Imran Khan Ex-Wife
-
ఆమెతో పెళ్లి.. విడాకులు.. అసలు కారణం వెల్లడించిన హీరో!
బాలీవుడ్ హీరో ఇమ్రాన్ ఖాన్ చివరిసారిగా కట్టి బట్టి చిత్రంలో కనిపించారు. ఈ సినిమాలో కంగనా రనౌత్ అతనికి జంటగా నటించింది 2008లో జెనీలియాతో కలిసి జానే తూ...యా జానే నా చిత్రంలో తొలిసారిగా మెరిసన ఇమ్రాన్.. ప్రస్తుతం గూఢచారి అనే వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.అయితే 2011లోనే అవంతిక మాలిక్‌ను ఇమ్రాన్ ఖాన్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి ఇమారా అనే కూతురు కూడా జన్మించారు. అయితే దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత తన భార్య అవంతిక మాలిక్‌తో వివాహాబంధానికి గుడ్ బై చెప్పారు హీరో. అప్పట్లో ఈ జంట విడిపోవడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఇమ్రాన్ ఖాన్ ఆమెతో విడాకులపై తొలిసారి స్పందించారు. విడిపోవడానికి గల కారణాలను వివరించారు. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.ఇంటర్వ్యూలో ఇమ్రాన్ మాట్లాడుతూ..'ఆ విషయంలోకి పెద్దగా వెళ్లాలనుకోవడం లేదు. గాసిప్స్‌కు ఆజ్యం పోయడానికి నేను సంకోచిస్తున్నా. అయితే నేను అంతర్గతంగా చాలా ఇబ్బందులు పడ్డా. ఇద్దరు వ్యక్తుల మధ్య ఆరోగ్యకరమైన బంధం ఉండాలి. అప్పుడే ఇద్దరి మధ్య బంధం బలంగా తయారవుతుంది. అంతేకాదు ఒకరికొకరు మద్దతు ఉంటూ ఉత్తమంగా నిలుస్తారు. కానీ మా ఇద్దరి మధ్య అదే లోపించింది. అందుకే విడిపోవాల్సి వచ్చింది.' అని పంచుకున్నారు. కాగా.. అవంతికను 2011లో ఇమ్రాన్‌తో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత ఇమారా అనే కుమార్తెకు తల్లిదండ్రులయ్యారు. 2019లో వీరి వివాహాబంధానికి ముగింపు పలికారు. -
ఇమ్రాన్ ఖాన్‌పై నిప్పులు కక్కిన మాజీ భార్య
Imran Khan Ex Wife Slams Pak PM: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడింది మాజీ భార్య రెహమ్ ఖాన్. ఆదివారం ఆమె ప్రయాణిస్తున్న వాహనం గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో తనపై జరిగిన హత్యాయత్నం గురించి వివరిస్తూనే.. పనిలో పనిగా మాజీ భర్త ఇమ్రాన్ ఖాన్‌పై ఆమె నిప్పులు కక్కారు. ఇమ్రాన్ పాలనలో పాకిస్థాన్ పిరికిపందలు, దుండగులు,అత్యాశపరుల రాజ్యంగా మారిందని ఆమె విమర్శలు గుప్పించారు. ‘‘ఆదివారం నా మేనల్లుడి వివాహం నుంచి తిరిగి వస్తుండగా కాల్పులు జరిగాయి. మోటర్‌బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. కాల్పులు జరిపినపుడు కారులో నా వ్యక్తిగత కార్యదర్శి, డ్రైవర్ ఉన్నారు.’’ అని రెహమ్ ఖాన్ ట్వీట్ చేశారు. On the way back from my nephew’s marriage my car just got fired at & two men on a motorbike held vehicle at gunpoint!! I had just changed vehicles. My PS & driver were in the car. This is Imran Khan’s New Pakistan? Welcome to the state of cowards, thugs & the greedy!! — Reham Khan (@RehamKhan1) January 2, 2022 కాల్పుల ఘటన తనకు ఆందోళన కలిగించిందని, భయంతో వెహికిల్స్ మారిపోయానని, అదృష్టవశాత్తూ తన సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని ఆమె చెప్పారు. అయితే కాల్పులు చేయించింది మాజీ భర్తేనా? అనే విషయంపై స్పందించలేదు. ఇదిలా ఉంటే ఘటనపై ఫిర్యాదు చేసినప్పటికీ షామ్స్ కాలనీ(ఇస్లామాబాద్) పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. దీంతో నెటిజనుల నుంచి ఆమెకు మద్దతు వెల్లువెత్తుతోంది. It’s 9 am My PS & team has not had a minute of sleep & the FIR still has not been registered in Shams Colony Police Station Islamabad. Investigation is ongoing. Waiting for a copy of the FIR. — Reham Khan (@RehamKhan1) January 3, 2022 రెహమ్ ఖాన్ పాక్ సంతతికి చెందిన ప్రముఖ బ్రిటిష్ జర్నలిస్ట్ కూడా. 2014లో ఇమ్రాన్‌ను పెళ్లాడి.. పట్టుమని పదినెలలు తిరగక ముందే విడిపోయారు. ఆపై పొలిటికల్ క్రిటిక్‌గా మారిపోయి.. మాజీ భర్తపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. 2019లో పుల్వామా దాడిపై స్పందిస్తూ.. ఇమ్రాన్ ఖాన్ దేశ(పాక్) సైన్యం చేతిలో కీలుబొమ్మగా మారిపోయాడని, భావజాలం,మితవాద విధానాలపై రాజీపడి అధికారంలోకి వచ్చాడంటూ రెహమ్ ఖాన్ బహిరంగ విమర్శలు గుప్పించింది. చదవండి: ఇమ్రాన్ ఖాన్ చావు కోసం వెయిటింగ్!! -
దావా నెగ్గిన ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య
లండన్ : పాకిస్తాన్ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రిక్ ఎ ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహం ఖాన్ పరువునష్టం దావా కేసు నెగ్గారు. కోర్టు ఆదేశాలతో నిరాధార ఆరోపణలపై సదరు వార్తా ప్రసార సంస్థ ఆమెకు బహిరంగ క్షమాపణలు చెప్పింది. వివరాలు.. ఇమ్రాన్ మాజీ భార్య, పాక్ సంతతి బ్రిటిష్ పౌరురాలు రెహమ్ ఖాన్ పాక్‌లో ఎన్నికల ముందు తన మాజీ భర్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందులో కొన్ని వ్యక్తిగత, లైంగిక విషయాలు కూడా ఉన్నాయి. అంతేకాక, పూర్తి వివరాలతో తన ఆత్మకథను రాస్తానని ఆమె అప్పడు ప్రకటించారు. ఎన్నికల్లో కాబోయే ప్రధానిగా ఇమ్రాన్ పేరు మార్మోగుతున్న తరుణంలో రెహమ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇమ్రాన్‌కు ఆమె వ్యాఖ్యలు ఇబ్బందికరంగా ఉండడంతో పార్టీలోని ఇతర నాయకులు ఆమెను టార్గెట్‌గా చేసి అనేక తీవ్ర విమర్శలు చేశారు. రెహమ్ ఆత్మకథ రాసేందుకు ఇమ్రాన్ ప్రత్యర్థి పార్టీ అయిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీ నాయకుడు షెహబాజ్ షరీఫ్ వద్ద నుంచి డబ్బు తీసుకున్నారని ప్రధానంగా ఆరోపించారు. ఇమ్రాన్‌ను రాజకీయంగా దెబ్బ తీసేందుకు రెహమ్‌ను ఆయుధంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇమ్రాన్ పార్టీ నాయకుడు, ఇప్పటి పాకిస్తాన్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ గతేడాది జూన్‌లో దునియా అనే టీవీ చానెల్లో నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ.. పైన పేర్కొన్న వ్యాఖ్యలను పరుష పదజాలంతో మరోసారి చేశారు. ఉర్దూలో ప్రసారమయ్యే దునియా చానెల్ ఇంగ్లాండ్‌లో కూడా ప్రసారమవుతుంది. అయితే రషీద్ చేసిన ఆరోపణలను ఆ చానెల్ పదే పదే ప్రసారం చేసింది. దీంతో మనస్తాపానికి గురైన రెహమ్ ఖాన్ నిరాధార ఆరోపణలతో తన పరువుకు భంగం కలిగించారంటూ లండన్‌లోని రాయల్ కోర్టులో కేసు వేసింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి మాథ్యూ నిక్లిన్ రెహమ్ ఖాన్‌కు క్షమాపణలు చెప్పి కోర్టు ఖర్చులు చెల్లించాలని సదరు టీవీ చానెల్‌ను ఆదేశించారు. జడ్జి ఆదేశాల ప్రకారం దునియా టీవీ చానెల్ రెహమ్ ఖాన్‌కు బహిరంగ క్షమాపణలు చెబుతూ, కొంత నష్ట పరిహారంతో కోర్టు ఖర్చుల్ని భరిస్తామని ప్రకటించింది. అనంతరం రెహమ్ స్పందిస్తూ.. ఈ తీర్పు వల్ల నా వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నానని, పాకిస్తాన్లో నైతిక జర్నలిజానికి ఈ తీర్పు దోహదపడుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. -
నీకసలు సిగ్గుందా.?
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ తెహ్రీక్ ఐ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్‌పై ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ నిప్పులు చెరిగారు. రెహమ్ ఖాన్ ఆత్మకథ ‘టెల్-ఆల్’ నుంచి లీకైన కొన్ని వాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఓ మహిళవై ఉండి ఇలాంటి రాతలు రాయడానికి సిగ్గుండాలని ఖలీజ్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను తన పార్టీ ఆల్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఏపీఎంఎల్) ట్వీట్ చేయగా ముషార్రఫ్ రీట్వీట్ చేశారు. ‘రెహమ్ ఖాన్‌ను పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్) (పీఎంఎల్ఎన్) తమ ఎజెండా కోసం ఉపయోగించుకుంటుంది. వాట్సాప్‌లో ఆమె పుస్తకంలోని కొన్ని వ్యాఖ్యలను చదివాను. ఇలాంటి రాతలు రాయడానికి ఆమెకు సిగ్గుండాలి. ఇలాంటి చెత్త రాతలను ప్రత్యేకించి మహిళలు రాయకూడదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. Retweeted APML (Official) (@APMLOfficial_): Reham khan is being used by PMLN i have read some content in whatsapp messages she should be quite ashamed of herself you don't write such things and specially a lady... https://t.co/QIgKIbZvVv — Pervez Musharraf (@P_Musharraf) June 15, 2018 మహిళలు ఏం మాట్లాడాలి? ముషర్రాఫ్ వ్యాఖ్యలపై రెహమ్ ఖాన్ ఘాటుగా స్పందించారు. మరీ మహిళలు ఏం మాట్లాడాలో నిర్ణయించేది ఎవరని ప్రశ్నించారు. ‘ముషర్రాఫ్ చేసిన ట్వీట్ ఎలా ఉందంటే.. మహిళలు ఏం మాట్లాడవద్దు. పురుషులు ఏం చేసినా సహిస్తూ.. గమ్మునుండాలి. మహిళలు ఏం రాయాలి, ఏం మాట్లాడాలి అని నిర్ణయించాడానికి వీళ్లేవరు. ఇది చాలా తప్పు’ అని ఈ మాజీ జర్నలిస్టు మండిపడ్డారు. పీఎంఎల్ఎన్ పార్టీతో తనకు సంబంధం ఉన్నట్లు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ‘నాకు నవాజ్ షరీఫ్ పార్టీ (పీఎంఎల్ఎన్)తో ఎలాంటి సంబంధాలు లేవు. ఆయన చాలా ధృడమైన వ్యక్తి. వారి ఎజెండాలో భాగంగా నా పుస్తకం రావడం లేదు. ఇంకా నా పుస్తకం విడుదల కూడా కాలేదు. వారి ఎజెండా ప్రకారం నేను నడుచుకోవడం లేదు.’’ అని ఆమె స్పష్టం చేశారు. రెహమ్ ఖాన్ తన పుస్తకంలో ఇమ్రాన్ ఖాన్ ఓ గే అని, పెళ్లికి ముందే తనను వేధించాడని.. మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ శృంగార అనుభవాల కోసం తన మాజీ, దివంగత సతీమణి ఓ నల్ల జాతీయుడితో సెక్స్ చేసేలా చేశాడని, ఆ తతంగాన్ని మొత్తం దగ్గరుండి చూశాడని పేర్కొనడం తీవ్ర దుమారాన్ని రేపింది. పుస్తకం విడుదల చేయడం వెనుక మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ హస్తం ఉందని పీటీఐ నేతలు ఆరోపిస్తున్నారు. పీటీఐ అధినేత ఇమ్రాన్‌ఖాన్ ఈ పుస్తకాన్ని పాకిస్తాన్లో విడుదల చేయకుండా అడ్డుకోవాలని కోర్టును సైతం ఆశ్రయించారు. చదవండి: ఇమ్రాన్ ఖాన్ ఓ గే! -
పాక్‌ను వీడిన ఇమ్రాన్ మాజీ భార్య
ఇస్లామాబాద్ : తెహ్రాక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్, ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య రెహాం ఖాన్ పాకిస్తాన్‌ను విడిచివెళ్లారు. రెహాం ఖాన్ సిబ్బందికి పలుమార్లు బెదిరింపు కాల్స్ రావడంతో ఆదివారం రాత్రి ఆమె పాకిస్తాన్‌ను వీడివెళ్లారు. పాక్‌కు చెందిన ఓ టెలివిజన్ చానెల్‌కు ఈ విషయాన్ని ఆమె ధ్రువీకరించారు. తన కుమార్తె పాఠశాల విద్యను అభ్యసిస్తున్నా బెదిరింపుల నేపథ్యంలో అనివార్యంగా పాక్‌ను వీడాల్సివచ్చిందని బ్రిటిష్ పాకిస్తానీ జర్నలిస్ట్ అయిన రెహాం ఖాన్ (44) ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి రెహాం రాకను ఇమ్రాన్ వ్యతిరేకించడంతో వీరిరువురి వివాహ బంధానికి బ్రేక్ పడింది. ఇమ్రాన్‌ఖాన్ తొలుత జెమినా గోల్డ్‌స్మిత్‌ను పెళ్లాడి ఏడేళ్లు కలిసిఉన్న తర్వాత 2004లో ఆమెతో తెగతెంపులు చేసుకున్న అనంతరం రెహాం ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. -
భార్య గిఫ్ట్ అడిగితే.. విడాకులిచ్చిన మాజీ క్రికెటర్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, పాకిస్థాన్ తెహరీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌పై ఆయన మాజీ భార్య రెహమ్ సంచలన ఆరోపణలు చేసింది. గతేడాది తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తాను గిఫ్ట్ అడిగితే, ఇమ్రాన్ గిఫ్ట్‌కు బదులు విడాకులు ఇచ్చాడని ఆరోపించింది. ఆమె ఓ పాక్ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించింది. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు వ్యతిరేకంగా నవంబరు 2న రాజధాని ఇస్లామాబాద్‌లో మహార్యాలీ నిర్వహించనున్నట్టు ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించిన నేపథ్యంలో రెహమ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గతేడాది తన విషయంలో ఇమ్రాన్ చేసినట్టుగా ఈ సారి చేయకూడదని ప్రార్థిస్తున్నట్టు వ్యాఖ్యానించింది. గతేడాది తమ వివాహ వార్షికోత్సవానికి ముందు అక్టోబర్ 31న గిఫ్ట్ ఇవ్వాలంటూ ఇమ్రాన్‌తో జోక్ చేశానని, ఊహించని విధంగా ఆయన విడాకులు ఇచ్చాడని రెహమ్ చెప్పింది. ఇంగ్లండ్‌కు చెందిన జెమీమా గోల్డ్ స్మిత్‌ను మొదట పెళ్లి చేసుకున్న ఇమ్రాన్ 2004లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. వీరిద్దరికీ ఇద్దరు కొడుకులు ఉన్నారు. రెండేళ్ల క్రితం ఇమ్రాన్ టీవీ జర్నలిస్టు రెహమ్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లయిన 10 నెలలకే ఇమ్రాన్.. రెహమ్‌కు కూడా విడాకులు ఇచ్చాడు. రాజకీయాల్లో రెహమ్ జోక్యం చేసుకున్నందుకే విభేదాలు వచ్చినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.