
న్యూపోర్ట్: అంతర్జాతీయ టెన్నిస్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో రష్యా స్టార్ మరియా షరపోవా... మేటి డబుల్స్ జోడీ బ్రయాన్ బ్రదర్స్ బాబ్, మైక్‌లకు చోటు లభించింది. బ్యాలెట్ సెలెక్షన్స్ ఓటింగ్ ద్వారా ఈ ముగ్గురిని ఎంపిక చేశారు. ఐదు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించిన షరపోవా 2020లో టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పింది.
షరపోవా ఆ్రస్టేలియన్ ఓపెన్ (2008), వింబుల్డన్ (2004), యూఎస్ ఓపెన్ (2006) గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను ఒక్కోసారి నెగ్గగా... ఫ్రెంచ్ ఓపెన్‌ను (2012, 2014) రెండుసార్లు సొంతం చేసుకొని ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ ఘనత సాధించింది. కవల సోదరులైన బాబ్, మైక్ బ్రయాన్‌లు అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో 438 వారాలు నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచారు.
అంతేకాకుండా 16 గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్‌ను దక్కించుకున్నారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం నెగ్గడంతోపాటు 2007లో అమెరికా జట్టు డేవిస్ కప్ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment