
ముంబై : సోమవారం లాభాలతో ఆరంభమైన స్టాక్‌మార్కెట్లు ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో భారీ ఒడుదుడుకుల మధ్య సాగుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12,250 పాయింట్ల ఎగువన ట్రేడవుతోంది. యస్ బ్యాంక్, సెయిల్, ఎస్‌బీఐ, టాటా స్టీల్, ఇండియాబుల్స్ షేర్లు లాభపడుతుండగా, వొడాఫోన్, టాటా మోటార్స్, ఆర్‌ఐఎల్ షేర్లు నష్టపోతున్నాయి. మొత్తంమీద బీఎస్‌ఈ సెన్సెక్స్ 20 పాయింట్ల నష్టంతో 41,661 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 6 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 12,265 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment