అఫ్గాన్‌లో అల్లకల్లోల పరిస్థితి
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో తాలిబన్లు విరుచుకుపడ్డారు. 1980ల్లో సోవియట్ యూనియన్ ఆక్రమణకు, 1996–2001 మధ్య తాలిబన్ల పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన నాయకుడు అహ్మద్ షా మసూద్ 17వ వర్ధంతి సందర్భంగా తాలిబన్లు భద్రతా దళాలపై కాల్పులకు పాల్పడ్డారు. తాలిబన్లు జరిపిన కాల్పుల్లో 29 మంది సిబ్బంది మరణించారు. మరోవైపు మసూద్ మద్దతు దారులు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయుధాలను చేతపట్టి వాహనాలతో ర్యాలీ నిర్వహిస్తుండగా, ఆ వాహన శ్రేణి వద్ద ఓ ఉగ్రవాది ఆత్మాహుతి చేసుకోవడంతో ఏడుగురు మరణించారు. ఆత్మాహుతి దాడికి యత్నిస్తున్న మరో ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం భద్రతా దళాలు జరిపిన వైమానిక దాడుల్లో 50 మందికిపైగా తాలిబన్ ఉగ్రవాదులు మరణించారని అఫ్గాన్ అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment