peshawar school
-
'కొంతమందిని చంపేశాం.. మరి కొందరు అరెస్ట్'
ఇస్లామాబాద్: పెషావర్ ఆర్మీ స్కూల్లో నరమేధానికి వ్యూహారచన చేసి ... అమలు చేసిన తీవ్రవాదుల్లో చాలా మందిని అరెస్ట్ చేసినట్లు పాక్ ఆర్మీ ఉన్నతాధికారి అసిమ్ బాజ్వా గురువారం వెల్లడించారు. ఈ నరమేధంలో పాల్గొన్న 9 మంది తీవ్రవాదులు ఇప్పటికే సైన్యం చేతిలో చనిపోయారని తెలిపారు. అలాగే పాక్, ఆఫ్ఘానిస్థాన్‌లకు చెందిన 12 మంది తీవ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. సదరు తీవ్రవాదులను అప్పగించాలని ఇప్పటికే ఆఫ్ఘానిస్థాన్‌ను కోరినట్లు తెలిపారు. ఈ దారుణ మారణ కాండకు వ్యూహారచన చేసిన తేహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్థాన్ చీఫ్ ముల్లా ఫజుల్లాతోపాటు మరో తీవ్రవాది ఉమర్ అమీర్లను సాధ్యమైనంత త్వరలో పట్టుకుంటామని ఉన్నతాధికారి బాజ్వా ఆశాభావం వ్యక్తం చేశారు. గతేడాది డిసెంబర్ 16న పాకిస్థాన్ పెషావర్‌లోని ఆర్మీ స్కూల్‌పై తీవ్రవాదులు విరుచుకు పడి... విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. తీవ్రవాదుల ఘాతుకంలో మొత్తం 150 మంది మరణించారు. మృతుల్లో 140 మంది విద్యార్థులు ఉన్న సంగతి తెలిసిందే. పెషావర్ స్కూల్‌పై దాడికి తీవ్రవాదులు పాక్ - ఆఫ్ఘానిస్థాన్ సరిహద్దుల్లో వ్యూహారచన చేసినట్లు పాక్ అధికారులు గుర్తించారు. ఆ దిశగా ప్రభుత్వం దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ ఘటనకు సూత్రధారులు తేహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్థాన్ చీఫ్ ముల్లా ఫజుల్లాతోపాటు మరో తీవ్రవాది ఉమర్ అమీర్‌గా పాక్ దర్యాప్తులో తేలింది. -
ఇమ్రాన్ ఖాన్ కు చేదుఅనుభవం
పెషావర్: కొత్తగా పెళ్లాడిన పాకిస్థాన్ ప్రతిపక్ష నాయకుడు ఇమ్రాన్ ఖాన్ కు పెషావర్ లో చేదు అనుభవం ఎదురైంది. ఉగ్రవాదుల దాడికి గురైన పెషావర్ సైనిక పాఠశాలను సతీసమేతంగా సందర్శించేందుకు వచ్చిన ఆయనను విద్యార్థుల తల్లిదండ్రులు అడ్డుకున్నారు. దాడిని రాజకీయం చేయడానికి వచ్చారంటూ మండిపడ్డారు. పెళ్లి వేడుకల్లో మునిగి తేలి తీరిగ్గా ఇప్పుడు వస్తారా అంటూ విరుచుకుపడ్డారు. ఆర్మీ స్కూల్ విద్యార్థులను కలుకుసుకునేందుకు తన బార్య రెహామ్ ఖాన్ కలసి బుధవారమిక్కడకు వచ్చినప్పుడు ఆయనకు ఈ చేదు అనుభవం ఎదురైంది. పెషావర్ ఆర్మీ స్కూల్ పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 134 మంది విద్యార్థులతో సహా 150 మంది మృతి చెందారు. దాడి జరిగిన కొన్ని వారాల తర్వాత సోమవారం ఈ పాఠశాల తిరిగి ప్రారంభమైంది. -
రక్తమోడిన పెషావర్ స్కూల్ మళ్లీ ప్రారంభం
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో తాలిబన్ ఉగ్రవాది దాడిలో నెత్తురోడిన పెషావర్ సైనిక పాఠశాల సోమవారం మళ్లీ ప్రారంభమైంది. కొన్ని వారాల తర్వాత విద్యార్థులు, టీచర్లు చేదు జ్ఞాపకాలతో ఈ రోజు పాఠశాలకు వచ్చారు. ఉగ్రవాదులు పెషావర్ సైనిక పాఠశాల మీద విరుచుకుపడి 132 మంది బాలలు సహా మొత్తం 140 మందిని మట్టుబెట్టడం ప్రపంచాన్ని కలచివేసిన సంగతి తెలిసిందే. ఉగ్రవాది దాడిలో రక్తపుమడుగుల్లా మారిన తరగతి గదులను పూర్తిగా శుభ్రం చేశారు. అలాగే పాఠశాలలో ధ్వంసమైన ప్రాంతాల్లో మరమ్మత్తులు చేపట్టారు. ఈ దాడి అనంతరం పాకిస్థాన్‌లో భద్రత కారణాల రీత్యా విద్యాసంస్థలను మూసివేసి సెలవులు ప్రకటించారు. ఇప్పుడిప్పుడే మళ్లీ ప్రారంభమవుతున్నాయి. విద్యా సంస్థల వద్ద సాయుధులైన భద్రత సిబ్బందిని మోహరించారు. -
నాయకుల పిల్లలను చంపేస్తాం!
పెషావర్‌లో స్కూలుపిల్లలను దారుణంగా హతమార్చిన తర్వాత.. ఇక తమ తదుపరి లక్ష్యం రాజకీయ నాయకుల పిల్లలేనని పాకిస్థాన్ తాలిబన్లు ప్రకటించారు. వాళ్లలో ప్రధాని నవాజ్ షరీఫ్ పిల్లలు కూడా ఉంటారని హెచ్చరించారు. ఈ విషయమై తెహరీక్ ఎ తాలిబన్ పాకిస్థాన్ టాప్ కమాండర్ అని భావిస్తున్న మహ్మద్ ఖరసానీ నుంచి పాక్ ప్రభుత్వంలోని ఉన్నతాధికారులకు ఓ లేఖ అందింది. ప్రధాని నవాజ్ షరీఫ్ కుటుంబ సభ్యులు సహా పలువురు నాయకుల పిల్లలను తాము చంపేస్తామని అందులో పేర్కొన్నారు. ఉగ్రవాదులను ఉరి తీయాలని పాక్ ప్రభుత్వం, సైన్యం నిర్ణయించడంతో దాన్ని అడ్డుకోడానికి ఇలాంటి హెచ్చరికలు చేస్తున్నట్లు పాక్ నిఘావర్గాలు భావిస్తున్నాయి. అయితే అసలు ఆ లేఖ నిజమైనదా.. కాదా అనే విషయాన్ని పరిశీలించడంలో పాక్ ఉన్నతాధికారులు తలమునకలయ్యారు. పిల్లలు కూడా తమ తల్లిదండ్రుల అడుగు జాడల్లోనే నడుస్తారని, అందువల్ల నాయకుల పిల్లలను ముందుగా చంపేస్తామని ఆ లేఖలో చెప్పారు. తాజాగా పాకిస్థాన్ ఉరిశిక్ష విధించిన ఆరుగురు ఉగ్రవాదుల్లో ఒకరైన ఒమర్ షేక్.. గతంలో కాందహార్ విమాన హైజాక్ కేసులో నిందితుడు. డేనియల్ పెర్ల్ హత్య నేరం కూడా అతడిపై ఉంది. -
పిల్లలందరినీ చంపేశాం.. ఏం చేయమంటారు?
పాకిస్థాన్‌లోని పెషావర్ ఆర్మీ స్కూల్లో మారణహోమం సృష్టించిన తాలిబన్ ముష్కరులు తమ హ్యాండ్లర్లతో ఏం మాట్లాడారన్న విషయం వెలుగులోకి వచ్చింది. '' ఆడిటోరియంలో ఉన్న పిల్లలందరినీ చంపేశాం. ఏం చేయమంటారు?'' అని ఓ ఉగ్రవాది అడిగాడు. ''ఆర్మీవాళ్లు వచ్చేదాకా ఉండండి. వాళ్లని చంపేసి, తర్వాత మిమ్మల్ని మీరు పేల్చుకుని చచ్చిపొండి'' అని అటునుంచి సమాధానం వచ్చింది. ఈ విషయాన్ని భద్రతాదళానికి చెందిన ఓ అధికారి చెప్పినట్లు పాక్ పత్రిక డాన్ తెలిపింది. భద్రతాదళాలు ఉగ్రవాదుల మీద విరుచుకుపడేందుకు కొద్ది నిమిషాల ముందు గోడచాటు నుంచి విన్న మాటలివి. దాడులకు పాల్పడినవాళ్లలో ఒకరి పేరు అబుజర్ అని, అతడి కమాండర్ పేరు ఉమర్ అని సైనికులు చెప్పారు. ఉమర్ ఖలీఫా అనే సీనియర్ ఉగ్రవాది.. ఫ్రాంటియర్ రీజియన్ పెషావర్ ప్రాంతానికి చెందినవాడు. -
పెషావర్ దాడి : అంతా ఉమర్ ఆదేశాల మేరకే..!
-
అక్కడిక తొమ్మిదో తరగతి లేదు!
తాలిబన్లు అత్యంత పాశవికంగా దాడిచేసిన పెషావర్ ఆర్మీ పబ్లిక్ స్కూల్లో ఇక తొమ్మిదో తరగతి అన్నదే లేదు! దాడి జరిగిన సమయానికి అసలు స్కూలుకే వెళ్లని ఒక్క దావూద్ ఇబ్రహీం అనే విద్యార్థి మాత్రమే ఆ తరగతిలో ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. అతడి ఇంట్లో అలారం మోగకపోవడంతో స్కూలుకు వెళ్లలేకపోయాడు. ముందురోజు రాత్రి ఓ పెళ్లికి వెళ్లడంతో బాగా ఎక్కువసేపు నిద్రపోయాడు. తెల్లవారి లేచి చూసేసరికి.. తన క్లాసులో ఒక్కళ్లూ మిగల్లేదు. అంతా మరణించారు. దాంతో దావూద్.. వాళ్ల అంత్యక్రియలకు మాత్రమే వెళ్లగలిగాడు. 9 మంది తాలిబన్లు 8 గంటల పాటు అత్యంత పాశవికంగా జరిపిన దాడిలో 132 మంది విద్యార్థులు మరణించారు. వాళ్లలో చాలామందిని లైనులో నిలబెట్టి, పాయింట్ బ్లాంక్ రేంజిలో తలపై కాల్చి చంపేశారు. ఆరుగురు స్నేహితుల అంత్యక్రియలకు వెళ్లి వచ్చిన తర్వాత తన తమ్ముడి నోట మాట రావట్లేదని దావూద్ అన్న చెప్పాడు. జూడో నేర్చుకున్న దావూద్ చాలా దృఢంగానే ఉండేవాడని, కానీ అంతమందిని రక్తమోడుతూ చూసేసరికి మూగబోయాడని అన్నాడు. స్కూలు ప్రిన్సిపాల్ సహా మొత్తం 143 మంది ఈ దాడిలో మరణించారు. అలారం మూగబోవడంతో.. ఇక దావూద్ జీవితమే మూగబోయిందని అక్కడున్న ఓ పెద్దాయన వ్యాఖ్యానించారు. -
పెషావర్ మృతులకు పార్లమెంట్ శ్రద్ధాంజలి
-
ఇస్లాం రాజ్యస్థాపనే.. తాలిబన్ల లక్ష్యం..!
-
ఉగ్రదాడిలో 160 మంది విద్యార్థుల మృతి
-
చనిపోయినట్లు నటించి.. ప్రాణాలు దక్కించుకుంది!
దుండగులు అత్యాధునిక తుపాకులు ధరించి క్లాసులోకి ప్రవేశించారు. ఇష్టారాజ్యంగా కాల్పులు జరుపుతున్నారు. తోటి విద్యార్థులంతా ఒక్కొక్కరుగా రాలిపోతున్నారు. ఏం జరుగుతోందో తెలియదు. అంతలోనే ప్రాణభయం కూడా! ఆ చిన్నారికి అంతటి భయంకరమైన పరిస్థితిలో కూడా బుర్ర పాదరసంలా పనిచేసింది. చనిపోయినట్లుగా నేలమీద పడుకుండిపోయింది. ఆమె కూడా మరణించిందనుకుని.. ఉగ్రవాదులు వేరే తరగతి గదిలోకి వెళ్లిపోయారు. కాసేపటి తర్వాత ఆ చిన్నారి లేచి చూసింది. చూస్తే.. గది మొత్తం ఎటు చూసినా శవాలే. అప్పటివరకు క్లాసులో పరీక్ష రాస్తున్న సహచరులంతా ప్రాణాలు లేకుండా పడి ఉన్నారు. తలలోను, కాళ్లు, చేతుల మీద, చివరకు గుండెల్లో కూడా బుల్లెట్లు దిగిన గాయాల నుంచి రక్తం ఏరుల్లా ప్రవహిస్తోంది. అది చూసి ఆమె విలవిల్లాడిపోయింది. ఆ తరగతి గది మొత్తమ్మీద బతికి బయటపడింది ఆ చిన్నారి మాత్రమే. మిగిలినవాళ్లంతా ప్రాణాలు కోల్పోయారు. చివరకు ఎలాగోలా సైనికుల సాయంతో వెనక గేటు నుంచి తప్పించుకుని బయటపడింది. ఆమె తెలివితేటలను సైనికులతో పాటు.. అక్కడున్న వాళ్లంతా కూడా మెచ్చుకున్నారు. -
పెషావర్ స్కూల్లో ఏం జరిగిందంటే...
-
ఉన్మాదానికి సమాధానం.. తుపాకులే!
-
పాక్ ఉగ్రదాడిని ఖండించిన మోదీ
పెషావర్‌లోని పాఠశాలలో ఉగ్రవాదులు జరిపిన పిరికి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ఈ విషయమై ఆయన ట్వీట్లు చేశారు. ఇది ఏమాత్రం ఆలోచన లేని, అసలు మాట్లాడేందుకు కూడా వీల్లేనంత దారుణమైన దాడి అని, అమాయకులైన చిన్న పిల్లల ప్రాణాలను వాళ్లు తీసేశారని మోదీ చెప్పారు. పాఠశాలకు వెళ్లిన చిన్నారులను చిదిమేయడం దారుణమన్నారు. తమ సంబంధీకులను కోల్పోయిన ప్రతి ఒక్కరికి మోదీ తన మనఃపూర్వక సంతాపం తెలిపారు. వారి బాధను తానూ పంచుకుంటున్నానని, వారికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానని ఆయన అన్నారు. -
మాపై దాడులకు ప్రతీకారంగానే.. ఈ దాడి!