
పలు రచనలు చేయడంతో పాటు, అనేక డాక్యుమెంటరీలు తీసిన కిరణ్మయి ఇంద్రగంటి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘రాళ్ళలో నీరు’. కృష్ణ మంజూష, అల్తాఫ్, షఫీ, బిందు చంద్రమౌళి, డా. ప్రసాద్ ముఖ్య పాత్రల్లో ఈ చిత్రాన్ని అనల్ప నిర్మించారు. ‘‘తెలుగులో ‘కన్యాశుల్కం’లా ఇంగ్లిషులో ‘ఏ డాల్స్ హౌస్’ ఫేమస్. 19వ శతాబ్దానికి చెందిన రచయిత హెన్రిక్ ఇబ్సన్ ఈ నాటకం రాశారు. చలం తరహాలో ప్రోగ్రెసివ్ థాట్స్ (ప్రగతిశీల ఆలోచనలు)తో ఉండే ఈ నాటకం థీమ్‌ని తీసుకుని వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా స్క్రిప్ట్ సిద్ధం చేశాను. ఇందులో ఐదు పాత్రలే ఉంటాయి. సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఇటీవలే లాస్‌ఏంజిల్స్‌లో ‘అవేర్నెస్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ప్రదర్శించగా మంచి స్పందన వచ్చింది’’ అన్నారు.