భార్య గిఫ్ట్‌ అడిగితే.. విడాకులిచ్చిన మాజీ క్రికెటర్‌ | Asked For Anniversary Gift, He Divorced Me Instead: Imran Khan's Ex-Wife Reham | Sakshi
Sakshi News home page

భార్య గిఫ్ట్‌ అడిగితే.. విడాకులిచ్చిన మాజీ క్రికెటర్‌

Published Mon, Oct 31 2016 5:38 PM | Last Updated on Tue, Jun 4 2019 6:39 PM

భార్య గిఫ్ట్‌ అడిగితే.. విడాకులిచ్చిన మాజీ క్రికెటర్‌ - Sakshi

భార్య గిఫ్ట్‌ అడిగితే.. విడాకులిచ్చిన మాజీ క్రికెటర్‌

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, పాకిస్థాన్ తెహరీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్పై ఆయన మాజీ భార్య రెహమ్‌ సంచలన ఆరోపణలు చేసింది. గతేడాది తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తాను గిఫ్ట్‌ అడిగితే, ఇమ్రాన్‌ గిఫ్ట్‌కు బదులు విడాకులు ఇచ్చాడని ఆరోపించింది. ఆమె ఓ పాక్‌ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించింది.

పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు వ్యతిరేకంగా నవంబరు 2న రాజధాని ఇస్లామాబాద్‌లో మహార్యాలీ నిర్వహించనున్నట్టు ఇమ్రాన్‌ఖాన్‌ ప్రకటించిన నేపథ్యంలో రెహమ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గతేడాది తన విషయంలో ఇమ్రాన్‌ చేసినట్టుగా ఈ సారి చేయకూడదని ప్రార్థిస్తున్నట్టు వ్యాఖ్యానించింది. గతేడాది తమ వివాహ వార్షికోత్సవానికి ముందు అక‍్టోబర్‌ 31న గిఫ్ట్‌ ఇవ్వాలంటూ ఇమ్రాన్‌తో జోక్‌ చేశానని, ఊహించని విధంగా ఆయన విడాకులు ఇచ్చాడని రెహమ్‌ చెప్పింది.

ఇంగ్లండ్‌కు చెందిన జెమీమా గోల్డ్‌ స్మిత్‌ను మొదట పెళ్లి చేసుకున్న ఇ‍మ్రాన్‌ 2004లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. వీరిద్దరికీ ఇద్దరు కొడుకులు ఉన్నారు. రెండేళ్ల క్రితం ఇమ్రాన్‌ టీవీ జర్నలిస్టు రెహమ్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లయిన 10 నెలలకే ఇమ్రాన్‌.. రెహమ్‌కు కూడా విడాకులు ఇచ్చాడు. రాజకీయాల్లో రెహమ్‌ జోక్యం చేసుకున్నందుకే విభేదాలు వచ్చినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement