బ్రయాన్ సోదరులకు షాకిచ్చిన బోపన్న జోడీ | Bopanna-Mergea beats Bryan brothers in Wimbledon quarterfinals | Sakshi
Sakshi News home page

బ్రయాన్ సోదరులకు షాకిచ్చిన బోపన్న జోడీ

Published Wed, Jul 8 2015 1:15 PM | Last Updated on Sun, Sep 3 2017 5:08 AM

బ్రయాన్ సోదరులకు షాకిచ్చిన బోపన్న జోడీ

బ్రయాన్ సోదరులకు షాకిచ్చిన బోపన్న జోడీ

లండన్ : మూడు సార్లు ఛాంపియన్లు బ్రయాన్ సోదరులకు, రోహన్ బోపన్న జోడీ షాకిచ్చి వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ సెమీస్కు దూసుకెళ్లింది. మూడుసార్లు వింబుల్డన్ ఛాంపియన్లయిన బ్రయాన్ బ్రదర్స్ ద్వయాన్ని ప్రీక్వార్టర్స్ లోనే ఇంటిదారి పట్టించారు.  క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో తొమ్మిదో సీడ్ ఆటగాళ్లు రోహన్ బోపన్న (భారత్), ఫ్లోరిన్ మెర్గియా (రొమేనియా) ద్వయం 5-7, 6-4, 7-6(9), 7-6(5) తేడాతో బాబ్ బ్రయాన్, మైక్ బ్రయాన్ (అమెరికా) సోదరులను మట్టికరిపించింది.

సుమారు రెండు గంటల 34 నిమిషాల పాటు జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో ఇండో- రొమేనియా జోడీనే విజయం వరించింది. బోపన్న జోడీ మొత్తం 31 విన్నర్ షాట్లు ఆడగా, ఇందులో 17 ఏస్ లు సంధించడం విశేషం. సెమీస్ లో నాలుగో సీడ్ జీన్ - జులియన్ రోజర్, హోరియా టెక్యూ జోడీతో తలపడనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement