ఇమ్రాన్ ఖాన్-రెహమ్ లు విడిపోయారు! | Imran Khan, Reham divorce with mutual consent | Sakshi
Sakshi News home page

ఇమ్రాన్ ఖాన్-రెహమ్ లు విడిపోయారు!

Published Fri, Oct 30 2015 3:03 PM | Last Updated on Sun, Sep 3 2017 11:44 AM

ఇమ్రాన్ ఖాన్-రెహమ్ లు విడిపోయారు!

ఇమ్రాన్ ఖాన్-రెహమ్ లు విడిపోయారు!

ఇస్లామాబాద్:మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహరిక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ తన 10 నెలల వైవాహిక జీవితం అనంతరం రెండో భార్య రెహమ్ ఖాన్ నుంచి విడాకులు తీసుకున్నాడు. ఈ విషయాన్ని పీటీఐ అధికార ప్రతినిధి నయిమూల్ హక్  ధృవీకరించాడు. వీరిద్దరూ పరస్పర అంగీకారం మేరకు విడాకులు తీసుకున్నట్లు ఇమ్రాన్ అధికార ఫేస్ బుక్ లో స్పష్టం చేశాడు.

 

బీబీసీలో ప్రసారమయ్యే 'సౌత్ టుడే' అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా పని చేసిన రెహమ్ ఖాన్ ను ఇమ్రాన్ గత జనవరిలో వివాహం చేసుకున్న సంగత తెలిసిందే. ఆమెకు గతంలో  పెళ్లయి.. ముగ్గురు పిల్లలు ఉన్నారు. అంతకుముందు జెమీమా ఖాన్ను పెళ్లి చేసుకున్న ఇమ్రాన్.. ఆమెకు 2004లోనే విడాకులు ఇచ్చేశాడు. ఆ దంపతులకు ఇద్దరు కొడుకులున్నారు. వీరిద్దరూ తమ వైవాహిక జీవితంలో ముందుకు సాగుదామని ప్రయత్నించినా కొన్ని పరిస్థితులు కారణంగా విడాకులు తీసుకున్నారు. దీనిపై ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ.. ఇది తనతో పాటు, ఆమె కుటుంబానికి కూడా అత్యంత బాధ కల్గించే విషయమన్నాడు. తమ స్వేచ్ఛలో భాగంగానే విడాకులు తీసుకున్నట్లు తెలిపాడు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement