Bryan brothers
-
‘హాల్ ఆఫ్ ఫేమ్’లో షరపోవా, బ్రయాన్ బ్రదర్స్
న్యూపోర్ట్: అంతర్జాతీయ టెన్నిస్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో రష్యా స్టార్ మరియా షరపోవా... మేటి డబుల్స్ జోడీ బ్రయాన్ బ్రదర్స్ బాబ్, మైక్‌లకు చోటు లభించింది. బ్యాలెట్ సెలెక్షన్స్ ఓటింగ్ ద్వారా ఈ ముగ్గురిని ఎంపిక చేశారు. ఐదు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించిన షరపోవా 2020లో టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పింది. షరపోవా ఆ్రస్టేలియన్ ఓపెన్ (2008), వింబుల్డన్ (2004), యూఎస్ ఓపెన్ (2006) గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను ఒక్కోసారి నెగ్గగా... ఫ్రెంచ్ ఓపెన్‌ను (2012, 2014) రెండుసార్లు సొంతం చేసుకొని ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ ఘనత సాధించింది. కవల సోదరులైన బాబ్, మైక్ బ్రయాన్లు అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో 438 వారాలు నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచారు. అంతేకాకుండా 16 గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్‌ను దక్కించుకున్నారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం నెగ్గడంతోపాటు 2007లో అమెరికా జట్టు డేవిస్ కప్ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించారు. -
టెక్ మిలియనీర్ యాంటీ ఏజింగ్ జర్నీ..షాకింగ్ విషయాలు
-
టెన్నిస్‌కు ట్విన్ బ్రదర్స్ గుడ్‌బై
న్యూయార్క్: తమ రిటైర్మెంట్పై కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు అమెరికా టెన్నిస్ ‘ట్విన్ బ్రదర్స్’ బాబ్ బ్రయాన్–మైక్ బ్రయాన్ తెరదించారు. తాము టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు, ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని సామాజిక మాధ్యమం ద్వారా 42 ఏళ్ల బాబ్–మైక్ అధికారికంగా ప్రకటించారు. గత ఏడాది చివర్లో 2020 సీజన్ తమకు చివరిదని వీరు ప్రకటించారు. దాంతో స్వదేశంలో జరిగే గ్రాండ్‌స్లామ్ ఈవెంట్ యూఎస్ ఓపెన్‌లో ఘనంగా ఆటకు వీడ్కోలు పలుకుతారని అందరూ భావించినా... వారం క్రితం ప్రకటించిన యూఎస్ ఓపెన్ ప్రధాన ‘డ్రా’లో వీరి పేర్లు లేకపోవడంతో ఈ ఇద్దరి రిటైర్మెంట్పై ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా వీటిపై స్పష్టత ఇస్తూ ఇరువురు కూడా ఒకేసారి టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పారు. అచ్చుగుద్దినట్లు ఉండే ఈ అమెరికా కవల జంటలో ఎవరు మైక్ (మైకేల్ కార్ల్ బ్రయాన్), ఎవరు బాబ్ (రాబర్ట్ చార్లెస్ బ్రయాన్) అని తేల్చుకోవడం చాలా కష్టం. కవల పిల్లలైన వీరిలో మైక్... బాబ్ కంటే రెండు నిమిషాలు పెద్దవాడు. 1995లో తొలిసారి యూఎస్ ఓపెన్‌లో జంటగా బరిలో దిగిన వీరు... ఇక వెనుతిరిగి చూడలేదు. 2003లో ఫ్రెంచ్ ఓపెన్ విజయంతో తొలిసారి కెరీర్లో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెల్చుకున్న వీరు... అనంతరం జంటగా వీరు 16 గ్రాండ్ స్లామ్ టైటిల్స్‌ను కొల్లగొట్టారు. (చదవండి: స్వితోలినా కూడా తప్పుకుంది) 2008 ఒలింపిక్స్‌లో కాంస్యంతో సరిపెట్టుకున్న ఈ జంట... 2012 లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణాన్ని సాధించింది. 26 ఏళ్ల వీరి కెరీర్లో 2013వ సంవత్సరం మరపురానిది. ఆ ఏడాది ఈ జంట నాలుగు గ్రాండ్‌స్లామ్స్‌లో మూడింటిని (యూఎస్ ఓపెన్ మినహా)ను గెలవడంతో పాటు, 5 ఏటీపీ మాస్టర్స్ టైటిల్స్‌ను సాధించింది. ఇక టూర్ లెవల్ ఫైనల్స్‌లో 11–4 గెలుపోటముల రికార్డును నమోదు చేసింది. వీరి రిటైర్మెంట్పై భారత మాజీ డబుల్స్ ఆటగాడు మహేష్ భూపతి స్పందించాడు. ‘అద్భుతమై కెరీర్‌కు వీడ్కోలు పలికిన సోదరులకు నా అభినందనలు’ అంటూ ట్వీట్ చేశాడు. (చదవండి: ‘టెస్టు మ్యాచ్‌లు ఆడటం ఇక అనుమానమే’) -
‘హలో బ్రదర్’ శకం ముగిసింది!
నువ్వు ఆ వైపునుంచి చూసుకో...నేను ఈ వైపునుంచి చూసుకుంటా... సరిగ్గా ఇదే కాకపోయినా ఇలాంటి భావం, భాషతోనే వారిద్దరు ప్రత్యర్థుల పని పట్టారు. ఆటలో అన్నదమ్ములు ఎలా ఉండాలంటే అచ్చం ‘బ్రియాన్ బ్రదర్స్’లా ఉండాలి. అద్దంలో ప్రతిబింబాల్లాంటి వీరిద్దరు కలిసి టెన్నిస్‌లో అద్భుతాలు చేశారు. విడిగా ఒక్కొక్కరి పేరుతో వీరాభిమానులు కూడా వారిని గుర్తు పెట్టుకోలేరు. ‘బ్రదర్స్’ అనే సర్వనామంతోనే వీరికి గుర్తింపు వచ్చింది. ఇందులో ఒకరు లేకుండా మరొకరి అస్తిత్వం లేదంటే అతిశయోక్తి కాదు. ఎడమ చేతి, కుడి చేతి వాటం కలయిక, అత్యద్భుత సమన్వయంతో టెన్నిస్ కోర్టులో సంచలనాలు సృష్టించిన బ్రియాన్ జోడి ఇకపై ఆట ముగించనుంది. సొంతగడ్డపై జరిగే యూఎస్ ఓపెన్‌నుంచి వీరు తప్పుకోవడంతో ఈ ‘హలో బ్రదర్’ శకం ముగిసినట్లయింది. –సాక్షి క్రీడా విభాగం ఒకటి కాదు, రెండు కాదు పురుషుల డబుల్స్‌లో ఏకంగా 16 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను జోడిగా ‘బ్రియాన్ బ్రదర్స్’ గెలుచుకున్నారు. గ్రాస్, హార్డ్, క్లే... కోర్టు ఏదైనా వారికి లెక్క లేదు. అన్ని సర్ఫేస్‌లపై వారిద్దరి హవా సుదీర్ఘ కాలం కొనసాగింది. అంకెలపరంగా చూస్తే రెండు నిమిషాలు పెద్దవాడైన మైకేల్ కార్ల్ బ్రియాన్ (మైక్)... తమ్ముడు రాబర్ట్ చార్లెస్ బ్రియాన్ (బాబ్) కంటే మరో రెండు పురుషులు గ్రాండ్‌స్లామ్‌లు ఎక్కువగా గెలిచాడు. అయితే మిక్స్డ్ విభాగంలో అన్న (4)తో పోలిస్తే ఎక్కువ టైటిల్స్ సాదించిన బాబ్ (7) ఓవరాల్‌గా ఒక మెట్టు పైన ఉండటం విశేషం. 1995లో తొలి సారి యూఎస్ ఓపెన్‌తో జంటగా బరిలోకి దిగిన ఈ సోదరుల విజయ ప్రస్థానం 2003లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ విజయంతో కీలక మలుపు తీసుకొని జంటగా 16 గ్రాండ్‌స్లామ్ సాధించే వరకు సాగింది. గాయం కారణంగా బాబ్ కొంత కాలం ఆటకు దూరం కావడంతో జాక్ సాక్‌తో కలిసి బరిలోకి దిగిన మైక్ మరో రెండు గ్రాండ్‌స్లామ్‌లను గెలుచుకున్నాడు. 2020 సీజన్ తమకు చివరిది కానుందని 42 ఏళ్ల బ్రియాన్ బ్రదర్స్ గత ఏడాది చివర్లోనే ప్రకటించారు. యూఎస్ ఓపెన్ చివరి సారిగా ఆడతామని వారు గత నెలలోనే చెప్పారు. అయితే ఈ టోర్నీలో బరిలోకి దిగుతున్నవారి జాబితాను గురువారం నిర్వాహకులు ప్రకటించగా...అందులో అనూహ్యంగా వీరిద్దరు పేరు లేదు. దాంతో రిటైర్ కావాలని నిర్ణయించుకున్నట్లు అర్థమైంది. చరిత్రలో పలు ఘనతలు లిఖించుకున్న ఈ సోదరుల రికార్డులు, విశేషాలు కొన్ని చూస్తే... ‘బ్రియాన్ బ్రదర్స్’ సాధించిన విజయాలు గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్: 18 (6 ఆస్ట్రేలియన్ ఓపెన్, 2 ఫ్రెంచ్ ఓపెన్, 3 వింబుల్డన్, 5 యూఎస్ ఓపెన్) ఏటీపీ మాస్టర్స్ టైటిల్స్: 39 వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్స్: 4 ఒలింపిక్ విజయాలు: 1 స్వర్ణం (2012), 1 కాంస్యం (2008) డేవిస్ కప్ టైటిల్: 1 (2007) వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచిన సమయం: 438 వారాలు (ఇందులో వరుసగా 139 వారాలు) మొత్తం డబుల్స్ టైటిల్స్: 119 ప్రతీ గ్రాండ్‌స్లామ్‌ను కనీసం 2 సార్లు గెలిచి ‘డబుల్ కెరీర్ గ్రాండ్‌స్లామ్’ సాధించిన ఏౖకైక జంట -
రియో ఒలింపిక్స్‌కు బ్రయాన్ బ్రదర్స్ దూరం
రియో డి జనీరో: రియో ఒలింపిక్స్‌లో తాము పాల్గొనడంలేదని అమెరికా టెన్నిస్ డబుల్స్ దిగ్గజ ద్వయం మైక్ బ్రయాన్-బాబ్ బ్రయాన్ ప్రకటిం చింది. ఈ కవల సోదురుల జోడీ 2012 లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణం, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గింది. ప్రస్తుతం తాము ఆటకంటే కుటుంబ బాధ్యతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని, అందుకే ఒలింపిక్స్‌కు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్లు బ్రయాన్ బ్రదర్స్ తెలిపారు. -
'మేము కూడా రియోకు రాలేం'
న్యూయార్క్:ఇటీవల బ్రెజిల్లో వెలుగు చూసిన జికా వైరస్ కారణంగా పలువురు అగ్రశ్రేణ క్రీడాకారులు ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి వెనుకడుగు వేస్తున్నారు. పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యుత్తమ డబుల్స్ జోడీ గా పేరుగాంచిన బ్రయాన్ బ్రదర్స్ రియో నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అక్కడ ప్రబలిని ప్రాణాంతక జికా వైరస్ కారణంగా ఆ మెగా టోర్నీకి దూరమవుతున్నట్లు బ్రయాన్ జంట స్పష్టం చేసింది. 'మేము రియో ఒలింపిక్స్ నుంచి తప్పుకుంటున్నాం. జికా వైరస్‌తో ఎటువంటి రిస్క్ చేయదలుచుకోలేదు. కుటుంబ సభ్యుల ఆరోగ్యమే మా తొలి ప్రధాన్యత' అని ఈ జోడి స్పష్టం చేసింది. ఈ మేరకు రియో ఒలింపిక్స్ విషయాన్ని తమ ఫేస్ బుక్ అకౌంట్లో బ్రయాన్ ద్వయం పోస్ట్ చేసింది. ఇప్పటివరకూ ఈ అమెరికా జోడి 112 టైటిల్స్ తమ ఖాతాలో వేసుకోగా, 16 గ్రాండ్ స్లామ్‌లను సొంతం చేసుకుంది. గత లండన్ ఒలింపిక్స్ లో స్వర్ణ పతకాన్ని గెలిచి సత్తా చాటింది. జికా వైరస్ భయంతో ఇప్పటికే కొంతమంది టాప్ అథ్లెట్లు రియోకు గుడ్ బై చెప్పారు. వింబుల్డన్ రన్నరప్ రానిచ్, 2014 ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ హాలెప్లతో పాటు, చెక్ రిపబ్లిక్కు చెందిన వరల్డ్ ఎనిమిదో ర్యాంక్ టెన్నిస్ ఆటగాడు టామస్ బెర్డిచ్, అదే దేశానికి చెందిన కరోలినా ప్లిస్కోవాలు రియో నుంచి వైదొలిగారు. -
బ్రయాన్ సోదరులకు షాకిచ్చిన బోపన్న జోడీ
లండన్ : మూడు సార్లు ఛాంపియన్లు బ్రయాన్ సోదరులకు, రోహన్ బోపన్న జోడీ షాకిచ్చి వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ సెమీస్‌కు దూసుకెళ్లింది. మూడుసార్లు వింబుల్డన్ ఛాంపియన్లయిన బ్రయాన్ బ్రదర్స్ ద్వయాన్ని ప్రీక్వార్టర్స్ లోనే ఇంటిదారి పట్టించారు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో తొమ్మిదో సీడ్ ఆటగాళ్లు రోహన్ బోపన్న (భారత్), ఫ్లోరిన్ మెర్గియా (రొమేనియా) ద్వయం 5-7, 6-4, 7-6(9), 7-6(5) తేడాతో బాబ్ బ్రయాన్, మైక్ బ్రయాన్ (అమెరికా) సోదరులను మట్టికరిపించింది. సుమారు రెండు గంటల 34 నిమిషాల పాటు జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో ఇండో- రొమేనియా జోడీనే విజయం వరించింది. బోపన్న జోడీ మొత్తం 31 విన్నర్ షాట్లు ఆడగా, ఇందులో 17 ఏస్ లు సంధించడం విశేషం. సెమీస్ లో నాలుగో సీడ్ జీన్ - జులియన్ రోజర్, హోరియా టెక్యూ జోడీతో తలపడనున్నారు.