Reham
-
భార్య గిఫ్ట్ అడిగితే.. విడాకులిచ్చిన మాజీ క్రికెటర్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, పాకిస్థాన్ తెహరీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌పై ఆయన మాజీ భార్య రెహమ్ సంచలన ఆరోపణలు చేసింది. గతేడాది తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తాను గిఫ్ట్ అడిగితే, ఇమ్రాన్ గిఫ్ట్‌కు బదులు విడాకులు ఇచ్చాడని ఆరోపించింది. ఆమె ఓ పాక్ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించింది. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు వ్యతిరేకంగా నవంబరు 2న రాజధాని ఇస్లామాబాద్‌లో మహార్యాలీ నిర్వహించనున్నట్టు ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించిన నేపథ్యంలో రెహమ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గతేడాది తన విషయంలో ఇమ్రాన్ చేసినట్టుగా ఈ సారి చేయకూడదని ప్రార్థిస్తున్నట్టు వ్యాఖ్యానించింది. గతేడాది తమ వివాహ వార్షికోత్సవానికి ముందు అక్టోబర్ 31న గిఫ్ట్ ఇవ్వాలంటూ ఇమ్రాన్‌తో జోక్ చేశానని, ఊహించని విధంగా ఆయన విడాకులు ఇచ్చాడని రెహమ్ చెప్పింది. ఇంగ్లండ్‌కు చెందిన జెమీమా గోల్డ్ స్మిత్‌ను మొదట పెళ్లి చేసుకున్న ఇమ్రాన్ 2004లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. వీరిద్దరికీ ఇద్దరు కొడుకులు ఉన్నారు. రెండేళ్ల క్రితం ఇమ్రాన్ టీవీ జర్నలిస్టు రెహమ్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లయిన 10 నెలలకే ఇమ్రాన్.. రెహమ్‌కు కూడా విడాకులు ఇచ్చాడు. రాజకీయాల్లో రెహమ్ జోక్యం చేసుకున్నందుకే విభేదాలు వచ్చినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. -
ఆయనతో పెళ్లంటే..
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ లెజెండ్, ప్రముఖ రాజకీయ నాయకుడు ఇమ్రాన్ ఖాన్, రెహం ఖాన్ విడాకుల విషయంలో ఆయన భార్య, జర్నలిస్టు భార్య రెహం ఖాన్ ఎట్టకేలకు స్పందించారు. తనను వంట ఇంటికి పరిమితం చేసే కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందని వ్యాఖ్యానించారు. చపాతీలు చేస్కో కానీ, బయటకు రావద్దని తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీలోని పెద్దలు తనను ఆదేశించారన్నారు. రెండు వారాల తర్వాత తొలిసారిగా నోరువిప్పిన ఆమె తాము విడిపోవడానికి గల కారణాలను మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని వివాదాస్పద కమెంట్లు చేశారు. 'నన్ను ప్రేమిస్తున్నానని నమ్మించిన వ్యక్తి ని పెళ్లి చేసుకున్నా....ఇద్దరం ఒంటరిగా ఉన్నాం.. ఇద్దరి కష్టాలు.. భావాలు,లక్ష్యం ఒకటే అని నేను నమ్మాను..కానీ మేం పూర్తిగా ఒకరికొకరం భిన్నమని వ్యాఖ్యానించారు. ఇమ్రాన్ తో వివాహ జీవితం ఒక స్వర్గంలా ఉంటుందనుకున్నా, కానీ అంతా తారుమారైంది. ఆయనతో రాజకీయాలు తప్ప, ఇంటి విషయాలు కానీ, కనీసం బాలీవుడ్ సినిమాల గురించి కానీ మరే విషయాలే మాట్లాడే అవకాశం ఉండదని వాపోయారు. ఈ విషయంలో తాను ఎంత మధనపడిందీ ఆ భంగవంతుడికి తెలుసని వ్యాఖ్యానించారు. అసలు ఇమ్రాన్ తో పెళ్లి అయిన దగ్గర్నించి తాను చాలా విధాలుగా నష్టపోయాయనన్నారు. కూతురుతో సహా, ఇస్లామాబాద్ లోని ఇమ్రాన్ నివాసానికి చేరుకున్నప్పటినుంచి అణచివేత మొదలైందని ఆరోపించారు. తన కరీర్ మొత్తం చిక్కుల్లో పడిందనీ, ముఖ్యంగా పెషావర్ లో వీధి బాలల కోసం ప్రతినిధిగా ఎంపికైనప్పటినుంచీ మరిన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కానీ, దీనికి సంబంధించి ఒక్క సమావేశానికి కూడా హాజరు కాలేకపోయానని, తీవ్రమైన అభద్రతా భావం వెంటాడిందన్నారు. భర్త ఇమ్రాన్ తో సత్సంబంధాలు కొనసాగాలనే ఉద్దేశంతోనే చాలా టెలివిజన్ షో లను వదులుకున్నానని చెప్పారు. అయినా తన మీద అసత్య ఆరోపణలతో దాడి చేశారన్నారు. ఇకముందు పాకిస్తాన్ వీధి బాలల కోసం తన పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. ఈ క్రమంలో రెండు సినిమాలను నిర్మించే ఆలోచనలో రెహం ఖాన్ ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకోవాల్సి అవసరం ఉందన్నారు. ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్న ఇమ్రాన్, రెహం ఖాన్ కనీసం ఏడాది తిరగక ముందే విడాకులు తీసుకుంటున్నట్టుగా ప్రకటించారు. అయితే ఈ విడాకుల విషయంలో అనేక కథనాలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. -
ఇమ్రాన్ హత్యకు రెండో భార్య కుట్ర?
పాకిస్థాన్ రాజకీయ నాయకుడు, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌ను అతని రెండో భార్య రెహమ్ విషమిచ్చి చంపాలనుకుందా.. తద్వారా అతని రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలని ప్లాన్ వేసిందా? అందుకోసమే ఇద్దరి మధ్య ఘర్షణ.. తత్ఫలితంగానే తలాఖ్ వరకు వ్యవహారం వెళ్లిందని తాజాగా తెలుస్తోంది. చివరకు పాక్ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఇమ్రాన్‌ను ఆయన సన్నిహితుల ద్వారా ఈ విషయమై హెచ్చరించాయట. పాకిస్థాన్ తెహ్రిక్ ఇన్ సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ రెండో భార్య రెహమ్‌కు విడాకులు ఇచ్చిన నేపథ్యంలో ఇపుడు ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్టు అరిఫ్ నిజామి స్థానిక మీడియాతో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లిద్దరు పరస్పరం అంగీకారంతో విడాకులు తీసుకున్నారన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. పార్టీ వ్యవహారాలను తనకు చెప్పాల్సిందిగా రెహమ్ ఇబ్బంది పెట్టిందని, ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగిందని చెప్పుకొచ్చారు. ఆమెను లండన్‌లో జరుగుతున్న మీటింగ్‌కు పంపించి, ఆమెకు డైవోర్స్ నోటీసును ఈ -మెయిల్ ద్వారా పంపించారన్నారు. ఇమ్రాన్ జీవితాన్ని రెహమ్ నరకంగా మార్చివేసిందనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఇమ్రాన్ సన్నిహితుల ద్వారా అతణ్ని హెచ్చరించాయని తెలిపారు. ఆమె అతణ్ని మట్టుబెట్టే అవకాశాలున్నాయనే అనుమానాల్ని వ్యక్తం చేశాయన్నారు. అసలు రెహమ్ - ఇమ్రాన్ పెళ్లి జరగకుండా ఉండేందుకు తాను గట్టిగా ప్రయత్నించానన్నాడు. ఒకదశలో ఇమ్రాన్‌కు దూరంగా ఉండాలని రెహమ్‌ను తాను హెచ్చరించినట్టు కూడా తెలిపారు. అయినా తమ సలహాను ఇమ్రాన్ లక్ష్యపెట్టలేదన్నారు. ఇమ్రాన్‌కు అత్యంత సన్నిహితుడైన మరో జర్నలిస్టు షాహిద్ మసూద్ కూడా నిజామి వ్యాఖ్యలను సమర్ధించారు. ఇటీవల ఇమ్రాన్ ఖాన్ అస్వస్థతకు గురైనపుడు వైద్య పరీక్షలు చేయించగా. అతడి శరీరంలో ఎలకల మందుకు సంబంధించిన అవశేషాలు లభించాయన్నారు. కాగా 63 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్, టీవీ జర్నలిస్ట్ రెహమ్ ఇద్దరూ 2014 డిసెంబర్ నెలలో పెళ్లి చేసున్నారు. ఏడాది తిరగక ముందే ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని ప్రకటించడం సంచలనం రేపింది. -
ఇమ్రాన్ ఖాన్-రెహమ్ లు విడిపోయారు!
ఇస్లామాబాద్:మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహరిక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ తన 10 నెలల వైవాహిక జీవితం అనంతరం రెండో భార్య రెహమ్ ఖాన్ నుంచి విడాకులు తీసుకున్నాడు. ఈ విషయాన్ని పీటీఐ అధికార ప్రతినిధి నయిమూల్ హక్ ధృవీకరించాడు. వీరిద్దరూ పరస్పర అంగీకారం మేరకు విడాకులు తీసుకున్నట్లు ఇమ్రాన్ అధికార ఫేస్ బుక్ లో స్పష్టం చేశాడు. బీబీసీలో ప్రసారమయ్యే 'సౌత్ టుడే' అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా పని చేసిన రెహమ్ ఖాన్ ను ఇమ్రాన్ గత జనవరిలో వివాహం చేసుకున్న సంగత తెలిసిందే. ఆమెకు గతంలో పెళ్లయి.. ముగ్గురు పిల్లలు ఉన్నారు. అంతకుముందు జెమీమా ఖాన్‌ను పెళ్లి చేసుకున్న ఇమ్రాన్.. ఆమెకు 2004లోనే విడాకులు ఇచ్చేశాడు. ఆ దంపతులకు ఇద్దరు కొడుకులున్నారు. వీరిద్దరూ తమ వైవాహిక జీవితంలో ముందుకు సాగుదామని ప్రయత్నించినా కొన్ని పరిస్థితులు కారణంగా విడాకులు తీసుకున్నారు. దీనిపై ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ.. ఇది తనతో పాటు, ఆమె కుటుంబానికి కూడా అత్యంత బాధ కల్గించే విషయమన్నాడు. తమ స్వేచ్ఛలో భాగంగానే విడాకులు తీసుకున్నట్లు తెలిపాడు. This is a painful time for me & Reham & our families. I would request everyone to respect our privacy. — Imran Khan (@ImranKhanPTI) October 30, 2015