Ashu Reddy Surprises Her Mother With Car Gift On Her Birthday - Sakshi
Sakshi News home page

Ashu Reddy : తల్లిని సర్‌ప్రైజ్‌ చేసిన అషూరెడ్డి.. ఆనందంతో ఎమోషనల్‌

Apr 2 2023 11:10 AM | Updated on Apr 2 2023 12:14 PM

Ashu Reddy Surprises Her Mother With Car Gift On Her Birthday - Sakshi

బోల్డ్‌ బ్యూటీ అషూరెడ్డి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. టిక్‌టాక్‌ వీడియోలతో జూనియర్‌ సమంతలా పేరు తెచ్చుకున్న అషూ బిగ్‌బాస్‌ షోతో మరింత గుర్తింపు పొందింది. సోషల్‌ మీడియాలో బోల్డ్‌ ఫోటోషూట్స్‌తో వార్తల్లో నిలిచే అషూ ఆర్జీవీ ఇంటర్వ్యూతో ఒక్కసారిగా స్టార్‌ డమ్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఆమె ఫాలోయింగ్‌ అమాంతం పెరిగింది.

ఇక నెట్టింట గ్లామర్‌ షో చేయడంలో ముందుండే అషూరెడ్డి ఇన్‌స్టా యూజర్లతో ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను నెటిజన్లతో షేర్‌ చేసుకుంటుంది. తాజాగా తన తల్లి బర్త్‌డే సందర్భంగా అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేసింది. సరికొత్త సుజూకీ కారును ఆమె పుట్టినరోజు కానుకగా అందించింది.

కూతురి గిఫ్ట్‌ చూసి సంతోషంలో అషూ తల్లి ఎమోషనల్‌ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియోను అషూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా.. మంచి సర్‌ప్రైజ్‌ ఇచ్చావంటూ నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement