
రెహమ్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య
ప్రశ్న: మీ పూర్వపు భర్త ఇమ్రాన్‌ఖాన్ లైంగిక అవలక్షణాలపై మీరు పుస్తకం రాశారు. కానీ అదేమీ పాకిస్తాన్ ఓటర్లపై ప్రభావం చూపినట్లు లేదు. ఆయనిప్పుడు పాక్ ప్రధాని కాబోతున్నారు. మీరు ఆశించినట్లు జరగనందుకు నిరాశకు లోనయ్యారా?
రెహమ్ ఖాన్ : నా పుస్తకం అతడి గెలుపును అడ్డుకుంటుందన్న భ్రమ నాకు లేదు. ఇప్పుడైనా అది అతడి గెలుపు కాదు. మిలటరీ డైరెక్షన్‌లో అతడిదొక పాత్ర. అంతే. యూత్‌కి అతడు ఒక రాంగ్ రోల్ మోడల్. అతడి ప్లేబాయ్ ఇమేజ్ అతడిని ఓడించకపోవడానికి కారణం.. సమాజంలో పురుషుడంటే ఉన్న ఎక్కువ భావనే, స్త్రీ అంటే ఉన్న తక్కువ భావన తప్ప ఇంకొటి కాదు.