taliban terrorists
-
తాలిబన్ల కాల్పుల్లో 29 మంది సిబ్బంది మృతి
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో తాలిబన్లు విరుచుకుపడ్డారు. 1980ల్లో సోవియట్ యూనియన్ ఆక్రమణకు, 1996–2001 మధ్య తాలిబన్ల పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన నాయకుడు అహ్మద్ షా మసూద్ 17వ వర్ధంతి సందర్భంగా తాలిబన్లు భద్రతా దళాలపై కాల్పులకు పాల్పడ్డారు. తాలిబన్లు జరిపిన కాల్పుల్లో 29 మంది సిబ్బంది మరణించారు. మరోవైపు మసూద్ మద్దతు దారులు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయుధాలను చేతపట్టి వాహనాలతో ర్యాలీ నిర్వహిస్తుండగా, ఆ వాహన శ్రేణి వద్ద ఓ ఉగ్రవాది ఆత్మాహుతి చేసుకోవడంతో ఏడుగురు మరణించారు. ఆత్మాహుతి దాడికి యత్నిస్తున్న మరో ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం భద్రతా దళాలు జరిపిన వైమానిక దాడుల్లో 50 మందికిపైగా తాలిబన్ ఉగ్రవాదులు మరణించారని అఫ్గాన్ అధికారులు చెప్పారు. -
భీకర కాల్పులు.. 108 మంది మృతి
-
భీకర కాల్పులు.. 108 మంది మృతి
- ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రవాదుల మెరుపుదాడి - 26 మంది సైనికుల మృతి.. 82 మంది ఉగ్రవాదులు హతం కాబుల్: ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదుల మెరుపుదాడి.. ఆ వెంటనే జవాన్ల ఎదురుదాడి.. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 10 గంటలపాటు భీకర కాల్పులు! అఫ్ఘానిస్థాన్లోని కందహార్ ఫ్రావిన్స్‌లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకూ కొనసాగిన దాడి-ప్రతిదాడిలో 26 మంది జవాన్లు చనిపోగా, 82 మంది తాలిబన్ ఉగ్రవాదులు హతమైనట్లు అఫ్ఘానిస్థాన్ రక్షణ శాఖ వెల్లడించింది. కందహార్ ఫ్రావిన్స్‌లోని ఖక్రీజ్ జిల్లా కేంద్రం శివారులో గల బేస్ క్యాంపుపై వందల మంది తాలిబన్ ఉగ్రవాదులు విరుచుకుపడ్డారని, తుపాకులతో దాడిచేస్తూ, సైనికుల వద్దనున్న ఆయుధాలను అపహరించే ప్రయత్నం చేశారని అఫ్టాన్ అధికారులు చెప్పారు. ఆ సమయంలో జవాన్లు సేదతీరుతున్నందువల్ల ప్రాణనష్టం జరిగిందని, అయితే, మిగిలిన జవాన్లు ఉగ్రవాదులను వీరోచితంగా ఎదుర్కొన్నారని, దాదాపు 80 మంది ముష్కరులను మట్టుపెట్టారని పేర్కొన్నారు. దాదాపు 10 గంటలపాటు సాగిన ఎదురుకాల్పులు బుధవారం ఉదయానికి ఆగాయని, ప్రస్తుతం ఖజ్రీజ్ ప్రాంతమంతా సైన్యం ఆధీనంలోనే ఉందని అధికారులు వెల్లడించారు. ఇక్కడి తాలిబన్ ఉగ్రవాదులు గత ఏప్రిల్ నుంచి దాడులకు పిలుపునిచ్చిన దరిమిలా అఫ్ఘాన్ రాజధాని కాబుల్ సహా దేశంలోని పలుచోట్ల వరుస దాడులు చోటుచేసుకున్నాయి. తాలిబన్లకు ఐసిస్ కూడా తోడుకావడంతో ఉగ్రవాదులు మరింతగారెచ్చిపోతున్నారు. -
ఇల్లిల్లూ గాలిస్తూ గ్యాంగ్ రేప్‌లు, హత్యలు
కాబూల్: ఆఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ల అరాచకాలకు, హింసకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. తాలిబన్లు స్వాధీనం చేసుకున్న ఉత్తర కుండజ్ ప్రావిన్స్‌లో పౌరులపై సామూహిక అత్యాచారాలకు పాల్పడుతూ.. కిరాతకంగా చంపేస్తున్నారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ వెల్లడించింది. ఆఫ్థాన్ దళాలు కుండజ్ ప్రావిన్స్‌లోని ప్రజలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని ఆ దేశంలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పరిశోధకుడు హోరియా మొసాధిక్ కోరారు. 'కుండజ్లో తాలిబన్ ఉగ్రవాదులు నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ, ఇతర ప్రభుత్వ, ఎన్జీవో ఆఫీసులను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భద్రత దళాలు, ప్రభుత్వ అధికారులు, జర్నలిస్టులు, ఎన్జీవో కార్యకర్తలు పేర్లు, ఫొటోలతో కూడిన హిట్ లిస్ట్‌ను తయారు చేశారు. వారి అడ్రెస్లు, ఫోన్ నెంబర్లూ సేకరించారు. ఉగ్రవాదులు యువకుల సాయంతో ఇంటింటికి వెళ్తూ అరాచకాలకు పాల్పడుతున్నారు. ఇళ్లలో ఉన్న మహిళలపై సామూహిక అత్యాచారాలకు పాల్పడుతూ, పిల్లలతో సహా కుటుంబ సభ్యులను కిరాతకంగా చంపేస్తున్నారు. బాధితుల్లో సైనికులు, పోలీసులు ఉన్నారు. ఇళ్లల్లో దోపిడీకి పాల్పడుతూ కుటుంబాలను హతమారుస్తున్నారు' అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ తాలిబన్ల దారుణాలను వెల్లడించింది. తాలిబన్ల ఉగ్రవాదుల అరాచకాలను కుండజ్ మెటర్నిటీ ఆస్పత్రిలో బాధితులు ఏకరువుపెట్టారు. ఉగ్రవాదులు తమ వద్ద బందీలుగా ఉన్న మగవాళ్లకు తుపాకీలు ఇచ్చి భద్రతదళాలపై దాడికి ప్రేరేపించడం, మహిళలను చిత్రహింసలు పెడుతూ సామూహిక అత్యాచారాలకు పాల్పడటం వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. -
పిల్లలందరినీ చంపేశాం.. ఏం చేయమంటారు?
పాకిస్థాన్‌లోని పెషావర్ ఆర్మీ స్కూల్లో మారణహోమం సృష్టించిన తాలిబన్ ముష్కరులు తమ హ్యాండ్లర్లతో ఏం మాట్లాడారన్న విషయం వెలుగులోకి వచ్చింది. '' ఆడిటోరియంలో ఉన్న పిల్లలందరినీ చంపేశాం. ఏం చేయమంటారు?'' అని ఓ ఉగ్రవాది అడిగాడు. ''ఆర్మీవాళ్లు వచ్చేదాకా ఉండండి. వాళ్లని చంపేసి, తర్వాత మిమ్మల్ని మీరు పేల్చుకుని చచ్చిపొండి'' అని అటునుంచి సమాధానం వచ్చింది. ఈ విషయాన్ని భద్రతాదళానికి చెందిన ఓ అధికారి చెప్పినట్లు పాక్ పత్రిక డాన్ తెలిపింది. భద్రతాదళాలు ఉగ్రవాదుల మీద విరుచుకుపడేందుకు కొద్ది నిమిషాల ముందు గోడచాటు నుంచి విన్న మాటలివి. దాడులకు పాల్పడినవాళ్లలో ఒకరి పేరు అబుజర్ అని, అతడి కమాండర్ పేరు ఉమర్ అని సైనికులు చెప్పారు. ఉమర్ ఖలీఫా అనే సీనియర్ ఉగ్రవాది.. ఫ్రాంటియర్ రీజియన్ పెషావర్ ప్రాంతానికి చెందినవాడు. -
పెషావర్ దాడి : అంతా ఉమర్ ఆదేశాల మేరకే..!
-
చనిపోయినట్లు నటించి.. ప్రాణాలు దక్కించుకుంది!
దుండగులు అత్యాధునిక తుపాకులు ధరించి క్లాసులోకి ప్రవేశించారు. ఇష్టారాజ్యంగా కాల్పులు జరుపుతున్నారు. తోటి విద్యార్థులంతా ఒక్కొక్కరుగా రాలిపోతున్నారు. ఏం జరుగుతోందో తెలియదు. అంతలోనే ప్రాణభయం కూడా! ఆ చిన్నారికి అంతటి భయంకరమైన పరిస్థితిలో కూడా బుర్ర పాదరసంలా పనిచేసింది. చనిపోయినట్లుగా నేలమీద పడుకుండిపోయింది. ఆమె కూడా మరణించిందనుకుని.. ఉగ్రవాదులు వేరే తరగతి గదిలోకి వెళ్లిపోయారు. కాసేపటి తర్వాత ఆ చిన్నారి లేచి చూసింది. చూస్తే.. గది మొత్తం ఎటు చూసినా శవాలే. అప్పటివరకు క్లాసులో పరీక్ష రాస్తున్న సహచరులంతా ప్రాణాలు లేకుండా పడి ఉన్నారు. తలలోను, కాళ్లు, చేతుల మీద, చివరకు గుండెల్లో కూడా బుల్లెట్లు దిగిన గాయాల నుంచి రక్తం ఏరుల్లా ప్రవహిస్తోంది. అది చూసి ఆమె విలవిల్లాడిపోయింది. ఆ తరగతి గది మొత్తమ్మీద బతికి బయటపడింది ఆ చిన్నారి మాత్రమే. మిగిలినవాళ్లంతా ప్రాణాలు కోల్పోయారు. చివరకు ఎలాగోలా సైనికుల సాయంతో వెనక గేటు నుంచి తప్పించుకుని బయటపడింది. ఆమె తెలివితేటలను సైనికులతో పాటు.. అక్కడున్న వాళ్లంతా కూడా మెచ్చుకున్నారు.