చనిపోయినట్లు నటించి.. ప్రాణాలు దక్కించుకుంది! | student guise as dead, could save life in peshawar school | Sakshi
Sakshi News home page

చనిపోయినట్లు నటించి.. ప్రాణాలు దక్కించుకుంది!

Published Tue, Dec 16 2014 6:57 PM | Last Updated on Sat, Sep 2 2017 6:16 PM

చనిపోయినట్లు నటించి.. ప్రాణాలు దక్కించుకుంది!

చనిపోయినట్లు నటించి.. ప్రాణాలు దక్కించుకుంది!

దుండగులు అత్యాధునిక తుపాకులు ధరించి క్లాసులోకి ప్రవేశించారు. ఇష్టారాజ్యంగా కాల్పులు జరుపుతున్నారు. తోటి విద్యార్థులంతా ఒక్కొక్కరుగా రాలిపోతున్నారు. ఏం జరుగుతోందో తెలియదు. అంతలోనే ప్రాణభయం కూడా! ఆ చిన్నారికి అంతటి భయంకరమైన పరిస్థితిలో కూడా బుర్ర పాదరసంలా పనిచేసింది. చనిపోయినట్లుగా నేలమీద పడుకుండిపోయింది. ఆమె కూడా మరణించిందనుకుని.. ఉగ్రవాదులు వేరే తరగతి గదిలోకి వెళ్లిపోయారు.

కాసేపటి తర్వాత ఆ చిన్నారి లేచి చూసింది. చూస్తే.. గది మొత్తం ఎటు చూసినా శవాలే. అప్పటివరకు క్లాసులో పరీక్ష రాస్తున్న సహచరులంతా ప్రాణాలు లేకుండా పడి ఉన్నారు. తలలోను, కాళ్లు, చేతుల మీద, చివరకు గుండెల్లో కూడా బుల్లెట్లు దిగిన గాయాల నుంచి రక్తం ఏరుల్లా ప్రవహిస్తోంది. అది చూసి ఆమె విలవిల్లాడిపోయింది. ఆ తరగతి గది మొత్తమ్మీద బతికి బయటపడింది ఆ చిన్నారి మాత్రమే. మిగిలినవాళ్లంతా ప్రాణాలు కోల్పోయారు. చివరకు ఎలాగోలా సైనికుల సాయంతో వెనక గేటు నుంచి తప్పించుకుని బయటపడింది. ఆమె తెలివితేటలను సైనికులతో పాటు.. అక్కడున్న వాళ్లంతా కూడా మెచ్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement