికి ఓ దారి చూపింది. ఉద్యోగం కోసం రోడ్డెక్కిన అతను చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతే.. బడా కంపెనీలు సైతం స్పందించి అతనికి జాబ్ ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. కాలిఫోర్నియాలో జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్తే... సిలికాన్ వ్యాలీ: డేవిడ్ కసరెజ్(26) టెక్సాస్ ఏ అండ్ ఎమ్ యూనివర్సిటీ నుంచి మెనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నాడు. ఆస్టిన్(టెక్సాస్)లో ఓ మోటర్ కంపెనీలో వెబ్ డెవలపర్‌గా పని చేశాడు కూడా. అయితే కొత్త లైఫ్ కోసం కాలిఫోర్నియాకు వచ్చే క్రమంలో అతను తాను నివసించే వ్యాన్‌ను(సంచార జీవనం) పోగొట్టుకున్నాడు. దీంతో ఓ పార్క్ ఫుట్‌పాత్‌పై నివసిస్తూ ఉద్యోగ ప్రయత్నం చేయాలనుకున్నాడు. అయితే కొత్త ప్రాంతం కావటం.. పైగా డబ్బు తక్కువగానే ఉండటంతో మరో ఆలోచన చేశాడు. రెజ్యూమ్‌ను వందల సంఖ్యలో కాపీలు తీయించి టిప్ టాప్‌గా రెడీ అయి శుక్రవారం ‘మౌంటెన్ వ్యూవ్’లోని ఓ సిగ్నల్ వద్ద నిల్చున్నాడు. ‘ఇళ్లు లేదు. విజయం కోసం పరితపిస్తున్నా. దయచేసి నా రెజ్యూమ్ తీసుకోండి’ అంటూ ఓ ఫ్లకార్డు పట్టుకుని నిల్చున్నాడు. సిగ్నల్ వద్ద వాహనాల్లో ఉన్నవారికి రెజ్యూమ్ పంచుతూ పోయాడు. (రియాల్టీ షోలో ఊహించని ఘటన) మరోవైపు సోషల్ మీడియాలో కూడా అతగాడి గురించి స్టోరీలు తెగ వైరల్ అయ్యింది. ఏదైతేనేం మొత్తానికి ఆ ఐడియా వర్కవుట్ అయ్యింది. మంచి ప్రొఫైల్ కావటంతో గూగుల్, నెఫ్లిక్స్, లింక్డిన్, సహా దాదాపు 200 కంపెనీలు అతనికి ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఈ ఆనందంలో ఉబ్బితబ్బిబ్బి అవుతున్న కసరెజ్.. ఆలోచించుకుని మంచి కంపెనీలో జాయిన్ అవుతానని చెబుతున్నాడు. ‘డబ్బు సాయం చేస్తామని చాలా మంది ముందుకొచ్చారు. కానీ, నాకు కావాల్సింది ఉద్యోగమే. నేను తలెత్తుకుని జీవించాలనుకుంటున్నా. ఈ ప్రయత్నం విఫలమైతే తిరిగి నా తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోదామనకున్నా. కానీ, సక్సెస్ అయ్యా’ అని కసరెజ్ అంటున్నాడు. -
చేసిన సాయం ఊరికే పోదు!
చేసిన పాపం ఊరికే పోదంటారు. ఎప్పటికైనా ఉసురు తీస్తుందని చెబుతారు. పాపమే కాదు.. ఆపద సమయాల్లో సాయం చేసినా కూడా ఎప్పటికైనా ఆ సాయం మనల్ని ఆదుకుంటుందని మరోమారు రుజువైంది. ఎలాగో తెలియాలంటే ఇది చదవండి... సాక్షి, స్కూల్ ఎడిషన్: జేబు నిండా డబ్బున్నా అందులో నుంచి ఒక్కరూపాయి దానం చేయడం కోసం ఎంతగానో ఆలోచించేవారు మనలో చాలామందే ఉంటారు. అసలు దానం ఎందుకు చేయాలని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు. కానీ ఇటువంటివారికి పూర్తిగా విరుద్ధమైన స్వభావం కలిగిన వ్యక్తి జానీ బాబ్బిట్. ఓ యువతి సమస్యలో ఉందని తెలియగానే ఆమె సాయం అడగకపోయినా తన వద్ద ఉన్నదంతా ఆమెకు ఇచ్చేశాడు. అలాగని జానీ గొప్ప ధనవంతుడేమీ కాదు. ఇంకా చెప్పాలంటే నిలువ నీడలేని బికారి. అలాంటి వ్యక్తి తన దగ్గర ఉన్న 20 డాలర్లనూ ఓ యువతికి సాయం చేసేందుకు ఖర్చుచేసేశాడు. ఆ సాయమే ఇప్పుడు అతణ్ని ఆదుకుంది. ఓ ‘ఇంటి’వాడిని చేసింది. అసలేం జరిగిందంటే... కేట్ మెక్క్లురే అనే ఓ యువతి ఫిలడెల్ఫియాకు తన కారులో వేళ్తోంది. ఆమె చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. సరిగ్గా అప్పుడే కారులో ఇంధనం అయిపోయింది. దీంతో ఏంచేయాలో తోచక అటూఇటూ చూస్తోంది. ఆమె పరిస్థితిని గమనించిన జానీ తన జేబులో ఉన్న 20 డాలర్లతో గ్యాస్ సిలిండర్‌ను నింపుకొని తెచ్చిచ్చాడు. అడగకుండానే సాయం చేసిన జానీకి ఏదైనా మేలు చేయాలని భావించింది కేట్. ఇంటికెళ్లగానే జానీకి సాయంగా గోఫండ్‌మి పేరుతో ఆన్లైన్ క్యాంపెయిన్ మొదలుపెట్టింది. అతని దయనీయ స్థితిని వివరించింది. దీంతో స్పందించిన దాతలు ఏకంగా 2,52,000 డాలర్లను విరాళంగా ఇచ్చారు. ఈ సొమ్ముతో జానీకి ఇల్లు కొనిస్తానని, సుఖంగా బతికేందుకు మరిన్ని సదుపాయాలు సమకూరుస్తానని చెబుతోంది కేట్. నిజంగా గ్రేట్ కదూ..! -
చేసిన సాయం ఊరికే పోదు!
చేసిన పాపం ఊరికే పోదంటారు. ఎప్పటికైనా ఉసురు తీస్తుందని చెబుతారు. పాపమే కాదు.. ఆపద సమయాల్లో సాయం చేసినా కూడా ఎప్పటికైనా ఆ సాయం మనల్ని ఆదుకుంటుందని మరోమారు రుజువైంది. ఎలాగో తెలియాలంటే ఇది చదవండి... సాక్షి, స్కూల్ ఎడిషన్: జేబు నిండా డబ్బున్నా అందులో నుంచి ఒక్కరూపాయి దానం చేయడం కోసం ఎంతగానో ఆలోచించేవారు మనలో చాలామందే ఉంటారు. అసలు దానం ఎందుకు చేయాలని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు. కానీ ఇటువంటివారికి పూర్తిగా విరుద్ధమైన స్వభావం కలిగిన వ్యక్తి జానీ బాబ్బిట్. ఓ యువతి సమస్యలో ఉందని తెలియగానే ఆమె సాయం అడగకపోయినా తన వద్ద ఉన్నదంతా ఆమెకు ఇచ్చేశాడు. అలాగని జానీ గొప్ప ధనవంతుడేమీ కాదు. ఇంకా చెప్పాలంటే నిలువ నీడలేని బికారి. అలాంటి వ్యక్తి తన దగ్గర ఉన్న 20 డాలర్లనూ ఓ యువతికి సాయం చేసేందుకు ఖర్చుచేసేశాడు. ఆ సాయమే ఇప్పుడు అతణ్ని ఆదుకుంది. ఓ ‘ఇంటి’వాడిని చేసింది. అసలేం జరిగిందంటే... కేట్ మెక్క్లురే అనే ఓ యువతి ఫిలడెల్ఫియాకు తన కారులో వేళ్తోంది. ఆమె చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. సరిగ్గా అప్పుడే కారులో ఇంధనం అయిపోయింది. దీంతో ఏంచేయాలో తోచక అటూఇటూ చూస్తోంది. ఆమె పరిస్థితిని గమనించిన జానీ తన జేబులో ఉన్న 20 డాలర్లతో గ్యాస్ సిలిండర్‌ను నింపుకొని తెచ్చిచ్చాడు. అడగకుండానే సాయం చేసిన జానీకి ఏదైనా మేలు చేయాలని భావించింది కేట్. ఇంటికెళ్లగానే జానీకి సాయంగా గోఫండ్‌మి పేరుతో ఆన్లైన్ క్యాంపెయిన్ మొదలుపెట్టింది. అతని దయనీయ స్థితిని వివరించింది. దీంతో స్పందించిన దాతలు ఏకంగా 2,52,000 డాలర్లను విరాళంగా ఇచ్చారు. ఈ సొమ్ముతో జానీకి ఇల్లు కొనిస్తానని, సుఖంగా బతికేందుకు మరిన్ని సదుపాయాలు సమకూరుస్తానని చెబుతోంది కేట్. నిజంగా గ్రేట్ కదూ..! -
మంటగలిసిన మానవత్వం
చెన్నై : చెన్నైలో దారుణం చోటుచేసుకుంది. తినడానికి తిండి, ఉండడానికి ఇళ్లు కూడా లేని ఓ నిర్భాగ్యుడిపై నలుగురు యువకులు మద్యం మత్తులో తమ ప్రతాపం చూపించారు. ఇష్టానుసారంగా దాడి చేసి, అతని మర్మాంగానికి నిప్పుపెట్టారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. చెన్నైలోని రంగరాజపురంలో ఇండియన్ బ్యాంక్ ఎదుట జూన్ 4న అర్థరాత్రి జాఫర్(50) అనే నిరాశ్రయుడు పడుకున్నాడు. అదే సమయంలో పీకల్లోతు మద్యం సేవించిన నలుగురు వ్యక్తులు అటుగా వచ్చారు. వాళ్లు మద్యం మత్తులో సోయిమరిచి ఇష్టానుసారంగా జాఫర్‌పై దాడికి దిగారు. అతని మర్మాంగానికి నిప్పుపెట్టారు. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న మరో యువకుడు పైపుతో కూడా దాడి చేసి పైశాచికానందాన్ని పొందారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి వీడియో చక్కర్లు కొట్టడంతో ఈ సంఘటనలో జాఫర్‌పై దాడి చేసిన నలుగురు యువకులను పోలీసులు వీడియో ఆధారంగా అరెస్ట్ చేశారు. వీరిలో శ్యామ్, పుగాజెందీ, రాజేశ్‌లతో పాటూ మరో మైనర్ బాలుడు ఉన్నారు. జాఫర్‌పై దాడి చేసినట్టు ఈ నలుగురు యువకులు ఒప్పుకున్నట్టు సమాచారం. మద్యం మత్తులో ఉండటంతో ఏం చేస్తున్నామో తమకు తెలియలేదని పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే సంఘటన అనంతరం బాధితుడు జాఫర్ కనిపించకుండా పోయాడు. అత్యంత క్రూరంగా వ్యవహించిన నలుగురిపై కేసు నమోదు చేయడానికి బాధితుడు జాఫర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ఈ చిన్నారి కోట్ల హృదయాలు గెలుచుకుంది
-
ఈ చిన్నారి కోట్ల హృదయాలు గెలుచుకుంది
కాలిఫోర్నియా: పక్కవాడి కష్టాన్ని గుర్తించడం సాధరణంగా మంచి మనసున్నవారికే సాధ్యమవుతుంది. అలా గుర్తించగలిగేవారే నిజమైన మనుషులని అనిపించుకుంటారు కూడా. ఒక వేళ గుర్తించినా సహాయం చేయలేని పరిస్థితి ఉండే వారు కొందరైతే.. సహాయం చేసే పరిస్థితి ఉన్నప్పటికీ కష్టం గుర్తించి కూడా దూరంగా తొలిగిపోయేవారుంటారు. ఇలా చివరగా పేర్కొన్న వారి కళ్లు తెరుచుకునేందుకు ఈ సంఘటన చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలా కళ్లు తెరిపించేలా చేసింది కూడా పట్టుమని పదేళ్లు నిండని ఓ బాలిక. అది అమెరికాలోని కాలిఫోర్నియా.. తండ్రితో కలిసి 'ఎల్లా' అనే బాలిక ఓ రెస్టారెంటుకు వెళ్లింది. అందులో ఉన్నవారంతా ఏం చక్కా తమకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకొని లాగించేస్తున్నారు. అలాగే ఎల్లా తండ్రి ఎడ్డీ స్కాట్ కూడా వారిద్దరి కోసం ఓ స్పెషల్ ఫుడ్ ఆర్డరిచ్చాడు. అది రాగానే తినేద్దామనుకున్న ఎల్లా.. అలా కిటికీలో నుంచి బయటకు చూసింది. అప్పుడు రోడ్డు పక్కన ఫుట్ పాత్ పై ఓ నిలువ నీడలేని పెద్దాయన కూర్చుని కనిపించాడు. అతడు ఆకలితో ఉన్నాడని ఎలా గుర్తించిందో వెంటనే తండ్రికి తాను చేయబోయే పనిచెప్పి చక్కగా అతడివైపుగా నడిచి వెళ్లింది. తన కూతురు ఏం చేస్తుందా అని ఆసక్తితో వీడియో తీసుకుంటూ ఉన్నాడు. నేరుగా ఆ పాప వెళ్లి ఆ ముసలి తాతకు తాను తీసుకున్న ఆహారాన్ని అతడికి అందించింది. ఆ ఆహారం చూసి వణుకుతున్న చేతులతో ఆత్రుతగా తీసుకొని ఆ పసిదాని వైపు ఓ చల్లని చూపు చూస్తూ అతడు సంతోషంగా తినేశాడు. ఇదంతా వీడియో తీస్తున్న తన తండ్రి మనసు ఉప్పొంగింది. చిన్నవయసులోనే ఓ వ్యక్తి ఆకలి బాధను గుర్తించిన తన చిన్నారి ఎల్లాను మరింత ప్రేమగా దగ్గరకు తీసుకొని ఇలా చేయడం వల్ల ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది అంటూ ప్రశ్నించాడు. ఇలా చేయడమంటే నాకు చాలా ఇష్టం అంటూ బోసినవ్వులు నవ్వడంతో తండ్రి గుండెకు హత్తుకున్నాడు. ఆ వీడియోను ఫేస్ బుక్ లో ఈ నెల 1న షేర్ చేయగా ఇప్పటి వరకు నాలుగు కోట్లమంది(42 మిలియన్లు)కి పైగా వీక్షించారు. -
అమెరికా ఖాకీల మరో దారుణం
అమెరికా ఖాకీల కర్కశత్వం మళ్లీ బయటపడింది. తమకు మానవత్వమే లేదని మరోసారి రుజువు చేసుకున్నారు. మొన్నటిమొన్న తన దారిన తాను పోతున్న ఓ భారతీయ వృద్ధుడిని రెక్కలు విరిచి నేలపై పడేసిన ఖాకీలు అంతకంటేమించిన దారుణానికి ఒడిగట్టారు. సొంతగూడు కూడా లేని ఓ ఆఫ్రికన్ వ్యక్తిని చుట్టు గుమిగూడిమరీ నడి రోడ్డుపై కాల్చి చంపేశారు. ఈ ఘటన సెంట్రల్ లాస్ ఎంజెల్స్‌లో మార్చి 1న జరుగగా ప్రస్తుతం ఆ వీడియో వివిధ సామాజిక సైట్లలో కనిపించి మానవత్వాన్ని తట్టిలేపుతోంది. అమెరికా పోలీసుల కావరానికి ఓ అమాయకుడు బలైపోయాడని మానవహక్కుల సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఎందుకలా చేస్తున్నారని చుట్టుపక్కలవారు అడిగినాకూడా వారిని బెదిరిస్తూ ఏం జరుగుతుందనేది మాత్రమే చూడండని, ప్రశ్నించొద్దంటూ వారిముందే ఆ ఆఫ్రికన్‌ను చంపేశారు. అతడి వివరాలు మాత్రం తెలియరాలేదు. ఆ ఆఫ్రికన్ మతిస్థిమితం కోల్పోయి బాధపడుతున్నాడని, పోలీసులు వచ్చే సమయానికి తన టెంటు కింద ఎవరితోనో గొడవ పడుతూ ఉన్నాడని చెప్పారు. దొంగతనం కేసును మోపి పోలీసులు ఈ దారుణానికి పాల్పడినట్లు చెప్పారు. మొత్తం ఐదుగురు పోలీసు అధికారులు ఈ కాల్పులు జరపగా వారిపై చర్యలు తీసుకునేందుకు పై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.