పిల్లలందరినీ చంపేశాం.. ఏం చేయమంటారు? | we have killed all children, what next, asks terrorist | Sakshi
Sakshi News home page

పిల్లలందరినీ చంపేశాం.. ఏం చేయమంటారు?

Published Thu, Dec 18 2014 7:42 PM | Last Updated on Sat, Mar 23 2019 8:44 PM

పిల్లలందరినీ చంపేశాం.. ఏం చేయమంటారు? - Sakshi

పిల్లలందరినీ చంపేశాం.. ఏం చేయమంటారు?

పాకిస్థాన్లోని పెషావర్ ఆర్మీ స్కూల్లో మారణహోమం సృష్టించిన తాలిబన్ ముష్కరులు తమ హ్యాండ్లర్లతో ఏం మాట్లాడారన్న విషయం వెలుగులోకి వచ్చింది. '' ఆడిటోరియంలో ఉన్న పిల్లలందరినీ చంపేశాం. ఏం చేయమంటారు?'' అని ఓ ఉగ్రవాది అడిగాడు. ''ఆర్మీవాళ్లు వచ్చేదాకా ఉండండి. వాళ్లని చంపేసి, తర్వాత మిమ్మల్ని మీరు పేల్చుకుని చచ్చిపొండి'' అని అటునుంచి సమాధానం వచ్చింది.

ఈ విషయాన్ని భద్రతాదళానికి చెందిన ఓ అధికారి చెప్పినట్లు పాక్ పత్రిక డాన్ తెలిపింది. భద్రతాదళాలు ఉగ్రవాదుల మీద విరుచుకుపడేందుకు కొద్ది నిమిషాల ముందు గోడచాటు నుంచి విన్న మాటలివి. దాడులకు పాల్పడినవాళ్లలో ఒకరి పేరు అబుజర్ అని, అతడి కమాండర్ పేరు ఉమర్ అని సైనికులు చెప్పారు. ఉమర్ ఖలీఫా అనే సీనియర్ ఉగ్రవాది.. ఫ్రాంటియర్ రీజియన్ పెషావర్ ప్రాంతానికి చెందినవాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement