పాక్‌ను వీడిన ఇమ్రాన్‌ మాజీ భార్య | Imran Khans ex-wife Reham Khan leaves Pakistan after receiving threats | Sakshi
Sakshi News home page

పాక్‌ను వీడిన ఇమ్రాన్‌ మాజీ భార్య

Published Tue, Feb 6 2018 10:51 AM | Last Updated on Tue, Feb 6 2018 10:51 AM

Imran Khans ex-wife Reham Khan leaves Pakistan after receiving threats - Sakshi

ఇస్లామాబాద్‌ : తెహ్రాక్‌-ఇ-ఇన్సాఫ్‌ చీఫ్‌, ఇమ్రాన్‌ఖాన్‌ మాజీ భార్య రెహాం ఖాన్‌ పాకిస్తాన్‌ను విడిచివెళ్లారు. రెహాం ఖాన్‌ సిబ్బందికి పలుమార్లు బెదిరింపు కాల్స్‌ రావడంతో ఆదివారం రాత్రి ఆమె పాకిస్తాన్‌ను వీడివెళ్లారు. పాక్‌కు చెందిన ఓ టెలివిజన్‌ చానెల్‌కు ఈ విషయాన్ని ఆమె ధ్రువీకరించారు.

తన కుమార్తె పాఠశాల విద్యను అభ్యసిస్తున్నా బెదిరింపుల నేపథ్యంలో అనివార్యంగా పాక్‌ను వీడాల్సివచ్చిందని బ్రిటిష్‌ పాకిస్తానీ జర్నలిస్ట్‌ అయిన రెహాం ఖాన్‌ (44) ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి రెహాం రాకను ఇమ్రాన్‌ వ్యతిరేకించడంతో వీరిరువురి వివాహ బంధానికి బ్రేక్‌ పడింది. ఇమ్రాన్‌ఖాన్‌ తొలుత జెమినా గోల్డ్‌స్మిత్‌ను పెళ్లాడి ఏడేళ్లు కలిసిఉన్న తర్వాత 2004లో ఆమెతో తెగతెంపులు చేసుకున్న అనంతరం రెహాం ఖాన్‌ను వివాహం చేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement