
అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ ఎన్నారై కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు చనిపోగా తీవ్రంగా గాయపడిన తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాద వివరాలు ఆలస్యంగా వెలుగు చూశాయి
జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం బండ్లగూడెం గ్రామానికి చెందిన చెట్టిపెల్లి రామచంద్రారెడ్డి 20 ఏళ్ల కిందట అమెరికాలో వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. ఆయనకి భార్య రజిత, పిల్లలు అక్షరారెడ్డి, ఆర్జిత్‌రెడ్డిలతో కుటుంబం లాస్‌ఏంజెలెస్‌లో నివాసం ఉంటున్నారు. డిసెంబరు 18వ తేదిన స్థానికంగా జరిగిన ఫ్యామిలీ గెట్ టూ గెదర్ పార్టీలో పాల్గొని తిరిగి ఇంటికి వస్తుండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ఘటనలో ఆర్జిత్‌రెడ్డి ఘటన స్థలిలోనే చనిపోగా అక్షరరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజలు తర్వాత చనిపోయారు. రామచంద్రారెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని సన్నిహితులు తెలిపారు.
ఆటలు, చదువులో ముందుండే ఆర్జిత్, అక్షరల మృతి పట్ల అమెరికన్ ఎన్నారైలు సంతాపం వ్యక్తం చేశారు. డిసెంబరు 25న స్థానికంగా ఉన్న తెలుగు వారు క్యాండిల్‌లైట్ విజిల్ కార్యక్రమం చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment