కోడలికి మళ్లీ పెళ్లి.. మామ గిఫ్ట్ వందకోట్లు! | bjp mp gives 100 crores for daughte in law's remarriage | Sakshi
Sakshi News home page

కోడలికి మళ్లీ పెళ్లి.. మామ గిఫ్ట్ వందకోట్లు!

Published Sat, Sep 27 2014 7:40 AM | Last Updated on Fri, Mar 29 2019 8:30 PM

కోడలికి మళ్లీ పెళ్లి.. మామ గిఫ్ట్ వందకోట్లు! - Sakshi

కోడలికి మళ్లీ పెళ్లి.. మామ గిఫ్ట్ వందకోట్లు!

కోడళ్లను రాచి రంపాన పెట్టే అత్తమామలను చూశాం. పెళ్లయిన తర్వాత కొడుకు ఏదైనా కారణంతో మరణిస్తే.. అందుకు కోడలిదే తప్పంటూ మెడపట్టి బయటకు గెంటేసేవాళ్లను కూడా చూశాం. అయితే.. కొడుకు మరణించిన తర్వాత కోడలికి మళ్లీ పెళ్లి చేయించడానికి భారీగా కట్నకానుకలు ఇచ్చే అత్తమామలు ఎక్కడైనా ఉంటారా? ఉన్నారు.. గుజరాత్లోని పోర్బందర్ ఎంపీ విఠల్ రాడాడియా  ఇలా చేశారు. తన కోడలికి ఆయన బహుమతిగా ఇచ్చిన ఆస్తి విలువ అక్షరాలా వంద కోట్ల రూపాయలు!!

బీజేపీ తరఫున ఎంపీగా ఎన్నికైన రాడాడియా.. పోర్బందర్ ప్రాంతంలోని రైతు నాయకుడు. ఆయన కుమారుడు కల్పేష్ రాడాడియా ఏడు నెలల క్రితం గుండె పోటుతో మరణించారు. ఆయనకు మనీషా అనే భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు మరణించిన దుఃఖాన్ని దిగమింగుకున్న విఠల్ రాడాడియా.. అప్పటినుంచే తన కోడలికి మళ్లీ పెళ్లి చేసి కొత్త జీవితాన్ని అందించాలని భావించారు.

అప్పటినుంచి ప్రయత్నించి.. చివరకు తన మరో కొడుకు లలిత్ స్నేహితుడైన హర్దిక్ చోవాటియాతో మనీషా పెళ్లి నిశ్చయించారు. రాజ్కోట్ జిల్లాలోని జామ్కండోర్నా పట్టణంలో ఈ పెళ్లి జరిగింది. ఈ పెళ్లి కోసం కోడలికి వంద కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తిని విఠల్ రాడాడియా ఇచ్చారు. ఆయన మరో కుమారుడు జయేష్ రాడాడియా జేఠ్పూర్ నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, ప్రస్తుతం గుజరాత్ ప్రభుత్వంలో పర్యాటక శాఖ సహాయమంత్రిగా పనిచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement