ఇమ్రాన్ ఖాన్ కు చేదుఅనుభవం
పెషావర్: కొత్తగా పెళ్లాడిన పాకిస్థాన్ ప్రతిపక్ష నాయకుడు ఇమ్రాన్ ఖాన్ కు పెషావర్ లో చేదు అనుభవం ఎదురైంది. ఉగ్రవాదుల దాడికి గురైన పెషావర్ సైనిక పాఠశాలను సతీసమేతంగా సందర్శించేందుకు వచ్చిన ఆయనను విద్యార్థుల తల్లిదండ్రులు అడ్డుకున్నారు. దాడిని రాజకీయం చేయడానికి వచ్చారంటూ మండిపడ్డారు. పెళ్లి వేడుకల్లో మునిగి తేలి తీరిగ్గా ఇప్పుడు వస్తారా అంటూ విరుచుకుపడ్డారు.
ఆర్మీ స్కూల్ విద్యార్థులను కలుకుసుకునేందుకు తన బార్య రెహామ్ ఖాన్ కలసి బుధవారమిక్కడకు వచ్చినప్పుడు ఆయనకు ఈ చేదు అనుభవం ఎదురైంది. పెషావర్ ఆర్మీ స్కూల్ పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 134 మంది విద్యార్థులతో సహా 150 మంది మృతి చెందారు. దాడి జరిగిన కొన్ని వారాల తర్వాత సోమవారం ఈ పాఠశాల తిరిగి ప్రారంభమైంది.