
విఘ్నేష్ శివన్, నయనతార
తీరక లేకుండా పని చెయ్.. ఆ తర్వాత తీరిగ్గా ప్రేమించెయ్ అనే పాలసీని ఫాలో అవుతుంటారు కోలీవుడ్ లవ్ కపుల్స్ విఘ్నేష్ శివన్, నయనతార. షూటింగ్స్‌తో నయనతార, కథలు తయారు చేస్తూ. డైరెక్షన్ చేస్తూ విఘ్నేష్ బిజీబిజీగా గడుపుతారు. ఏ కొంచెం విరామం దొరికినా సరే విదేశాలకు వెళ్లిపోతుంటారు. ప్రేమ యాత్రలకు లాస్ ఏంజిల్స్, లండన్లు నందనవనమూ ఆయనే అంటూ పాడుకుంటుందీ జంట. తాజాగా లాస్ ఏంజిల్స్ వెళ్లారు.
ఏ ట్రిప్‌కు వెళ్లినా ఈ ఇద్దరూ దిగిన ఫొటోలను అభిమానుల కోసం విఘ్నేష్ తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారు. న్యూ ఇయర్‌ను కూడా ఈ జంట లాస్ ఏంజల్స్‌లోనే సెలబ్రేట్ చేసుకున్నారనే సంగతి తెలిసిందే. ఇలా కలసి హాలిడేయింగ్ చేసుకుంటూ, లవ్వింగ్ చేసుకుంటున్నా ‘మేం రిలేషన్’లో ఉన్నాం అని మాత్రం బాహాటంగా ఎప్పుడూ అంగీకరించలేదు. చెప్పినా చెప్పకపోయినా పెళ్లి ఎప్పుడో చెప్పండి అని తమిళ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment